Yoga for sharp mind: పిల్లల మెదడును పదునుగా చేసే 9 యోగాసనాలు.. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంచుతాయి-9 yoga asanas to improve memory power and concentration in students ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Yoga For Sharp Mind: పిల్లల మెదడును పదునుగా చేసే 9 యోగాసనాలు.. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంచుతాయి

Yoga for sharp mind: పిల్లల మెదడును పదునుగా చేసే 9 యోగాసనాలు.. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంచుతాయి

Koutik Pranaya Sree HT Telugu
Aug 19, 2024 08:00 AM IST

Yoga for sharp mind: ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంపొందించడానికి విద్యార్థులు కొన్ని యోగా ఆసనాలను చేయడం వల్ల అనేక లాభాలు పొందొచ్చు. దానికోసం యోగా నిపుణులు సూచించిన ఆసనాలు పేర్లు, వాటిని చేయాల్సిన పద్ధతి చూసేయండి.

విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి పెంచే యోగాసనాలు
విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి పెంచే యోగాసనాలు (Photo by Yan Krukau on Pexels)

యోగా వివిధ శారీరక, మానసిక లాభాలుంటాయి. ఆసనాలు, శ్వాస నియత్రణతో చేసే ప్రాణాయామాలు, ధ్యానం కలయిక ఏకాగ్రతకు దోహదం చేస్తుంది. యోగా మనస్సు, శరీరం మధ్య సంబంధాన్ని సమతుల్యం చేస్తుంది. దీంతో పరధ్యానం తగ్గుతుంది.

ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని  పెంపొందించడానికి విద్యార్థులకు కొన్ని ప్రభావవంతమైన యోగాసనాలను అక్షర యోగ కేంద్రం వ్యవస్థాపకుడు హిమాలయన్ సిద్ధా అక్షర్ సిఫార్సు చేశారు.

  1. తాడాసనం (పర్వత భంగిమ): పాదాలను కలిపి, చేతులను మీకు ఇరు వైపులా ఉంచి, అరికాళ్లను పైకి లేపి లేపుతూ వీలైనంత ఎత్తుగా నిలబడండి. ఈ ఆసనం శరీర భంగిమను మెరుగుపరుస్తుంది. శరీరాన్ని నిలకడగా ఉంచి ఏకాగ్రతను పెంచుతుంది.
  2. వృక్షాసనం (చెట్టు భంగిమ): శరీర బరువును ఒక కాలి మీదే ఉంచాలి. మరొక పాదాన్ని మడిచి నిలబడి ఉన్న కాలి మీద ఆనించండి. చేతులను ప్రార్థనా స్థానానికి తీసుకురండి. ఇది శరీర సమతుల్యత, దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
  3. పశ్చిమోత్తనసనం (ముందు వంగి కూర్చోవడం): కాళ్లు చాచి, ముందుకు వంగి, మీ కాలి వేళ్లను తాకుతూ కూర్చోండి. ఈ ఆసనం వెన్నెముకను సాగేలా చేస్తుంది. మెరుగైన అభిజ్ఞా పనితీరు కోసం మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది.
  4. బాలాసనం: మడమలపై పిరుదులు ఉంచేలా వంచి కూర్చోవాలి. మీ చేతులను ముందుకు చాపి, మీ నుదుటిని ముందు మ్యాట్ మీద ఉంచండి. ఈ భంగిమ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆలోచనల్లో స్పష్టతను పెంచుతుంది.
  5. సర్వాంగాసనం: మీ వీపుపై పడుకుని, కాళ్ళను పైకి నిటారుగా లేపండి. మద్దతు కోసం మీ చేతులతో మీ వీపుకు పట్టుకోండి. ఇది మెదడుకు రక్త ప్రసరణను పెంచుతుంది. జ్ఞాపకశక్తికి పెంచేలా సాయపడుతుంది.
  6. హలాసనం: సర్వాంగాసనం స్థితి నుంచి, మీ కాళ్లను మీ తల వెనుక దాకా తీసుకు వెళ్లండి. హలసనం నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది, మెదడు చురుకుతనాన్ని పెంచుతుంది.
  7. అనులోమ విలోమ ప్రాణాయామం: ముందుగా ప్రశాంతంగా కూర్చోవాలి. ఒక ముక్కు రంధ్రాన్ని మూసివేసి, మరో నాసికతో శ్వాస తీసుకుని, మరో నాసికతో గాలి వదిలేయండి. ఇలా నాసికను మారుస్తే చేయాలి. ఈ ప్రాణాయామం మెదడు అర్ధగోళాలను సమతుల్యం చేస్తుంది, దృష్టిని పెంచుతుంది.
  8. సూర్య నమస్కారం: పన్నెండు ఆసనాల క్రమంతో ఉండే సూర్య నమస్కారాలు శరీర ఫ్లెక్సిబిలిటీని పెంచుతాయి. శరీరంలో శక్తి పెంచుతాయి. మెదడు ఉత్తేజంగా ఉండేలా చేస్తుంది.
  9. త్రటక ధ్యానం: త్రటక ధ్యానం అనేది ఒక యోగ పద్ధతి. ఇది ఒకే బిందువుపై కేంద్రీకృతంగా ఏకాగ్రతను కలిగి ఉండాలి. సాధారణంగా దూరంగా ఒక కొవ్వొత్తి వెలిగించుకున్ని. ఆ జ్యోతిని చూస్తూ ఉండాలి. ఇది మనస్సును స్థిరంగా ఉంచడంతో పాటూ ఏకాగ్రతను పెంచుతుంది. ముందుగా సౌకర్యవంతమైన స్థితిలో కూర్చోవాలి. ఏదైనా ఒక బిందువును ఎంచుకుని కను రెప్ప మూయకుండా చూడాలి. ఈ సరళమైన, శక్తివంతమైన పద్ధతి ఆలోచనల్లో స్పష్టతను పెంచుతుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. దాని మానసిక ప్రయోజనాలతో పాటే కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది.

ఈ ఆసనాలను క్రమం తప్పకుండా అభ్యసించడానికి విద్యార్థులను ప్రోత్సహించండి. ప్రతి ఆసనంలో శ్వాసం మీద ధ్యాస పెట్టాలి. ఈ క్రమం తప్పకుండా చేసే యోగా అభ్యాసం ఏకాగ్రతను పెంపొందించడానికి, ఒత్తిడిని తగ్గించడానికి, జ్ఞాపకశక్తిని పెంచడానికి గణనీయంగా దోహదం చేస్తుంది.

Whats_app_banner