Box Office Collection: 140 కోట్ల సినిమాకు 50 కోట్లు కూడా రాలేదు.. అతి దారుణంగా పడిపోయిన కలెక్షన్స్-kartik aaryan starrer chandu champion 7 days worldwide box office collection not reached to 50 cr box office report ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Box Office Collection: 140 కోట్ల సినిమాకు 50 కోట్లు కూడా రాలేదు.. అతి దారుణంగా పడిపోయిన కలెక్షన్స్

Box Office Collection: 140 కోట్ల సినిమాకు 50 కోట్లు కూడా రాలేదు.. అతి దారుణంగా పడిపోయిన కలెక్షన్స్

Sanjiv Kumar HT Telugu

Chandu Champion 7 Days Box Office Collection: పారాలింపిక్స్ విజేత మురళీకాంత్ పెట్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన కార్తీక్ ఆర్యన్ స్పోర్ట్స్ బయోపిక్ సినిమా చందు ఛాంపియన్‌. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు వచ్చి 7 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ చూస్తే..

140 కోట్ల సినిమాకు 50 కోట్లు కూడా రాలేదు.. అతి దారుణంగా పడిపోయిన కలెక్షన్స్

Chandu Champion Box Office Collection: భూల్ భులయ్యా 2, షెహజాదా, సత్యప్రేమ్ కి కథ, ధమాకా వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు కార్తీక్ ఆర్యన్. అలాంటి కార్తీక్ ఆర్యన్ నటించిన స్పోర్ట్స్ బయోపిక్ డ్రామా సినిమా చందు ఛాంపియన్. ఇటీవల జూన్ 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం వీక్ డేస్‌లో కలెక్షన్లు మరింతగా పడిపోయాయి.

అతి తక్కువగా ఏడో రోజు

తాజా సమాచారం ప్రకారం చందు ఛాంపియన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.35 కోట్ల మార్కును క్రాస్ చేసింది. చందు ఛాంపియన్ విడుదలైన ఏడో రోజు కేవలం రూ. 2.50 కోట్లు నెట్ ఇండియా కలెక్షన్స్ కలెక్ట్ చేసింది. ఇప్పటివరకు ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లలో ఇదే అతి తక్కువ. ఇలా ఈ సినిమాకు మొత్తంగా ఇండియాలో రూ. 35.25 కోట్ల డొమెస్టిక్ కలెక్షన్స్ మాత్రమే వసూలు అయ్యాయి.

140 కోట్ల బడ్జెట్- రాని 50 కోట్లు

ఇక చందు ఛాంపియన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏడు రోజుల్లో రూ. 48.96 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. అంటే, సుమారు రూ. 100 నుంచి 140 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా వారం రోజుల్లో కనీసం 50 కోట్ల మార్క్‌ను కూడా చేరుకోలేకపోయింది. ఈ రిపోర్ట్స్ చూస్తుంటే కలెక్షన్స్ మరింత పతనం అయితే సినిమా డిజాస్టర్‌గా మిగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.

7 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

కాగా చందు ఛాంపియన్ సినిమా మొదటి రోజు రూ.4.75 కోట్లు వసూలు చేయగా, రెండో రోజు రూ.7 కోట్లు కలెక్ట్ చేసింది. మూడో రోజు ఈ చిత్రం రూ. 9.75 కోట్లు వసూలు రాబట్టగా, నాలుగో రోజు రూ. 5 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఐదో రోజు రూ. 3.25 కోట్లు, 6వ రోజు రూ.3 కోట్లు వసూలు చేసింది. 7వ రోజు కలెక్షన్లను పరిగణనలోకి తీసుకుంటే ఈ సినిమా ఇండియాలో టోటల్‌గా రూ. 35.25 కోట్లకు చేరింది.

అతి తక్కువ థియేటర్ ఆక్యుపెన్సీ

ఇక చందు ఛాంపియన్ చిత్రానికి గురువారం (జూన్ 20) మొత్తం 11.71 శాతం హిందీ ఆక్యుపెన్సీ ఉందని నివేదిక పేర్కొంది. ఇది అత్యల్ప థియేటర్ ఆక్యుపెన్సీ అని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే, ఫ్రీస్టయిల్ స్విమ్మింగ్‌లో భారతదేశానికి తొలి పారాలింపిక్ స్వర్ణ పతక విజేత మురళీకాంత్ పెట్కర్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్

ఇందులో మెయిన్ లీడ్ రోల్‌లో నటించిన కార్తీక్ ఆర్యన్‌ పర్ఫామెన్స్‌కు ప్రశంసలు వస్తున్నాయి. కార్తీక్ తన కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడని అంటున్నారు. తాజాగా కత్రీనా కైఫ్ అండ్ విక్కీ కౌశల్ సైతం సినిమాను పొగుడుతూ రివ్యూ ఇచ్చారు. ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలు చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్న కలెక్షన్స్ మాత్రం అంతంత మాత్రంగానే వస్తున్నాయి.

లాంగ్ రన్‌లో కష్టమే

రోజురోజుకీ చందు ఛాంపియన్ బాక్సాఫీస్ కలెక్షన్స్ మరింతగా పడిపోతున్నాయి. ఇక ఏడో రోజున దారుణంగా తగ్గిపోయాయి. ఇలా అయితే లాంగ్ రన్‌లో సినిమా ఫెయిల్యూర్‌గా మిగిలే అవకాశం ఉంది. కాగా ఈ చందు ఛాంపియన్ చిత్రాన్ని సాజిద్ నదియాడ్ వాలా, కబీర్ ఖాన్ సంయుక్తంగా నిర్మించారు.