వీకెండ్​లో కూడా స్ట్రెస్​గా ఉందా? అయితే నవ్వేయండి.. హగ్ ఇచ్చేయండి..-these 5 techniques will help you keep you stress at bay beat stress for life by practicing these therapies ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  These 5 Techniques Will Help You Keep You Stress At Bay Beat Stress For Life By Practicing These Therapies

వీకెండ్​లో కూడా స్ట్రెస్​గా ఉందా? అయితే నవ్వేయండి.. హగ్ ఇచ్చేయండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Dec 10, 2022 11:37 AM IST

Stress Management : స్ట్రెస్ అనేది జలుబు, తుమ్ములు అన్నంత కామన్​గా మారిపోయింది. వర్క్ డేస్​లో అంటే.. పనిలో ప్రెజర్ ఉంది అనుకోవచ్చు. కానీ మీకు వీకెండ్​లో కూడా స్ట్రెస్ తీసుకుంటున్నారంటే.. సమస్య తీవ్రతను గుర్తించాలి. అయితే కొన్ని మార్పులు చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

స్ట్రెస్
స్ట్రెస్

Stress Management : ఒత్తిడి అనేది జీవితంలో అంతర్భాగం. ఇది కొంతమందిని ఇది చాలా ఇబ్బంది పెడుతుంది. మానసికంగా, శారీరకంగా కూడా కృంగదీస్తుంది. సరైన సమయంలో ఒత్తిడిపై శ్రద్ధ చూపించకపోతే.. అది మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి దాని గురించి శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. జీవనశైలిలో కొన్ని మార్పులు చేస్తే.. మీరు కచ్చితంగా ఈ సమస్య నుంచి బయటపడుతారు అంటున్నారు నిపుణులు.

యోగా, ధ్యానంతో..

యోగా, ధ్యానం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. కొన్ని తేలికపాటి శారీరక వ్యాయామాలు చేయడం వల్ల కూడా.. మీకు మంచి ఫలితం ఉంటుంది. క్రమం తప్పకుండా శరీరాన్ని స్ట్రెచ్ చేయడం, లోతుగా శ్వాసలు తీసుకోవడం వల్ల మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మిమ్మల్ని శాంతింపజేస్తుంది. మనస్సుకు విశ్రాంతి అనుభూతిని కలిగిస్తుంది. ధ్యానం అనేది ప్రయోజనకరమైన మరొక సాంకేతికత.

దీనికోసం మీకు కావలసిందల్లా.. మీ ఇంట్లోని ఓ ప్రశాంతమై ప్లేస్ ఉంటే చాలు. మీరు ఏకాగ్రతతో ప్రశాంతంగా కూర్చోవచ్చు. లేదా పడుకోవచ్చు. శ్వాస మీద ధ్యాస ఉంచుతూ.. ధ్యానం చేయండి. ఇది మిమ్మల్ని ఒత్తిడి నుంచి దూరం చేస్తుంది.

మంచి ఫుడ్ తీసుకోండి..

మంచి ఫుడ్ మీ మూఢ్​ని కచ్చితంగా మార్చేస్తుంది. ఇది అన్ని సమస్యలను దూరం చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మంచి ఆహారపు అలవాట్లు ఒక వ్యక్తిని శారీరకంగా, మానసికంగా దృఢంగా మారుస్తాయి.

మీరు సింపుల్‌గా టెన్షన్‌ను దూరం చేసుకోవాలి అనుకుంటే మీకు నచ్చిన ఫుడ్ తినండి. అంతేకాకుండా వంట చేయడం కూడా మీ స్ట్రెస్​ని దూరం చేస్తుంది అంటున్నారు. అంతేకాకుండా సమతుల్య ఆహారం మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. చేపలు, చికెన్, కూరగాయలు, గింజలు శరీరానికి అవసరమైన పోషణను అందిస్తాయి.

నిద్రకు కచ్చితంగా ప్రాధన్యత ఇవ్వాలి

ఒత్తిడిని తగ్గించుకోవడంలో నిద్ర చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇది మనస్సును పునరుజ్జీవింపజేయడానికి సహాయపడుతుంది. తినడం, వ్యాయామం చేయడంతో పాటు.. మీ నిద్ర నాణ్యత కూడా ఒత్తిడి తగ్గించుకోవడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.

ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని పొందాలనుకుంటే.. రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోవాలి అంటున్నారు నిపుణులు. మీరు నిద్రించే ప్రదేశం కూడా ముఖ్యమైనది. పరిశుభ్రమైన పరిసరాలు, డిమ్ లైట్లు, సౌకర్యవంతమైన దిండ్లు, దుప్పట్లు పడకగది పరిశుభ్రత.. మీ నిద్రలో కీలక పాత్రను పోషిస్తాయి. తక్కువ నిద్ర మిమ్మల్ని చిరాకుగా, అలసిపోయేలా చేస్తుంది.

మసాజ్ చాలా మంచిది..

మంచి మసాజ్ అనేది మీ స్ట్రెస్​ వదిలించడంలో ముందు ఉంటుంది. ఇదొక స్వీయ-ప్రేమ టెక్నిక్​గా చెప్పవచ్చు. ఇది మీకు కచ్చితంగా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. మీకు సెలవు వచ్చినప్పుడు.. స్పాకు వెళ్లండి.

మంచి మసాజ్, హెయిర్ వాష్, బాడీ గ్రూమింగ్ టెక్నిక్‌లు.. డోపమైన్ అనే మంచి హార్మోన్‌ను విడుదల చేస్తాయి. మంచి మసాజ్ తర్వాత.. శరీరం పునరుజ్జీవనం పొంది.. పూర్తిగా రిలాక్స్డ్​గా అనిపిస్తుంది. అయితే మీరు అధిక రక్తపోటుతో బాధపడుతుంటే మాత్రం.. మసాజ్ చేయించుకోవడానికి ముందు వైద్యుడిని సంప్రదించండి.

లాఫ్టర్ క్లబ్ లేదా హగ్గింగ్ క్లబ్‌ జాయిన్ అవ్వండి..

పార్క్‌ల్లో కొందరు వ్యక్తులు ఒక సర్కిల్‌ను ఏర్పరచుకుంటారు. వారు అంతా కలిసి.. బాగా నవ్వుతూ ఉంటారు. ఇది మీరు గమనించే ఉండొచ్చు. ఇలా నవ్వుకోవడం వల్ల కూడా మీకు ఒత్తిడి తగ్గుతుంది అంటున్నారు నిపుణులు.

మీరు నవ్వుతున్నప్పుడు.. ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్‌ను పీల్చుకుంటారు. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి, మీ మానసిక స్థితిని రిఫ్రెష్ చేయడానికి సహాయపడుతుంది.

హగ్ కూడా మీకు రిలాక్సేషన్‌లో సహాయపడుతుంది. మీకు ఇష్టమైన వ్యక్తిని హగ్ చేసుకుంటే.. మీ శరీరం ఆక్సిటోసిన్‌ను విడుదల చేస్తుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్