Kidney Stones । కిడ్నీలలో రాళ్లు ఏర్పడకుండా ఆహారంలో మార్పులు చేసుకోండి!-changing of diet may help you prevent kidney stones ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Kidney Stones । కిడ్నీలలో రాళ్లు ఏర్పడకుండా ఆహారంలో మార్పులు చేసుకోండి!

Kidney Stones । కిడ్నీలలో రాళ్లు ఏర్పడకుండా ఆహారంలో మార్పులు చేసుకోండి!

Dec 05, 2022, 11:01 AM IST HT Telugu Desk
Dec 05, 2022, 11:01 AM , IST

  •  Kidney Stones: కిడ్నీలో రాళ్లు ఏర్పడటమనేది ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. రోజూ తీసుకునే ఆహారపానీయల వలన కూడా ఈ సమస్య తలెత్తడం లేదా పెరగటం జరుగుతుంది.

కిడ్నీలు శుద్ధి చేసే ప్రక్రియలో భాగంగా కొనిసార్లు అధిక ఉప్పు, ఖనిజాలు స్ఫటికాల రూపంలో పేరుకుంటాయి. వీటినే రాళ్లు అని చెప్తారు. ఇవి పరిస్థితులను బట్టి పరిమాణం పెరుగుతుంటాయి.

(1 / 8)

ఈ కిడ్నీ స్టోన్స్ ఏ వయసులోనైనా కనిపించవచ్చు. చాలా సందర్భాలలో, సరైన జీవనశైలిని అనుసరించకపోవడం వలన ఈ సమస్య తలెత్తుతుంది. కొన్ని చిన్న చిన్న మార్పులు ద్వారా వీటిని నివారించవచ్చు.

(2 / 8)

కిడ్నీ స్టోన్స్ ప్రమాదకరం కాకుండా, ముందుగా మీ ఆహారంలో మార్పులు చేసుకోవాలి. కొన్నింటిని తినకుండా ఉండాలి.

(3 / 8)

ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారాలు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి దారితీస్తాయి. అలాంటి ఆహారాన్ని తగ్గించండి. పాలకూర, దుంపలు, కాఫీ గింజలు వంటి ఆహార పానీయాలు మితంగా తినండి. అప్పుడు కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం తగ్గుతుంది.

(4 / 8)

ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించండి, ప్యాక్ చేసిన ఆహారాలు, వేయించిన ఆహారాలను తినకూడదు. వీటిలో చాలా సోడియం కంటెంట్ ఉంటుంది. సోడియం స్థాయిలు పెరిగినపుడు మూత్రపిండాల్లో రాళ్లు తయారవుతాయి.

(5 / 8)

పుష్కలంగా నీరు త్రాగండి, దీని గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల మూత్ర నాళాలు శుభ్రపడతాయి. ఇది మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాబట్టి రోజూ కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలి.

(6 / 8)

పాలు తాగండి: చాలా మంది కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల స్థాయి పెరుగుతుందని నమ్ముతారు. దాంతో పాలు తాగడం మానేస్తారు. కానీ ఇది సరైనది కాదు. పాలు తాగితే మంచిదే. ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.అయితే మీకు అలర్జీలు వంటి సమస్యలు ఉంటే తాగడం మానుకోండి.

(7 / 8)

సంబంధిత కథనం

Kidney Failure Warning Signs:Kidney Issues In Octoberఆకుకూరలు, కూరగాయలు వివిధ పోషకాలతో నిండినప్పటికీ.. అవి కొన్నిసార్లు శరీరానికి హాని చేస్తాయి అంటున్నారు ఆహార నిపుణలు. ముఖ్యంగా మూత్రపిండాలకు. కాబట్టి ఇప్పటికే కిడ్నీ సమస్యలు లేదా కిడ్నీలో రాళ్లు ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలి అంటున్నారు. ఇంతకీ ఆ కూరగాయలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మూత్ర పిండాల్లో రాళ్లు కరిగించే పిండి కూర ఆకుకిడ్నీ రాళ్లు ఇలా తగ్గించుకోండి..కిడ్నీ సమస్యలు
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు