Disney Plus Hotstar OTT: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీపై పిటిషన్- బాహుబలి నిర్మాతలకు షాక్- ఆ వెబ్ సిరీస్ తొలగించాలంటూ!
Pocket FM Petition Disney Plus Hotstar Yakshini OTT Streaming: బాహుబలి నిర్మాతలకు, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీకి పాకెట్ ఎఫ్ఎమ్ షాక్ ఇచ్చింది. యక్షిణి వెబ్ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్ ఆపేయాలని ఢిల్లీ హైకోర్టులో పాకెట్ ఎఫ్ఎమ్ పిటిషన్ వేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Disney Plus Hotstar Petition Yakshini OTT Release: ఎన్నో వైవిధ్యమైన కంటెంట్ సినిమాలు, వెబ్ సిరీసులతో అలరించే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ సంస్థకు షాక్ తగిలింది. తన ఆడియో సిరీస్ కాపీరైట్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఉల్లంఘించినదని ఆరోపిస్తూ పాకెట్ ఎఫ్ఎమ్ పిటిషన్ దాఖలు చేసింది. ఢిల్లీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. కోర్టు వెంటనే స్పందించి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.
పిటిషన్ వివరాల్లోకి వెళితే.. ఆన్‌లైన్ ఆడియో ప్లాట్‌ఫామ్ పాకెట్ ఎఫ్ఎమ్ (Pocket FM) చాలా పాపులర్. ఇందులో అనేక రకాల కంటెంట్ సిరీసులను ఆడియో రూపంలో అందుబాటులో ఉంచుతూ ఎంటర్టైన్‌మెంట్ పంచుతుంది. ఇందులో ఎన్నో సిరీసులు ఇప్పటికే చాలా పాపులర్ అయ్యాయి. వాటిలో యక్షిణి ఆడియో సిరీస్ ఒకటి. హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలు ఉన్న ఈ యక్షిణి సిరీస్‌ను పెయిడ్ కస్టమర్స్‌కు అందిస్తోంది పాకెట్ ఎఫ్ఎమ్ ప్లాట్‌ఫామ్.
కాబట్టి, దానికి సంబంధించిన పూర్తి కాపీ రైట్ హక్కులను సదరు పాకెట్ ఎఫ్ఎమ్ కలిగి ఉంది. ఇక ఇటీవల ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అదే టైటిల్‌తో అలాంటి హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలను పోలి ఉండే యక్షిణి తెలుగు వెబ్ సిరీసును ఓటీటీలోకి తీసుకొచ్చింది. దీని గురించి అధికారికంగా ప్రకటిస్తూ ట్రైలర్ కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఇది తెలుసుకున్న పాకెట్ ఎఫ్ఎమ్ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ నుంచి యక్షిణిని తొలగించాలని కోరుతూ జూన్ 11న ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అంతకుముందే యక్షిణి వెబ్ సిరీస్‌ను జూన్ 14 శుక్రవారం నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రకటించింది. దీంతో హాట్ స్టార్ మాతృసంస్థ అయిన నోవీ డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై పాకెట్ ఎఫ్ఎమ్ కోర్టులో దావా వేసింది. వెబ్ సిరీస్ ట్రైలర్‌ను తొలగించేలా సంస్థను ఆదేశించాలని కోర్టును అభ్యర్థించింది.
దీనికి సంబంధించిన వ్యాజ్యాన్ని గురువారం (జూన్ 13) జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ ధర్మాసనం విచారించింది. ఈ వ్యవహారంపై డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ తన ప్రత్యుత్తరాన్ని దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. కాగా 2021 మే నుంచి పాకెట్ ఎఫ్ఎమ్‌లో యక్షిణి ఆడియో సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఆ సమయంలో దీని ప్రమోషనల్ కంటెంట్‌కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోలింగ్ కూడా జరిగింది.
అంతేకాకుండా ప్రస్తుతం పాకెట్ ఎఫ్ఎమ్‌లో వెయ్యికిపైగా ఎపిసోడ్స్‌తో యక్షిణి కొనసాగుతోంది. ఇదిలా ఉంటే, ఇక తెలుగు వెబ్ సిరీస్‌గా వచ్చిన యక్షిణి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతోంది. 6 ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్‌ను హాట్‌స్టార్‌తో కలిసి బాహుబలి నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా బ్యానర్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు. ఇటీవల సిరీస్‌పై పిటిషన్ రావడంతో బాహుబలి నిర్మాతలకు షాక్ తగిలినట్లు అయింది.
ఇక హారర్ ఫాంటసీ, లవ్ అండ్ రొమాంటిక్ వెబ్ సిరీస్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న యక్షిణిలో (Yakshini Web Series OTT) వేదిక, మంచు లక్ష్మి, రాహుల్ విజయ్, అజయ్ కీలక పాత్రలు పోషించారు. యక్షిణి వెబ్ సిరీస్‌కు తేజ మార్ని దర్శకత్వం వహించారు.
టాపిక్