kidney stones treatment in ayurveda: కిడ్నీలో రాళ్లను కరిగించే పిండి కూర ఆకు-pindi kura for kidney stones treatment in ayurveda ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kidney Stones Treatment In Ayurveda: కిడ్నీలో రాళ్లను కరిగించే పిండి కూర ఆకు

kidney stones treatment in ayurveda: కిడ్నీలో రాళ్లను కరిగించే పిండి కూర ఆకు

HT Telugu Desk HT Telugu
Nov 16, 2022 09:00 AM IST

kidney stones treatment in ayurveda: కిడ్నీలో రాళ్లను కరిగించడంలో పిండి కూర ఆకు బాగా పనిచేస్తుందని మన ప్రాచీన ఆయుర్వేదం చెబుతోంది.

మూత్ర పిండాల్లో రాళ్లు కరిగించే పిండి కూర ఆకు
మూత్ర పిండాల్లో రాళ్లు కరిగించే పిండి కూర ఆకు (Satheesan.vn, CC BY-SA 3.0 , via Wikimedia Commons)

kidney stones treatment in ayurveda: పిండి కూర ఆకును మనం పల్లెటూళ్లలో చాలాసార్లు చూశాం. దీనిని పాషాణభేది అని కూడా అంటారు. అంటే రాళ్లను కూడా కరిగిస్తుందని దీని అర్థం. కొండపిండి చెట్టు అని, తెలగ పిండి చెట్టు అని కూడా పిలుస్తారు.

ఈ పిండి కూర మన ఇంటి ముందు, మన పెరట్లో, చెలకల్లో అంతటా కనిపిస్తుంది. సంక్రాంతి సమయంలో గొబ్బెమ్మలకు రేగు పండ్లు, నవ ధాన్యాలతోపాటు ఈ పిండి కూర రెక్కలను కూడా అలంకరిస్తారు.

అయితే పిండి కూర ఆకులో ఒక విశేషమైన గుణం ఉంది. కిడ్నీలు రాళ్లు అని వినగానే మనం చాలా భయపడుతుంటాం. కానీ ఈ పిండి కూర ఆకు ఆ రాళ్లను ఇట్టే కరిగించేస్తుందట.

ఈ పిండి కూర ఆకులు పిడికెడు తీసుకుని పరిగడుపున మూడు రోజులపాటు తీసుకుంటే సరిపోతుందని చెబుతారు. అంత శక్తిమంతమైన ఔషధ గుణం ఉన్న ఆకు ఇది. అయితే మెరుగైన ఫలితాల కోసం ఈ పిండి కూర ఆకును ఎలా ఔషధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

పిండికూర ఔషధం.. ఉపయోగించే విధానం

1. పిండి కూర మొక్కను వేర్లతో సహా బాగా కడికి దానిని తురిమి అర లీటరు నీటిలో మరగబెట్టాలి. అలా దీనిలో సగం వరకు ఆవిరైపోయే వరకూ మరిగించాలి. అప్పుడు దీనిని దించి వడబోసుకోవాలి. దీనికి పటిక బెల్లం ఒక 30 గ్రాములు, శిలాజిత్ పొడి ఒక 2 గ్రాములు కలుపుకోవాలి. ఇలా ప్రతిరోజూ పరగడపున.. అంటే ఖాళీకడుపుతో దీనిని తాగాలి. తాగిన తరువాత గంట సేపు ఎలాంటి ఆహారం తీసుకోవద్దు. మూత్రాశయంలో, మూత్ర పిండాల(కిడ్నీ) లో ఉన్న రాళ్లు కరిగి మూత్రం ద్వారా వెళ్లిపోతాయి.

2. పిండి కూర మొక్కలు వేర్లతో సహా తెచ్చి బాగా కడిగి మెత్తగా దంచాలి. ఒక ముద్దలాగా చేసి ఒక గుడ్డలో వేసి పిండితే రసం వస్తుంది. సమపాళ్లలో పటిక బెల్లం కలపాలి. ఇప్పుడు దీనిని సన్నని మంటపై మరిగించాలి. లేతగా పాకం వచ్చే వరకూ మరిగించాలి. ఆ తరువాత చల్లార్చి నిల్వ ఉంచుకోవచ్చు. దీనిని పెద్దవాళ్లయితే రోజుకు ఒకటి రెండు చెంచాలు, పిల్లలైతే అర చెంచా రోజూ తీసుకుంటే మూత్రపిండాల వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు.

3. పిండి కూర ఆకును కూరగా వండుకొని తినవచ్చు. పప్పులో కూడా వేసుకోవచ్చు. తద్వారా మూత్రపిండాల్లో ఉన్న వ్యర్థాలు మూత్రం ద్వారా వెల్లిపోతాయి.

4. పిండి కూర వేర్లు, ఆకులు, పువ్వులు ఎండబెట్టి పొడి చేసి నిల్వ ఉంచుకోవచ్చు. తేయాకు పొడికి బదులుగా దీనిని వేసుకుని టీ చేసుకుని తాగొచ్చు. తద్వారా మూత్రాశయ సంబంధిత వ్యాధులన్నీ నయమవుతాయి.

Whats_app_banner