Bloated Stomach | ఉబ్బరం నుంచి ఉపశమనం పొందాలా? ఇవి నమలండి!
Bloated Stomach: మీ పేగులో గ్యాస్ పేరుకుపోవడం, అసమతుల్య ప్రేగు బాక్టీరియా, అల్సర్లు, మలబద్ధకం సహా అనేక అంశాలు ఉబ్బరాన్ని ప్రేరేపిస్తాయి. ఉబ్బరం నుండి బయటపడటానికి మీరు ప్రయత్నించగల కొన్ని నివారణలు ఇక్కడ చూడండి.
Bloated Stomach: కడుపు ఉబ్బరం అనేది చాలా మంది వ్యక్తులు రోజువారీగా అనుభవించే సమస్య. ఉబ్బరానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ, ప్రధానమైన కారణం ఆహారమే. ఒకేసారి ఎక్కువగా తినడం, త్వరగా తినడం, ఉప్పగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం వచ్చే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఎక్కువగా తినకపోయినా కూడా బాగా తినేసినట్లుగా కడుపు నిండుగా, బిగుతుగా మారినట్లు అనిపిస్తుంది. శారీరక శ్రమ లేకపోవడం, చాలాసేపు ఒకే చోట కూర్చుండటం, ధూమపానం- మద్యపానం అలవాట్లు దీనితో ముడిపడి ఉంటాయి.
మీ పేగులో గ్యాస్ పేరుకుపోవడం, అసమతుల్య ప్రేగు బాక్టీరియా, అల్సర్లు, మలబద్ధకం సహా అనేక అంశాలు ఉబ్బరాన్ని ప్రేరేపిస్తాయి. అయితే కొన్ని ఇంటి చిట్కాలతోనే కడుపు ఉబ్బరంకు పరిష్కారం చూపుతాయి.
ఉబ్బరం నుండి బయటపడటానికి మీరు ప్రయత్నించగల కొన్ని నివారణలు ఇక్కడ చూడండి
సోంపు విత్తనాలు
ఆహారం తిన్న తర్వాత సోంపు తినడం తెలిసిందే. ఇవి పేగు కండరాలను బిగుతుగా మార్చే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉన్నాయి. కాబట్టి ఉబ్బరం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాదు, సోంపులో కండరాలను సడలించడానికి సహాయపడే యాంటిస్పాస్మోడిక్ సమ్మేళనాలు అనెథోల్, ఫెన్‌చోన్ , ఎస్ట్రాగోల్‌లు ఉంటాయి.
అల్లం
ఉబ్బరం తగ్గించడంలో అల్లం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు గుండెల్లో మంటను తగ్గించడంలో సహాయపడతాయి.అల్లంలో జింజెరోల్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి, ఇవి కడుపు ఖాళీ చేయడాన్ని వేగవంతం చేస్తాయి, గ్యాస్, ఉబ్బరాన్ని తగ్గిస్తాయి.
పుదీనా
జీర్ణ సమస్యలను ఉపశమింపజేయడానికి పుదీనా మంచి ఔషధం. పిప్పరమింట్ లోని చలువ గుణాలు ఉబ్బరం, గ్యాస్ సహా ఇతర గ్యాస్ట్రిక్ సమస్యలను నయం చేయడంలో సహాయపడతాయి.
వాము
వాములో పినేన్, లిమోనెన్, కార్వోన్ వంటి అస్థిర సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఉబ్బరం చికిత్సలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.
జీలకర్ర
జీలకర్రలో త్వరగా ఆవిరయ్యేటువంటి కొన్ని రకాల అస్థిర నూనెలు పుష్కలంగా ఉన్నాయి, జీలకర్రలో ఆల్డిహైడ్, సైమెన్ తదితర టెర్పెనోయిడ్ రసాయనాలు కూడా ఉంటాయి, ఇవన్నీ ఉబ్బరం నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. గ్యాస్, కడుపు నొప్పి నుంచి వేగంగా ఉపశమనం కలిగిస్తాయి.
ఆహారాన్ని నెమ్మదిగా నమలండి. వేగంగా తినడం వల్ల ఎక్కువ గాలిని మింగేస్తారు. దీని వల్ల కడుపు ఉబ్బరం వచ్చే ఛాన్స్ ఉంది. మీ ఆహారాన్ని సరిగ్గా నమలడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పచ్చి సలాడ్‌లని ఎక్కువగా తినడం వల్ల కూడా కడుపు ఉబ్బరం ఏర్పడుతుంది. సలాడ్లలో కొన్ని వండినవి చేర్చుకోవడం వలన మేలు జరుగుతుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్ మధ్య ఎక్కువ నీరు తాగొద్దు. ఎందుకంటే మీరు భోజనం చేసిన తర్వాత కడుపు అధికంగా నిండినట్లు అనిపిస్తుంది.
సంబంధిత కథనం