Kalki 2898 AD Movie Review Telugu: ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అతిపెద్ద ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడీ. ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. అయితే, దానికితగినట్లుగా ప్రమోషన్స్ జరగట్లేదని ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు.
మొదట కల్కి 2898 ఏడీ టీజర్ వచ్చి అట్రాక్ట్ చేసింది. అనంతరం కొన్ని పోస్టర్స్‌తో ఆకర్షించారు. ఇక ఇటీవల బుజ్జి అనే ఏఐ రోబోట్ గురించి చెబుతూ మంచి ఈవెంట్ నిర్వహించారు. కానీ, అంతగా హైప్ రాలేదు. బుజ్జి అండ్ భైరవ అనే యానిమేషన్ వెబ్ సిరీస్ (Bujji And Bhairava OTT) అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో (Amazon Prime OTT) స్ట్రీమింగ్‌కు వచ్చి రెస్పాన్స్ తెచ్చుకుంది. కానీ, ఇది ప్రభాస్ రేంజ్‌కు సరిపోవట్లేదనేది అభిమానుల అభిప్రాయం.
రీసెంట్‌గా విడుదలైన కల్కి 2898 ఏడీ ట్రైలర్ (Kalki 2898 AD Trailer) అదిరిపోయింది. ఆ తర్వాత రిలీజైన బైరవ యాంథమ్ సాంగ్ పంజాబీ స్టైల్‌లో ఉండేసరికి నార్త ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. కానీ, తెలుగు ప్రేక్షకులు మాత్రం కాస్తా నిరాశచెందారు. ఇక మంగళవారం కల్కి ప్రీ ల్యూడ్ గురించి చెబుతూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఓ వీడియో రిలీజ్ చేసిన అంతగా రీచ్ కాలేదనిపిస్తుంది.
కల్కి 2898 ఏడీ రిలీజ్‌కు ఇంకా 8 రోజులు ఉండటంతో ప్రమోషన్స్ సరిగ్గా జరగ్గట్లేదని అభిమానుల్లో అలజడి మొదలైంది. కానీ, వాటి నుంచి కాస్తా రిలీఫ్ పొందడానికి అన్నట్లుగా తాజాగా కల్కి 2898 ఏడీ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. హైదరాబాద్‌లోని క్యూబ్ ఆఫీస్‌లో సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డ్ మెంబర్స్ కల్కి మూవీపై రివ్యూ ఇచ్చారు.
కల్కి 2898 ఏడీ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్ మెంబర్స్.. మూవీ రన్ టైమ్ దాదాపుగా రెండు గంటల 55 నిమిషాలు అని చెప్పారు. కల్కి సినిమాలో ట్విస్టులు అదిరిపోయాయట. బ్లాక్ బస్టర్ సినిమా లోడింగ్ అని చెబుతున్నారు. భైరవగా ప్రభాస్ దుమ్ముదులిపాడని చెబుతున్నారు. అలాగే ఇలాంటి ఊహతో ఇలా సినిమా తీయడం నాగ్ అశ్విన్‌కు మాత్రమే సాధ్యమని, అతని క్రియేటివిటీకి దండం పెట్టాల్సిందేనని టాక్.
కల్కి ఫస్ట్ రివ్యూకు (Kalki First Review) సంబంధించిన పోస్టులు ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా దర్శనం ఇస్తున్నాయి. దాంతో అవి నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే, ప్రమోషన్స్ సంగతి పక్కన పెడితే కల్కి సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం భారీగానే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ప్రీ సేల్స్ ద్వారా ఒక్క నార్త్ అమెరికాలోనే రెండు మిలియన్ డాలర్లకుపైగా రాబట్టినట్లు సమాచారం.
కాగా.. కల్కి సినిమాకు సంబంధించి సెన్సార్ బోర్డ్ నుంచి రివ్యూ వచ్చిందని పోస్టులు దర్శనం ఇస్తున్నాయి. కానీ, ప్రభాస్, నాగ్ అశ్విన్ గురించి తప్పా అందులో నటించిన మిగతా నటీనటుల గురించి చెప్పకపోవడం గమనార్హం. ఇక ఈ సినిమాలో ప్రభాస్‌తోపాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.