How to Wash Your Hair । హెయిర్ వాష్ చేసుకునే సరైన విధానం.. షాంపూ వాడేటపుడు చిట్కాలు!-know how to wash your hair and the right way of shampooing ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  How To Wash Your Hair । హెయిర్ వాష్ చేసుకునే సరైన విధానం.. షాంపూ వాడేటపుడు చిట్కాలు!

How to Wash Your Hair । హెయిర్ వాష్ చేసుకునే సరైన విధానం.. షాంపూ వాడేటపుడు చిట్కాలు!

HT Telugu Desk HT Telugu
Nov 24, 2022 11:45 PM IST

How to Wash Your Hair: సర్వేంద్రియానం సర్వం ప్రధానం, ఇప్పుడు తలపై వెంట్రుకలు ఉండటం కూడా చాలా ప్రధానం. చాలా మంది హెయిర్ వాష్ చేసేటపుడు, షాంపూ వాడేటపుడు చేసే కొన్ని తప్పుల వల్లే జుట్టు సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఈ చిట్కాలు పాటించండి.

How to Wash Your Hair
How to Wash Your Hair (Freepik)

How to Wash Your Hair- Shampooing Tips: మనం మన శరీరాన్ని శుభ్రం చేసుకుంటున్నట్లే, తలను కూడా శుభ్రం చేసుకుంటాం. తలను శుభ్రం చేసుకునేందుకు వివిధ రకాల షాంపూలను, కండీషనర్లను ఉపయోగిస్తాం. అయితే ఈ షాంపూ చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే మీరు జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలతో బాధపడుతున్నారంటే, అందుకు మీ షాంపూ అలాగే మీరు షాంపూ చేసుకునే విధానం కూడా ఒక కారణం కావచ్చు. అందువల్ల హెయిర్ వాష్ చేసే సరైన విధానం తెలిసి ఉండాలి.

చాలా మంది తలకు షాంపూ చేసుకునేటప్పుడు, ఆ షాంపూను నేరుగా జుట్టుపై అప్లై చేస్తారు. కానీ ఈ పద్ధతి పూర్తిగా తప్పు అంటున్నారు నిపుణులు. సరైన విధానం ఏమిటంటే.. మీరు షాంపూ చేసుకోడానికి, ముందుగా మీ జుట్టును నీటితో తడపండి. అప్పుడు ఒక పావు కప్పు నీళ్లలో షాంపూ వేసి బాగా కలపాలి. ఇలా పలుచన చేసిన షాంపూ ద్రావణాన్ని జుట్టుకు అప్లై చేసి రుద్దుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీటితో పరిశుభ్రంగా కడిగేసుకోవాలి.

చిక్కటి షాంపూ ఉపయోగించడం ద్వారా అది తలలోనే ఉండిపోవచ్చు. దీనివలన ఆ ప్రాంతం పొడిగా మారి, చుండ్రు సమస్యలను కలిగిస్తుంది. అలాగే రోజూ షాంపూ చేసుకోవడం కూడా మంచిది కాదు. జుట్టును ప్రతిరోజూ షాంపూతో హెయిర్ వాష్ వల్ల జుట్టులోని సహజ నూనెలు తొలగిపోతాయి. ఫలితంగా జుట్టు పొడిగా, నిర్జీవంగా మారుతుంది, ఆ తర్వాత రాలిపోతుంది.

కండీషనర్‌ ఎలా వర్తింపజేయాలి

కండీషనర్‌ను ఎల్లప్పుడూ జుట్టు అంచులకు అప్లై చేయాలి. దీనిని జుట్టు మూలాలపై ఎప్పుడూ ఉపయోగించవద్దు. ఇలా చేయడం వల్ల జుట్టు చిట్లిపోతుంది. మీ జుట్టుకు కండీషనర్‌ను సున్నితంగా అప్లై చేసి ఐదు నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత వెంటనే హెయిర్ వాష్ చేసుకోండి.

మీ జుట్టును శుభ్రం చేసుకోవడానికి ఎల్లప్పుడూ సల్ఫేట్ లేని తేలికపాటి షాంపూని ఉపయోగించండి. దీని కోసం మీరు హెర్బల్ లేదా ఏదైనా ఆయుర్వేద షాంపూని ఉపయోగించవచ్చు. ఇటువంటి షాంపూలలో చాలా తక్కువ లేదా రసాయనాలు ఉండవు. (Also Read: మసాజ్ చేసుకునేటపుడ్ జాగ్రత్త, స్ట్రోక్ రావచ్చు )

Right Way of Hair Dry- జుట్టును ఆరబెట్టుకోవడం

చివరగా ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు గానీ లేదా షవర్ నుండి బయటకు వచ్చిన తర్వాత గానీ మీ జుట్టును తువాలుతో రుద్దడం చేయకండి. బదులుగా మీ జుట్టుపైన ఒక మృదువైన కాటన్ టవల్ ఉంచి జుట్టును ఆరబెట్టండి. వీలైతే, మీ జుట్టును ఆరబెట్టడానికి మైక్రోఫైబర్ టవల్ లేదా పాత టీ-షర్ట్ ఉపయోగించండి. మెటీరియల్ ఫైబర్ కఠినంగా ఉంటే, అది మీ జుట్టుకు మరింత హాని కలిగించవచ్చు.

టవల్‌తో మీ జుట్టు నుంచి నీటిని తొలిగించి, పూర్తిగా ఆరబెట్టిన తర్వాత అప్పుడు డిటాంగ్లర్ లేదా హెయిర్ ప్రొటెక్టెంట్‌ వంటి జెల్స్ ఉపయోగించి మీ జుట్టు చిక్కులను తొలగించుకోవచ్చు. అనంతరం దువ్వుకోవడం చేస్తే జుట్టు రాలకుండా, ఆరోగ్యంగా పెరుగుతుంది.

హెయిర్ వాష్ చేసుకునే విషయంలో చాలా మంది పైన పేర్కొన్న విషయాలో ఏదో ఒక చోట తప్పులు చేయడం వలనే జుట్టు రాలడం, చుండ్రు ఇతర సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే మీ జుట్టుకు ఎలాంటి ఢోకా ఉండదు.

Whats_app_banner

సంబంధిత కథనం