Dementia: శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే చిత్త వైకల్యం, మతిమరుపు వచ్చే అవకాశాలు ఎక్కువని చెబుతున్న కొత్త అధ్యయనం-a new study says that if such symptoms are present in the body the chances of dementia and forgetfulness are high ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dementia: శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే చిత్త వైకల్యం, మతిమరుపు వచ్చే అవకాశాలు ఎక్కువని చెబుతున్న కొత్త అధ్యయనం

Dementia: శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే చిత్త వైకల్యం, మతిమరుపు వచ్చే అవకాశాలు ఎక్కువని చెబుతున్న కొత్త అధ్యయనం

Haritha Chappa HT Telugu
Jul 31, 2024 02:00 PM IST

Dementia: అధిక కొలెస్ట్రాల్, దృష్టి సమస్యలు వంటివి మతిమరుపు, చిత్త వైకల్యం ప్రమాదాన్ని పెంచుతాయని కొత్త అధ్యయనం చెబుతోంది. కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకోవడం ద్వారా డిమెన్షియా వంటివి రాకుండా అడ్డుకోవచ్చు.

చెడు కొలెస్ట్రాల్ వల్ల మతిమరుపు వచ్చే అవకాశం
చెడు కొలెస్ట్రాల్ వల్ల మతిమరుపు వచ్చే అవకాశం (Unsplash)

మీ శరీరంలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తే భవిష్యత్తులో మీకు మతి మరుపు, చిత్త వైకల్యం వంటివి వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి. మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయినా, మీ కంటి చూపు క్షీణించినా నిర్లక్ష్యం వహించకూడదు. ఈ రెండు లక్షణాలు కనిపిస్తే జ్ఞాపకశక్తి , ఆలోచనా నైపుణ్యాలను ప్రభావితం చేసే చిత్తవైకల్యం వచ్చే ఛాన్స్ పెరిగుతుంది. కొత్త లాన్సెట్ కమిషన్ నివేదిక ఈ విషయాన్ని తెలియజేస్తుంది. చిత్త వైకల్యాన్ని ‘డిమెన్షియా’ (Dementia) అంటారు.

చిత్తవైకల్యంలో ఒక రకం అల్జీమర్స్ వ్యాధి. డిమెన్షియా వల్ల 60-70 శాతం మతిమరుపు వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. డిమెన్షియా వస్తే ఏడు శాతం మందికి అధిక స్థాయి చెడు కొలెస్ట్రాల్ (ఎల్డిఎల్) తో ముడిపడి ఉన్నాయి. ఈ సమస్య 40 ఏళ్ల వయస్సులో ఉన్నవారికి పెరుగుతాయి. చికిత్స చేయకుండా వదిలేసిన దృష్టి సమస్యలు కూడా డిమెన్షియా వచ్చిన అవకాశాన్ని పెంచుతాయి. కాబట్టి, ఆ కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకొని, కళ్ళను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి.

కొలెస్ట్రాల్ - చిత్తవైకల్యం మధ్య సంబంధం

లాన్సెట్ నివేదిక ప్రకారం డిమెన్షియా అభివృద్ధి చెందే ప్రమాదాన్ని తగ్గించడానికి కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకోవడం ముఖ్యం. అలాగే దృష్టి సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ఏదో ప్రధాన కారణంగా డిమెన్షియాను కూడా చేర్చింది.

బెంగళూరుకు చెందిన న్యూరాలజీ ప్రొఫెసర్, ఈ నివేదికలో కీలక రచయితగా ఉన్నారు. ఆమె పేరు సువర్ణ అల్లాడి. ఈమె చెబుతున్న ప్రకారం భారతదేశంలో 60 ఏళ్లు పైబడిన వారిలో 7.4% మందిని డిమెన్షియా బారిన పడ్డారని , సుమారు 8.8 మిలియన్ల మంది ఈ పరిస్థితితో జీవిస్తున్నారని చెప్పారు.

2020 లో, లాన్సెట్ కమిషన్ చిత్తవైకల్యానికి 12 ప్రధాన ప్రమాద కారకాలను గుర్తించింది, వీటిలో విద్య లేకపోవడం, వినికిడి లోపం, అధిక రక్తపోటు, ధూమపానం, ఊబకాయం, నిరాశ, వ్యాయామం చేయకపోవడం , డయాబెటిస్, అధికంగా మద్యం సేవించడం, మెదడు గాయం (టిబిఐ), వాయు కాలుష్యం, సామాజిక ఒంటరితనం ఉన్నాయి.

అభిజ్ఞా క్షీణతలో కొలెస్ట్రాల్ పాత్ర

65 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 11 లక్షల మందికి పైగా ప్రజలు ఒక అధ్యయనంలో పాల్గొన్నారు. ఆ అధ్యయనంలో చెడు కొలెస్ట్రాల్ ప్రతి 1 మిమోల్ / ఎల్ పెరుగుదల… చిత్తవైకల్యం వచ్చే ప్రమాదాన్ని ఎనిమిది శాతం పెంచిందని కనుగొన్నారు. 12 లక్షల మంది పాల్గొన్న మరొక అధ్యయనంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు 3 మిమోల్ / ఎల్ కంటే ఎక్కువ ఉంటే… చిత్తవైకల్యం ప్రమాదం 33 శాతం పెరుగుతుందని తేలింది.

కంటి చూపు సమస్యలు… డయాబెటిస్ వంటి అనారోగ్యాలతో ముడిపడి ఉంటుందని అధ్యయనం సూచిస్తుంది. ఇది కూడా చిత్తవైకల్యం ప్రమాదాన్ని పెంచేస్తుంది. రెటీనా, మెదడు… రెండింటినీ ప్రభావితం చేసే అంతర్లీన సమస్య కూడా.

వృద్ధాప్యం, ఆల్కహాల్, ధూమపానం వంటివి న్యూరోడెజెనరేటివ్ డిజార్డర్స్ ను పెంచుతాయి. ఇంద్రియ సమస్యలు, అభిజ్ఞా బలహీనతలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. ప్రతి ఒక్కటీ వివిధ మార్గాల్లో మరొకదాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ముందుగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోకుండా చూసుకోవాలి. అలాగే కంటి చూపు సమస్యలు ఏమైనా ఉంటే వాటికి కూడా చికిత్స తీసుకోవాలి.

Whats_app_banner