తెలుగు న్యూస్ / ఫోటో /
Green Banana: అరటిపండును మధుమేహులు తినలేరు, అరటికాయను తినొచ్చా?
- Green Banana or raw banana benefits: అరటికాయ మధుమేహం, గుండె ఆరోగ్యం, బరువు తగ్గడానికి అద్భుతమైన ప్రయోజనాలను కలిగి ఉందని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు.
- Green Banana or raw banana benefits: అరటికాయ మధుమేహం, గుండె ఆరోగ్యం, బరువు తగ్గడానికి అద్భుతమైన ప్రయోజనాలను కలిగి ఉందని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు.
(1 / 7)
అరటికాయలు పండిన వాటి వలె మంచి రుచిని కలిగి ఉండకపోవచ్చు, కానీ వీటిని ఉడకబెట్టడం, ఆవిరి చేయడం లేదా వేయించడం ద్వారా రుచికరమైన వంటకాలను తయారు చేసువచ్చు. పోషకాహార నిపుణురాలు లోవ్‌నీత్ బాత్రా అరటికాయ ప్రయోజనాల గురించి వివరించారు. (Freepik)
(2 / 7)
అరటికాయతో క్రిస్పీ బనానా చిప్స్, బనానా స్టైర్ ఫ్రై, కోఫ్తా , సూప్‌లను తయారుచేయవచ్చు. అరటికాయలు అధిక ఫైబర్ కంటెంట్‌ను కలిగి ఉంటాయి, కాబట్టి జీర్ణక్రియకు గొప్పవి, మధుమేహం ఉన్నవారికి సైతం ఆదర్శవంతమైన ఆహారం. (Pinterest)
(3 / 7)
అరటికాయలో అత్యధిక శాతం ఫినోలిక్ సమ్మేళనాలు ఉన్నాయి. ఈ బంధిత ఫైటోకెమికల్స్ కడుపు, చిన్న ప్రేగు జీర్ణక్రియను తట్టుకుని పెద్దప్రేగుకు చేరుకోగలవు. ఈ సమ్మేళనాలు వివిధ ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి. (Pinterest)
(4 / 7)
అరటికాయలు హృదయానికి అనుకూలమైన పోషకాల ప్రొఫైల్‌ను కలిగి ఉంటాయి. ఇవి పొటాషియంకు అద్భుతమైన మూలం, ఇది కండరాలు కుదించడానికి, రక్తపోటును నియంత్రించడానికి, గుండె లయను నిర్వహించడానికి సహాయపడే సహజ వాసోడైలేటర్‌గా పనిచేస్తుంది. (Freepik)
(5 / 7)
అరటికాయలలోని పెక్టిన్, రెసిస్టెంట్ స్టార్చ్ రెండూ కూడా భోజనం తర్వాత రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి. పండని పచ్చని అరటికాయల గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువే, దీని విలువ 30 మాత్రమే. (Freepik)
(6 / 7)
అరటికాయలు యాంటీ ఆక్సిడెంట్ల స్టోర్‌హౌస్, ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి, ఆరోగ్యకరమైన కణాలకు ఆక్సీకరణ నష్టం జరగకుండా నిరోధించడంలో సహాయపడతాయి. విటమిన్ సి, బీటా-కెరోటిన్, లుటిన్ , జియాక్సంతిన్ వంటి ఇతర ఫైటోన్యూట్రియెంట్లు అందిస్తాయి. (Freepik)
ఇతర గ్యాలరీలు