OTT Movie: ఓటీటీలోకి 140 కోట్ల సూపర్ హిట్ టాక్ స్పోర్ట్స్ బయోగ్రఫీ మూవీ.. ఎక్కడ చూడాలంటే?
Chandu Champion OTT Streaming: ఓటీటీలోకి రూ. 140 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన బయోపిక్ స్పోర్ట్స్ డ్రామా మూవీ చందు ఛాంపియన్ స్ట్రీమింగ్ కానుంది. కార్తీక్ ఆర్యన్ నటించిన చందు ఛాంపియన్ మూవీ ఏ ఓటీటీలో, ఎప్పుడు రానుందనే వివరాల్లోకి వెళితే..
Chandu Champion OTT Release: ఓటీటీలోకి ఎన్నో రకాల సినిమాలు వస్తుంటాయి. అడ్వెంచర్, హారర్, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్స్ వంటి జోనర్స్‌లలో చిత్రాలను చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడుతుంటారు. అయితే కొన్ని సినిమాలు నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తారన్న విషయం తెలిసిందే.
ఇలాంటి బయోపిక్ సినిమాలకు కూడా మంచి క్రేజ్ ఉంది. ఈ తరహా సినిమాలు చాలా వరకు బాక్సాఫీస్ వద్ద మంచి హిట్స్ సాధించాయి. ఇక నేరుగా ఓటీటీలోకి రిలీజైన బయోపిక్ వెబ్ సిరీసులకు మంచి క్రేజ్ వచ్చింది. బయోపిక్ సినిమాలు నడుస్తున్న నేపథ్యంలో ఇటీవల ఓ బయోపిక్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం వచ్చింది.
వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో కార్తీక్ ఆర్యన్. బాలీవుడ్‌లో భూల్ భులయ్యా 2, షెహజాదా, సత్యప్రేమ్ కి కథ, ధమాకా వంటి సినిమాలతో సూపర్ హిట్ కొట్టిన కార్తీక్ ఆర్యన్ నటించిన స్పోర్ట్స్ బయోపిక్ డ్రామా మూవీ చందు ఛాంపియన్. ఇటీవల జూన్ 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి.
చందు ఛాంపియన్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ అవి కలెక్షన్ల రూపంలోకి మారలేదు. దాంతో సినిమాకు అంతంత మాత్రంగానే కలెక్షన్స్ వసూళ్లు అయ్యాయి. రూ. 100 నుంచి రూ. 140 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన చందు ఛాంపియన్ సినిమా ఇండియాలో ఇప్పటి వరకు రూ. 78.6 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది.
ఫస్ట్ డే నుంచి కలెక్షన్స్ అంతంత మాత్రంగా ఉన్న చందు ఛాంపియన్ సినిమాను ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ మరింత దెబ్బ తీసింది. ప్రభాస్ సినిమా రావడంతో నార్త్ ఆడియెన్స్ ఎక్కువగా కల్కి వైపే మొగ్గు చూపారు. ఇప్పటివరకు హిందీ నుంచి కల్కి సినిమాకు రూ. 145 కోట్లకుపైగా కలెక్షన్స్ వచ్చాయి.
కంటెంట్ బాగున్న ప్రేక్షకుల ఆదరణ పొందిన చందు ఛాంపియన్ సినిమా ఓటీటీలోకి రానుంది. ఈ చందు ఛాంపియన్ ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ మంచి ధర పెట్టి కొనుగోలు చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో జూలై చివరి వారంలో చందు ఛాంపియన్ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారని సమాచారం. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇంతవరకు రాలేదు.
కాగా ప్రస్తుతం చందు ఛాంపియన్ కలెక్షన్స్ చూస్తే జూలై చివరి వారంలో కాకుండా మిడ్ వీక్‌లోనే ఓటీటీ స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను రెంటల్ విధానంలో అమెజాన్ ప్రైమ్ డిజిటల్ ప్రీమియర్ చేయనుందని టాక్. ఇది కాస్తా నిరాశపడాల్సిన విషయంగా తెలుస్తోంది. ఆగస్టులో ఎంలాంటి రెంట్ లేకుండా ఓటీటీలో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
కాగా పారాలింపిక్స్ విజేత మురళీకాంత్ పెట్కర్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. ఆయన ఫ్రీస్టైల్ స్విమ్మింగ్‌లో ఇండియాకు మొదటి పారాలింపిక్ స్వర్ణ పతకాన్ని తీసుకొచ్చారు. ఈ సినిమాకు పాపులర్ డైరెక్టర్ కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు.