Today OTT Movies: ఇవాళ ఒక్కరోజే ఓటీటీలోకి 10 సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. చూడాల్సింది ఒకే ఒక్కటి.. ఎక్కడంటే?-today ott movies new ott releases this friday netflix mirzapur 3 ott release on amazon prime mirzapur 3 digital premiere ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Today Ott Movies: ఇవాళ ఒక్కరోజే ఓటీటీలోకి 10 సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. చూడాల్సింది ఒకే ఒక్కటి.. ఎక్కడంటే?

Today OTT Movies: ఇవాళ ఒక్కరోజే ఓటీటీలోకి 10 సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. చూడాల్సింది ఒకే ఒక్కటి.. ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu
Jul 05, 2024 08:42 AM IST

New OTT Releases Friday: ఓటీటీల్లోకి ఇవాళ ఒక్కరోజే సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి మొత్తంగా 10 స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే వాటిలో పెద్దగా చూడాల్సిన, చెప్పుకోవాల్సిన సినిమాలు ఏవి లేవు. కానీ, ఈవారం ఎక్కువగా అందరి దృష్టి కేవలం ఒకే ఒక్క వెబ్ సిరీస్‌పై పడింది. అదేంటనే వివరాల్లోకి వెళితే..

ఇవాళ ఒక్కరోజే ఓటీటీలోకి 10 సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. చూడాల్సింది ఒకే ఒక్కటి.. ఎక్కడంటే?
ఇవాళ ఒక్కరోజే ఓటీటీలోకి 10 సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. చూడాల్సింది ఒకే ఒక్కటి.. ఎక్కడంటే?

Today OTT Releases: థియేటర్లలో కల్కి 2898 ఏడీ ఫీవర్ ఇంకా కొనసాగుతోంది. ఈ వారం కూడా థియేటర్లలోకి చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి విడుదల కావట్లేదు. దీంతో అంతా ఓటీటీలవైపు లుక్కేస్తున్నారు. అయితే, ఓటీటీల్లో కూడా ఈ వారం చెప్పుకోదగ్గ ఇంట్రెస్టింగ్ సినిమాలు ఏవి రాలేదు.

yearly horoscope entry point

అన్ని కలిపి 10 స్ట్రీమింగ్

ఎప్పటిలాగే ప్రతి శుక్రవారం ఓటీటీలో అనేక సినిమాలు, వెబ్ సిరీసులు విడుదల అవుతుంటాయనే విషయం తెలిసిందే. అలాగే ఇవాళ అంటే జూలై 5న (Friday OTT Release) ఓటీటీలోకి అన్ని కలిపి 10 స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఈ వారం మొత్తంలో 20కిపైగా విడుదలైనప్పటికీ ఇవాళ ఒక్కరోజు మాత్రం వెబ్ సిరీసులు, సినిమాలు కలిపి 10 స్ట్రీమింగ్ అవుతున్నాయి.

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్

కానీ, వాటిలో తెలుగు ఆడియెన్స్ చూసేందుకు పెద్ద ఇంట్రెస్టింగ్ సినిమాలు ఏవి లేవు. కేవలం ఒకే ఒక్క హిందీ వెబ్ సిరీసి మాత్రమే ఈ వారం స్పెషల్ కానుంది. అదొక్కటి తప్పిస్తే.. పెద్దగా సినిమాలు ఏవి లేవు. ఎక్కువగా హాలీవుడ్, తమిళం, మలయాళ, కన్నడ చిత్రాలు మాత్రమే స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి అవి ఏంటీ, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటని చూస్తే..

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

డెస్పరేట్ లైస్ (పోర్చుగీస్ వెబ్ సిరీస్)- జూలై 5

గోయో (స్పానిష్ చిత్రం)- జూలై 5

బుక్ మై షో ఓటీటీ

ది సీడింగ్ (ఇంగ్లీష్ సినిమా)- జూలై 5

విజన్స్ (ఫ్రెంచ్ మూవీ)- జూలై 5

మీర్జాపూర్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ హిందీ వెబ్ సిరీస్)- అమెజాన్ ప్రైమ్ ఓటీటీ- జూలై 5

హీ వెంట్ దట్ వే (ఇంగ్లీష్ సినిమా)- జియో సినిమా ఓటీటీ- జూలై 5

ఓండు ఘంటేయ కథే (కన్నడ అడల్ట్ కామెడీ మూవీ)- నమ్మ ఫ్లిక్స్ ఓటీటీ- జూలై 5

హరా (తమిళ సినిమా)- ఆహా తమిళ్ ఓటీటీ- జూలై 5

మలయాళీ ఫ్రమ్ ఇండియా (మలయాళ సినిమా)- సోనీ లివ్ ఓటీటీ- జూలై 5

మందాకిని (మలయాళ మూవీ)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- జూలై 5

10 ఎపిసోడ్స్‌తో

ఇలా ఇవాళ పది ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటన్నింటిలో ఇండియా వైడ్‌గా అత్యధిక ఆదరణ పొందిన, ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పాపులర్ వెబ్ సిరీస్ మీర్జాపూర్ సీజన్ 3 ఇవాళే వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో నేటి నుంచి మీర్జాపూర్ 3 స్ట్రీమింగ్ అవుతోంది. మీర్జాపూర్ 3 నుంచి ఒకేసారి 10 ఎపిసోడ్స్‌ను విడుదల చేశారు.

5 భాషలు- 50 నిమిషాలు

సుమారు 50 నిమిషాల రన్‌టైమ్‌తో 10 ఎపిసోడ్స్ వరకు మీర్జాపూర్ 3 సీజన్‌లో ఉన్నాయి. వీటన్నింటిని హిందీతోపాటు తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంచారు. అంటే మొత్తంగా మీర్జాపూర్ వెబ్ సిరీస్ సీజన్ 3ని ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ వారం చెప్పుకోదగ్గ, చూడాల్సిన వెబ్ సిరీస్ ఇది ఒక్కటే.

అడల్ట్ కామెడీ చిత్రం

ఇక అడల్ట్ కామెడీ చిత్రంగా వచ్చిన కన్నడ సినిమా ఓండు ఘంటేయ కథే కూడా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. కానీ, ఇది తెలుగు ఆడియెన్స్ ఎవరికీ తెలియను నమ్మా ఫ్లిక్స్ అనే ఓటీటీలో కన్నడలో స్ట్రీమింగ్ అవుతోంది. కాబట్టి, దీన్ని తెలుగు ప్రేక్షకులు ఓటీటీలో చూడటం కష్టమే అని చెప్పొచ్చు.

Whats_app_banner