Katrina Kaif: కత్రీనా కైఫ్ న్యూడ్ సీన్.. 300 కోట్ల బడ్జెట్ సినిమా.. కానీ, ఆమె టవల్ పైనే చర్చ-katrina kaif towel fight scene in tiger 3 trailer goes viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Katrina Kaif: కత్రీనా కైఫ్ న్యూడ్ సీన్.. 300 కోట్ల బడ్జెట్ సినిమా.. కానీ, ఆమె టవల్ పైనే చర్చ

Katrina Kaif: కత్రీనా కైఫ్ న్యూడ్ సీన్.. 300 కోట్ల బడ్జెట్ సినిమా.. కానీ, ఆమె టవల్ పైనే చర్చ

Sanjiv Kumar HT Telugu
Oct 18, 2023 02:02 PM IST

Katrina Kaif Towel Scene: బాలీవుడ్ సెక్సీ బ్యూటి త్వరలో టైగర్ 3 మూవీతో ప్రేక్షకులను అలరించనుంది. అయితే, సినిమా విడుదలకు ముందే అందులో ఆమె చేసిన టవల్ ఫైట్ సీన్ హాట్ టాపిక్ అవుతోంది.

టైగర్ 3 సినిమాలో కత్రీనా కైఫ్ టవల్ ఫైట్ సీన్
టైగర్ 3 సినిమాలో కత్రీనా కైఫ్ టవల్ ఫైట్ సీన్ (Instagram)

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, కత్రీనా కైఫ్ మరోసారి జోడీ కట్టిన సినిమా టైగర్ 3. యశ్ రాజ్ స్పై యూనివర్స్ లో భాగంగా వస్తున్న టైగర్ 3 సినిమాకు మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. సల్మాన్, కత్రీనా కాంబినేషన్‌లో ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై తర్వాత వస్తున్న మూడో సినిమా టైగర్ 3 కావడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల టైగర్ 3 ట్రైలర్ విడుదల కాగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే, సాధారణంగా స్పై జోనర్ సినిమాలకు ఉండే స్టోరీ లైన్, యాక్షన్ సీన్లతో టైగర్ 3 ట్రైలర్ ఉంది. కానీ, అందులో చాలా వరకు ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేసింది కత్రీనా కైఫ్ న్యూడ్ టవల్ ఫైట్ సీన్. ఓ యువతితో టవల్ కట్టుకుని కత్రీనా కైఫ్ ఫైట్ చేసిన విధానం అందరిని ఆకట్టుకుంటుంది. ఇందులో కత్రీనాతోపాటు మరో యువతి దాదాపు నగ్నంగా ఉండి టవల్‌ను లాగేసుకుంటారు. అలా టవల్‌ను కవర్ చేస్తూ సీన్ తెరకెక్కించారు. ఇప్పుడు ఇదే సీన్‌పై నెట్టింట్లో జోరుగా చర్చ నడుస్తోంది.

"టైగర్ 3 ట్రైలర్‌లో టవల్ సీన్‌తో కత్రీనా కైఫ్.. పఠాన్‌లో దీపికా పదుకొణె బికినీ కంటే ఎక్కువగా మాట్లాడే పాయింట్‌గా మారింది. రూ. 300 కోట్ల బడ్జెట్ పెట్టి తీసిన ఈ సినిమాలో కత్రీనా కైఫ్ టవల్ ఫైట్ సీన్ గురించే మాట్లాడుకుంటున్నారు" అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. "ఆ ఆలోచన ఎలా వచ్చింది" అని మరో నెటిజన్ రాసుకొస్తూ ఈ సన్నివేశాన్ని ట్వీట్ చేశాడు.

ఇలా టైగర్ 3 సినిమాలోని కత్రీనా కైఫ్ టవల్ ఫైట్ సీన్ ఆసక్తికరంగా హాట్ టాపిక్ అయింది. పలువురు కొత్తగా అంటే ఇలా ట్రై చేస్తారా అని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు దీపికా బికినీ కంటే కత్రీనా టవల్ సీనే ఎక్కువ వైరల్ అవుతోంది అని ఆమె అభిమానులు సంబరపడిపోతున్నారు. ఇదిలా ఉంటే బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేసిన టైగర్ 3 సినిమా నవంబర్ 1న విడుదల కానుంది.

టీ20 వరల్డ్ కప్ 2024

టాపిక్