Tiger 3 Teaser: టైగర్ శ్వాస ఉన్నంతవరకు ఓటమిని ఒప్పుకోడు.. సల్మాన్ ఖాన్ టైగర్ 3 టీజర్ అదుర్స్-salman khan tiger 3 teaser release as tiger ka message ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tiger 3 Teaser: టైగర్ శ్వాస ఉన్నంతవరకు ఓటమిని ఒప్పుకోడు.. సల్మాన్ ఖాన్ టైగర్ 3 టీజర్ అదుర్స్

Tiger 3 Teaser: టైగర్ శ్వాస ఉన్నంతవరకు ఓటమిని ఒప్పుకోడు.. సల్మాన్ ఖాన్ టైగర్ 3 టీజర్ అదుర్స్

Sanjiv Kumar HT Telugu
Jan 08, 2024 06:28 PM IST

Tiger 3 Movie Teaser: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా టైగర్ 3. కత్రీనా కైఫ్‍తో సల్లూ భాయ్ మరోసారి జోడి కడుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో తాజాగా రిలీజ్ చేసిన టైగర్ 3 టీజర్ మరింత హైప్ పెంచింది.

సల్మాన్ ఖాన్ టైగర్ 3 టీజర్ రిలీజ్.. ఎలా ఉందంటే?
సల్మాన్ ఖాన్ టైగర్ 3 టీజర్ రిలీజ్.. ఎలా ఉందంటే?

Tiger Ka Message: హిట్స్, ప్లాప్స్ వచ్చిన సినిమాలు మాత్రం వరుసపెట్టి చేసే బాలీవుడ్ హీరోల్లో సల్మాన్ ఖాన్ ఒకరు. ఇటీవలే కిసీ కి భాయ్ కిసీ కి జాన్ సినిమాతో ప్రేక్షకులను పలకరిచాడు సల్లూ భాయ్. అయితే, సినిమాకు కలెక్షన్స్ బాగానే వచ్చినా ఆడియెన్స్ ను అంతగా మెప్పించలేకపోయాడు. ఇక సల్మాన్ సినీ కెరీర్‍లో చాలా మందికి టాప్ ఫేవరెట్‍లో టైగర్ మూవీ ఫ్రాంచైజీ. 2012లో వచ్చిన ఏక్ థా టైగర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇందులో సల్మాన్, కత్రీనా కెమిస్ట్రీ, జోడీగా నార్త్ ప్రజలు ఫిదా అయ్యారు.

ఆరేళ్లకు మరోసారి

ఏక్ థా టైగర్ తర్వాత ఐదేళ్లకు 2017లో టైగర్ జిందా హై మూవీతో మరోసారి ఆకట్టుకుంది సల్మాన్, కత్రీనా కైఫ్ జోడి. ఇప్పుడు ఆరేళ్లకు మరోసారి తమ రొమాన్స్, యాక్షన్ సీక్వెన్స్ తో అదరగొట్టేందుకు వస్తోంది ఈ హిట్ పెయిర్. సల్మాన్ టైగర్ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో సినిమానే టైగర్ 3. మనీష్ శర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కించారు. సినిమాలో ఒక ఫైట్‍కే ఏకంగా రూ. 35 కోట్లు ఖర్చు చేశారని టాక్ వచ్చింది.

20 ఏళ్లుగా రక్షిస్తున్నా

యశ్ రాజ్ ఫిలీంస్ బ్యానర్‌పై వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో భాగంగా వస్తున్న టైగర్ 3 మూవీని ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. తాజాగా టైగర్ కా మెసేజ్ అనే పేరుతో టైగర్ 3 టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. "నా పేరు అవినాష్ సింగ్ రాథోర్. కానీ, అందరికీ టైగర్‌గా తెలుసు. 20 ఏళ్లుగా దేశాన్ని రక్షించడానికే గడిపాను. ఏ ఒక్కరోజు కూడా ఇది కావాలని అడగలేదు. కానీ, ఈరోజు ఒకటి కావాలి" అంటూ సల్మాన్ డైలాగ్‍తో ప్రారంభమైన టీజర్ అదిరిపోయింది.

ఓటమిని ఒప్పుకోడు

సల్మాన్ ఖాన్ డైలాగ్స్, ఓ యాక్షన్ సీన్‍తో టైగర్ 3 అంచనాలు పెంచేసింది. "ఈ టైగర్ శ్వాస ఉన్నంతవరకు ఓటమిని ఒప్పుకోడు" అనే డైలాగ్‍తో టైగర్ 3 టీజర్ ముగించారు. అయితే సినిమాలో టైగర్‍ను దేశ ద్రోహిగా భారత్ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. "నా కొడుకు నేను ఎవరని భారత్ చెబుతుంది. ద్రోహి అనా.. దేశభక్తుడనా" అంటూ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.

దివాళీ సందర్భంగా

మొత్తానికి అయితే టైగర్ 3 టీజర్‍తో సినిమాపై అంచనాలు మరింత పెంచారు. టైగర్ 3 దివాళీ సందర్భంగా నవంబర్ 10 విడుదల కానున్నట్లు సమాచారం. టైగర్ 3 వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో భాగంగా వస్తోంది. ఇప్పటికే ఈ యూనివర్స్ లో టైగర్ జిందా హై, వార్, పఠాన్ వచ్చి అలరించాయి. అంతేకాకుండా టైగర్ 3లో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కూడా కెమియో రోల్ చేస్తున్న విషయం తెలిసిందే.

Whats_app_banner