OTT Telugu Movies: ఈ వారం ఓటీటీలో ముచ్చటగా 3 తెలుగు సినిమాలే- ఈ యాక్షన్, బోల్డ్, క్రైమ్ థ్రిల్లర్స్‌ను ఎక్కడ చూడాలంటే?-must watch ott telugu movies on this week 3 best ott movies love mouli ott release satyabhama ott streaming aha ott news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Telugu Movies: ఈ వారం ఓటీటీలో ముచ్చటగా 3 తెలుగు సినిమాలే- ఈ యాక్షన్, బోల్డ్, క్రైమ్ థ్రిల్లర్స్‌ను ఎక్కడ చూడాలంటే?

OTT Telugu Movies: ఈ వారం ఓటీటీలో ముచ్చటగా 3 తెలుగు సినిమాలే- ఈ యాక్షన్, బోల్డ్, క్రైమ్ థ్రిల్లర్స్‌ను ఎక్కడ చూడాలంటే?

Sanjiv Kumar HT Telugu
Jun 29, 2024 11:23 AM IST

OTT Telugu Movies To Watch This Week: ఈ వారం ఓటీటీలోకి కేవలం మూడంటే మూడే సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అయితే 3 డిఫరెంట్ జోనర్స్‌తో వచ్చిన ఈ సినిమాలు కచ్చితంగా చూడాల్సినవే. క్రైమ్ థ్రిల్లర్, బోల్డ్, రివేంజ్ డ్రామాగా వచ్చిన ఈ 3 మూవీస్ ఏంటీ, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై లుక్కేస్తే..

ఈ వారం ఓటీటీలో ముచ్చటగా 3 తెలుగు సినిమాలే- ఈ యాక్షన్, బోల్డ్, క్రైమ్ థ్రిల్లర్స్‌ను ఎక్కడ  చూడాలంటే?
ఈ వారం ఓటీటీలో ముచ్చటగా 3 తెలుగు సినిమాలే- ఈ యాక్షన్, బోల్డ్, క్రైమ్ థ్రిల్లర్స్‌ను ఎక్కడ చూడాలంటే?

OTT Telugu Movies This Week: ప్రస్తుతం థియేటర్లలో ప్రభాస్ కల్కి 2898 ఏడీ హవానే నడుస్తోంది. కల్కి మినహా చూసేందుకు పెద్దగా సినిమాలు ఏవి లేవు. దాంతో అందరి దృష్టి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై పడింది. అయితే, ఈ వారం ఓటీటీలో కూడా అతి తక్కువగా తెలుగు సినిమాలు విడుదలయ్యాయి.

3 డిఫరెంట్ జోనర్స్

ఈ వారం మొత్తంగా 3 తెలుగు సినిమాలు రెండు రోజుల వ్యవధిలో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అది కూడా క్రైమ్ థ్రిల్లర్, బోల్డ్ కంటెంట్, రివేంజ్ యాక్షన్ డ్రామా వంటి 3 డిఫరెంట్ జోనర్స్‌లలో సినిమాలు రిలీజయ్యాయి. మరి ఆ సినిమాలు ఏంటీ, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, ఎక్కడ చూడాలనే వివరాలు తెలుసుకుందాం.

సత్యభామ ఓటీటీ

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ యాక్షన్ అవతార్‌లో కనిపించిన సినిమా సత్యభామ. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 7న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు పర్వాలేదనిపించుకుంది. తొలిసారిగా కాజల్ అగర్వాల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేసిన ఈ మూవీకి సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు.

20 రోజుల్లోనే ఓటీటీలోకి

మిశ్రమ స్పందన తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా సత్యభామ అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీలో జూన్ 28 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. మేజర్ డైరెక్టర్ శశికిరణ్ తిక్క సమర్పకుడిగా, స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమా 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. అలాంటి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు చూసేందుకు మంచి ఎంపిక అని చెప్పుకోవచ్చు.

లవ్ మౌళి ఓటీటీ

తెలుగులో రీసెంట్‌గా వచ్చిన రొమాంటిక్ అండ్ బోల్డ్ మూవీ లవ్ మౌళి ఇప్పుడు ఓటీటీలో అలరిస్తోంది. ఈ సినిమా కూడా జూన్ 7న థియేటర్లలో విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో బోల్డ్ కంటెంట్ భారీగా ఉన్న టేకింగ్‌లో ఎక్కడో తేడా కొట్టిందని జనాలు చెప్పారు. కిస్సిగ్ సీన్స్, బెడ్ సీన్స్ ఉన్న ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఇప్పుడు అలరిస్తోంది.

జక్కన్న శిష్యుడు

లవ్ అండ్ రొమాంటిక్ సినిమాగా తెరకెక్కిన లవ్ మౌళి తెలుగు ఓటీటీ ఆహాలో జూన్ 17 నుంచి డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. నవదీప్ హీరోగా చేసిన ఈ సినిమాలు ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు. కాగా ఈ సినిమాకు దర్శక దిగ్గజం డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి శిష్యుడు అవనీంద్ర దర్శకత్వం వహించారు. యూత్‌ను అట్రాక్ట్ చేసే ఈ సినిమా పెద్దలు మాత్రం ఒంటరిగా చూడటం బెటర్.

భజే వాయు వేగం ఓటీటీ

కార్తికేయ గుమ్మకొండ, ఐశ్వర్య మీనన్ హీరో హీరోయిన్లుగా నటించిన రివేంజ్ యాక్షన్ అండ్ అడ్వెంచర్ సినిమా భజే వాయు వేగం. మే 31న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. అన్నదమ్ముల బాండింగ్, తండ్రి బంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఫ్యామిలీ ఆడియెన్స్‌కు

నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 28 నుంచి భజే వాయు వేగం సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాతో ప్రశాంత్ రెడ్డి డైరెక్టర్‌గా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

Whats_app_banner