Anti Valentine's Week 2023 : 'లవర్స్ డే' తర్వాత ఈడ్చి కొట్టే 'డే' కూడా ఉందండోయ్-anti valentines week list 2023 slap day kick day to break up day significance fun facts and all you need to know here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Anti Valentine's Week 2023 : 'లవర్స్ డే' తర్వాత ఈడ్చి కొట్టే 'డే' కూడా ఉందండోయ్

Anti Valentine's Week 2023 : 'లవర్స్ డే' తర్వాత ఈడ్చి కొట్టే 'డే' కూడా ఉందండోయ్

Anand Sai HT Telugu
Feb 03, 2023 12:53 PM IST

Valentine's Week 2023 : ఫిబ్రవరి 14వ తేదీన లవర్స్ డే.. ప్రేమికులు అంతా ఎంతగానో ఎదురుచూసే రోజు. వారం ముందుగానే అంటే ఫిబ్రవరి 7 నుంచే ప్రేమికుల రోజుకు సంబంధించి.. వారోత్సవంలాగా మెుదలవుతుందన్నమాట. అయితే మరో ఇంట్రస్టింగ్ విషయం ఏంటో తెలుసా? ఫిబ్రవరి 14 తర్వాత కూడా ప్రేమికులు జరుపుకొనే రోజులు ఉన్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (twitter)

వాలెంటైన్స్ డే(valentines day)కు సంబంధించి.. ఫిబ్రవరి 7న ప్రారంభమై ఫిబ్రవరి 14 వరకు కొనసాగుతుంది. ప్రేమికులు తాము ఇష్టపడే వారిని.. రోజుకో విధంగా కొత్త కాన్సెప్ట్ తో దగ్గరయ్యే వారం అన్నమాట ఇది. రోజ్ డే(Rose Day)తో మెుదలవుతుంది. ఫిబ్రవరి 7న ఇది ఉంటుంది. తమకు ఇష్టమైన వ్యక్తికి గులాబీలు ఇస్తారు. ప్రేమ

ఫిబ్రవరి 8న ప్రపోజ్ డే(propose day)గా చూస్తారు. ప్రేమిస్తున్న వారికి అసలు విషయం చెప్పేస్తారన్నమాట. ఫలితం ఎలా ఉన్నా.. ఈరోజు ప్రయత్నం చేసేస్తారు. అందుకోసం ఓ ప్రత్యేకమైన రోజును పెట్టుకున్నారు. ఫిబ్రవరి 9న చాక్లెట్ డే(Chocolate Day).. ఈరోజున ప్రియమైన వారికి చాక్లెట్లు ఇస్తారు.

ఫిబ్రవరి 10న టెడ్డీ డే(Teddy Day)ను చేసుకుంటారు. ముందురోజు చాక్లెట్లు ఇచ్చాక.. ఇక ఆకర్షించేది క్యూట్‌గా ఉండే టెడ్డీ బేర్‌. తమ ప్రియమైన వారికి వీటిని అందిస్తారు. ఇష్టాన్ని చెప్పడంలో టెడ్డీబేర్ కూడా ముఖ్యమైన గిఫ్ట్. ఓకే అయితే అమ్మాయిలు ఆ టెడ్డీనే.. తమ ప్రియుడిగా చూసుకుంటారు. ఫిబ్రవరి 11ను ప్రామిస్ డే(Promise Day) అంటారు. ఇష్టపడే వారికి అర్థవంతమైన ప్రామిసులు చేయడం, పరస్పర ప్రమాణాలు చేసుకుంటారు.

