Katrina Kaif : కత్రీనా కైఫ్​- విక్కీ కౌశల్​కు బెదిరింపులు.. చంపేస్తానని..!-katrina kaif vicky kaushal gets death threat ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Katrina Kaif : కత్రీనా కైఫ్​- విక్కీ కౌశల్​కు బెదిరింపులు.. చంపేస్తానని..!

Katrina Kaif : కత్రీనా కైఫ్​- విక్కీ కౌశల్​కు బెదిరింపులు.. చంపేస్తానని..!

Sharath Chitturi HT Telugu
Jul 25, 2022 02:29 PM IST

Katrina Kaif Vicky Kaushal : సామాజిక మాధ్యమాల్లో.. ఓ వ్యక్తి.. కత్రీనా కైఫ్​- విక్కీ కౌశల్​ను చంపేస్తానని బెదిరించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

<p>కత్రీనా కైఫ్​- విక్కీ కౌశల్​కు బెదిరింపు.. చంపేస్తామని..!</p>
కత్రీనా కైఫ్​- విక్కీ కౌశల్​కు బెదిరింపు.. చంపేస్తామని..! (HT)

Katrina Kaif Vicky Kaushal : కత్రీనా కైఫ్​- విక్కీ కౌశల్​ దంపతులకు సామాజిక మాధ్యమాల ద్వారా బెదిరింపులు వచ్చాయి. వారిని చంపేస్తానని ఓ వ్యక్తి బెదిరించాడు. ఈ విషయాన్ని ముంబై పోలీసులు వెల్లడించారు.

ఇదీ జరిగింది..!

సినీరంగంలో విఫలమవుతున్న ఓ నటుడు.. కత్రీనా కైఫ్​కు వీరాభిమాని. అమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఆమెను కొన్ని నెలలుగా సామాజిక మాధ్యమాల్లో స్టాకింగ్​ చేస్తున్నాడు. కత్రీనా కైఫ్​ను ఇబ్బంది పెడుతున్నాడు. చివరికి చంపేస్తానని కత్రీనా కైఫ్​- విక్కీ కౌశల్​ను చంపేస్తానని బెదిరించాడు.

తాజాగా.. ఈ ఘటనపై శాంటాక్రూజ్​ పోలీస్​స్టేషన్​లో కేసు నమోదు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. దర్యాప్తు చేపట్టి.. ఆ నటుడిని సోమవారం అరెస్ట్​ చేసినట్టు వివరించారు.

అతని పేరు మన్వీందర్​ సింగ్​ అని తెలుస్తోంది.

కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్న 39ఏళ్ల కత్రీనా కైఫ్​, 34ఏళ్ల విక్కీ కౌశల్​లు.. 2021లో పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ జంట తరచూ వార్తల్లో నిలుస్తోంది.

Whats_app_banner

సంబంధిత కథనం