Valentine's Day | వాలెంటైన్స్‌ డే గూగుల్‌ డూడుల్‌ గేమ్‌ ఆడారా?-google doodle game on valentines day is fun filled ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Valentine's Day | వాలెంటైన్స్‌ డే గూగుల్‌ డూడుల్‌ గేమ్‌ ఆడారా?

Valentine's Day | వాలెంటైన్స్‌ డే గూగుల్‌ డూడుల్‌ గేమ్‌ ఆడారా?

Hari Prasad S HT Telugu
Feb 14, 2022 09:12 AM IST

Valentine's Day | ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులంతా ఏడాది మొత్తం ఆసక్తిగా చూసేది ఈ ఒక్క రోజు కోసమే. ప్రేమను పండుగలా జరుపుకునే రోజే వాలెంటైన్స్‌ డే.

<p>వాలెంటైన్స్ డే సందర్భంగా గూగుల్ డూడుల్ గేమ్&nbsp;</p>
వాలెంటైన్స్ డే సందర్భంగా గూగుల్ డూడుల్ గేమ్ (Google)

న్యూఢిల్లీ: గూగుల్‌ కేవలం ఓ సెర్చ్‌ ఇంజిన్‌గానే కాదు.. ప్రతి రోజూ ఓ కొత్త అనుభూతితో యూజర్లను ఆకట్టుకుంటుంది. ఏడాది పొడుగునా కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో దానికి సంబంధించిన వినూత్నమైన డూడుల్‌ను తీసుకొస్తుంది. వీటిలో చిన్న చిన్న గేమ్స్‌ కూడా ఉంటాయి. 

ఇప్పుడు వాలెంటైన్స్‌ డే సందర్భంగా కూడా ఓ చిన్న గేమ్‌ను ఈ డూడుల్‌ ద్వారా తీసుకొచ్చింది. ఈ గేమ్‌ ద్వారా గూగుల్‌కు అటూ, ఇటూ ఉండే ఇద్దరు ప్రేమికులను కలిపే బాధ్యతను మనకు అప్పగించింది. కింద ఉండే నాలుగు బటన్లను ఉపయోగించి.. గూగుల్‌ అనే అక్షరాల్లో మార్పులు చేయడం ద్వారా ఈ ఇద్దరు ప్రేమికులు కలుసుకుంటారు. 

గేమ్ ఎలా ఆడాలి?

GOOGLEలో ఉండే తొలి O అనే అక్షరం, రెండో G, L అనే అక్షరాలను సరి చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే కింద మీకు హార్ట్‌ సింబల్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే రెండు వైపులా ఉన్న ప్రేమికులు కలుసుకుంటారు. అంతే ఈ గేమ్‌లో మీరు గెలిచినట్లే. ఇది 30 సెకన్లపాటు సాగే గేమ్‌. పిల్లల నుంచి పెద్దల వరకూ ఎవరైనా సులువుగా ఆడొచ్చు. ఆ కింద ఉంటే బటన్లను ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే చాలు. ఈ గేమ్‌ను సులువుగా గెలవచ్చు.

వాలెంటైన్స్‌ డే విశేషాలు

- ప్రతి ఏటా వాలెంటైన్స్‌ డే రోజు ప్రపంచవ్యాప్తంగా 14.5 కోట్ల వాలెంటైన్స్‌ డే కార్డులు పంచుకుంటారు

- క్రిస్మస్‌ తర్వాత ఎక్కువ కార్డులు పంపుకునే పండుగ ఇదే

- వీటిలో 85 శాతం వాలెంటైన్స్‌ను యువతులే కొంటారట

- కొన్ని శతాబ్దాల కిందటి వరకూ ఈ వాలెంటైన్స్‌ డేని కేవలం అమెరికా, ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియాల్లోనే జరుపుకునే వారు

- 17వ శతాబ్దంలో యూకేలో ఈ రోజును జరుపుకోవడం ప్రారంభించిన తర్వాత అది మెల్లగా ఖండాలు దాటి ప్రపంచమంతా విస్తరించింది

- వాలెంటైన్స్‌ డేను ఫిన్లాండ్‌లో ఫ్రెండ్స్‌ డేగా, గ్వాటెమాలాలో డే ఆఫ్ లవ్‌ అండ్‌ ఫ్రెండ్‌షిప్‌గా జరుపుకుంటారు

Whats_app_banner

సంబంధిత కథనం