Kodi Burra: క్రైమ్ థ్రిల్లర్‌ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోన్న మలయాళ, తమిళ హీరోయిన్ శృతి మీనన్-malayalam tamil actress shruthy menon telugu debut kodi burra crime thriller movie kodi burra launch event hero sriram ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kodi Burra: క్రైమ్ థ్రిల్లర్‌ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోన్న మలయాళ, తమిళ హీరోయిన్ శృతి మీనన్

Kodi Burra: క్రైమ్ థ్రిల్లర్‌ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోన్న మలయాళ, తమిళ హీరోయిన్ శృతి మీనన్

Sanjiv Kumar HT Telugu

Shruthy Menon Telugu Debut With Kodi Burra: తెలుగు క్రైమ్ థ్రిల్లర్‌గా వస్తోన్న లేటెస్ట్ మూవీ కోడి బుర్ర. ఈ మూవీతో మలయాళం, తమిళ చిత్రాల్లో పాపులర్ అయిన శృతి మీనన్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. తాజాగా కోడి బుర్ర మూవీ లాంచ్ వేడుక ఘనంగా జరిగింది.

క్రైమ్ థ్రిల్లర్‌ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోన్న మలయాళ, తమిళ హీరోయిన్ శృతి మీనన్

Kodi Burra Movie Launch Event: ఒకరికి ఒకరు, రోజాపూలు, స్నేహితులు, రాగల 24 గంటల్లో వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో శ్రీరామ్ కొత్త మూవీ "కోడి బుర్ర". సోమవారం (జూలై 1) హైదరాబాద్ ఫిలింనగర్ దైవసన్నిధానంలో లాంఛనంగా ఈ సినిమా ప్రారంభమైంది.

ఈ చిత్రాన్ని వీ4 క్రియేషన్స్ బ్యానర్‌లో కంచర్ల సత్యనారాయణరెడ్డి, గట్టు విజయ్ గౌడ్, చిన్ని చందు, వట్టం రాఘవేంద్ర, సముద్రాల మహేశ్ గౌడ్ నిర్మిస్తున్నారు. చంద్రశేఖర్ కానూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో శృతి మీనన్, ఆరుషి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. మహావీర్ మరో కీ రోల్ పోషిస్తున్నారు. ఈ సినిమాతో మలయాళం, తమిళ చిత్రాల్లో పాపులర్ అయిన శృతి మీనన్ తెలుగులోకి అడుగుపెడుతోంది.

కాగా కోడి బుర్ర సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో అతిథిలుగా పాల్గొన్న ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ క్లాప్ నివ్వగా దర్శకుడు భరత్ కమ్మ స్క్రిప్ట్ అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ స్పీచ్ ఇచ్చారు.

"కోడి బుర్ర చిత్రాన్ని మా మిత్రులు నిర్మిస్తున్నారు. మంచి కథను ఈ సినిమా కోసం ఎంచుకున్నారు. ప్రేక్షకుల్ని ఈ మూవీ ఆకట్టుకుని ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాం. హీరో శ్రీరామ్, హీరోయిన్ శృతి మీనన్, నిర్మాతలైన నా మిత్రులు, ఇతర టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా" అని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి తెలిపారు.

"ఈ రోజు మా కోడి బుర్ర సినిమా ప్రారంభోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో శ్రీరామ్ గారిని కొత్తగా చూస్తారు. ఆయన ఇప్పటిదాకా లవ్, రొమాంటిక్ తరహా చిత్రాలు చేశారు. కోడి బుర్ర సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారు. హీరోయిన్ శృతి మీనన్ డాక్టర్ రోల్ చేస్తోంది. కోడి బుర్ర అందరికీ నచ్చేలా మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా అవుతుందని నమ్ముతున్నాం" అని మూవీ డైరెక్టర్ చంద్రశేఖర్ కానూరి అన్నారు.

"కోడి బుర్ర సినిమా క్రైమ్ థ్రిల్లర్ కథతో మీ ముందుకు రాబోతోంది. ఈ సినిమా టైటిల్ వినగానే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. వీ 4 క్రియేషన్స్‌లో ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది. మా డైరెక్టర్ చంద్రశేఖర్‌కు ఇది నాలుగో సినిమా. కోడి బుర్ర చిత్రాన్ని అందరికీ నచ్చేలా ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నారు. శృతి మీనన్ తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేసింది. ఆరుషి మంచి రోల్ చేస్తోంది. ఒక ఇంట్రెస్టింగ్ మూవీలో పార్ట్ కావడం హ్యాపీగా ఉంది. మా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్‌కు థ్యాంక్స్" అని హీరో శ్రీరామ్ తెలిపాడు.

"నేను తమిళ, మలయాళంలో సినిమాలు చేశాను. కోడి బుర్ర చిత్రంతో తెలుగులోకి అడుగుపెడుతున్నాను. తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రంతో పరిచయం కావడం సంతోషంగా ఉంది. కోడి బుర్ర సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్" అని హీరోయిన్ శృతి మీనన్ చెప్పుకొచ్చింది.

"కోడి బుర్ర చిత్రంలో నాకు నటించే అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ కు థ్యాంక్స్. ఈ చిత్రం మా టీమ్ అందరికీ మంచి పేరు తెస్తుంది. మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నా" అని మరో హీరోయిన్ ఆరుషి తెలిపింది.

తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ కోడి బుర్ర లాంచ్
తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ కోడి బుర్ర లాంచ్