ఫిబ్రవరి 12న హగ్ డే(Hug Day). బంధం ఏదైనా కొన్ని సందర్భాల్లో మాటల కంటే కౌగిలింత ఎక్కువ భావాన్ని వ్యక్తం చేస్తుంది. ఎదుటి మనిషి మనసును తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఇక ఫిబ్రవరి 13న కిస్ డే(Kiss Day).. వాలెంటైన్ డే ముందు రోజు ఇది. ప్రేమగా కిస్ చేసుకుని.. ఒకరికళ్లలోకి ఒకరు చూసుకుంటారు. ఫిబ్రవరి 14 లవర్స్ డే(Lovers Day). ఈ మెుత్తాన్ని వాలంటైన్స్ వీక్ గా అంటారు.

ఫిబ్రవరి 14 లవర్స్ డే తర్వాత ఏంటి

సరే ఇదంతా.. ఒకే. మరి లవర్స్ డే మరుసటి రోజు ఏం ఉండదా అనుకుంటున్నారా? అప్పుడు కూడా కొన్ని రోజులు ఉన్నాయి. కానీ ఇవీ మిమ్మల్ని కాస్త హర్ట్ చేసే రోజులు అన్నమాట. స్లాప్ డే(Slap Day), కిక్ డే(Kick Day) ఇలా ఉన్నాయన్నమాట. ఎవరికైనా ద్వేషం ఉంటే.. ఈరోజుల్లో చూపించొచ్చని వాటి అర్థం.

వాలెంటైన్స్ డే ముగిసిపోయింది.. ఇక ఆనందంగా ఉందాం అనుకుంటే మీరు పొరబడినట్టే.. స్లాప్ డే అనేది ఫిబ్రవరి 15న రావడం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ రోజున తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తారు. తమకు ఎవరి మీదైనా ద్వేషం ఉంటే.. చెంపమీద ఒక్కటిస్తారన్నమాట. తర్వాత ఫిబ్రవరి 16న కిక్ డే వస్తుంది. తమ ప్రేమకు సంబంధించిన వ్యక్తిని తరిమికొట్టే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత, పెర్ఫ్యూమ్ డే ఫిబ్రవరి 17న ఉంటుంది.

ఫిబ్రవరి 18న ఫ్లర్టింగ్ డే(Flirting Day).. మీరు ఏదైనా విషయాన్ని బయటకు అడగాలనుకుంటే ఇది మీ సమయం. ఆ వ్యక్తిని అడగండి, కొత్త వ్యక్తులను కలవొచ్చన్నమాట. ఫిబ్రవరి 19న, కన్ఫెషన్ డే రోజున ఏ విషయాన్నైనా.. నేరుగా చెప్పేయాలి. మీరు ఎవరితోనైనా మనసు విప్పి చెప్పడానికి, ఎలా భావిస్తున్నారో వారికి చెప్పడానికి ఇది సరైన అవకాశం. మీరు ఇంతకు ముందు ఎవరికీ చెప్పని గత తప్పులను కూడా మీరు ఒప్పుకోవచ్చు.

ఫిబ్రవరి 20న మిస్సింగ్ డే(Missing Day).., ప్రేమికులు తమ మాజీ భాగస్వాములను గుర్తు చేసుకుంటారు. మీకు ఇష్టమైన వ్యక్తిని మీరు మిస్ అవుతున్నారని తెలియజేయడానికి, మీ నిజమైన భావాలను వ్యక్తీకరించడానికి ఇది సమయం. ఒక స్నేహితుడు, కుటుంబ సభ్యుడు, క్రష్ కావచ్చు.

ఫిబ్రవరి 21న వచ్చే బ్రేకప్ డే(Breakup Day)తో యాంటీ వాలెంటైన్స్ వీక్ ముగుస్తుంది. మీకు నచ్చకుంటే వెళ్లిపోవచ్చు కూడా. మీరు ప్రేమించే వ్యక్తితో అలసిపోతే.. బ్రేకప్ డేరోజున చెప్పేసి.. మీ స్వేచ్ఛను ఎంచుకోవడానికి సరైన అవకాశం. అలా వాలెంటైన్ వీక్ తర్వాత.. యాంటీ వాలెంటైన్ వీక్ కూడా ఉంటుంది.

Whats_app_banner