OTT Telugu Movies: ఈ వారం ఓటీటీలోకి 5 తెలుగు సినిమాలు- మరొకటి డబ్బింగ్ మూవీ- ఒక్కదాంట్లోనే 3 స్ట్రీమింగ్-this week telugu ott movies release on netflix jio cinema in that three telugu movies streaming on aha ott platform ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Telugu Movies: ఈ వారం ఓటీటీలోకి 5 తెలుగు సినిమాలు- మరొకటి డబ్బింగ్ మూవీ- ఒక్కదాంట్లోనే 3 స్ట్రీమింగ్

OTT Telugu Movies: ఈ వారం ఓటీటీలోకి 5 తెలుగు సినిమాలు- మరొకటి డబ్బింగ్ మూవీ- ఒక్కదాంట్లోనే 3 స్ట్రీమింగ్

Sanjiv Kumar HT Telugu
Aug 27, 2024 11:37 AM IST

Telugu OTT Movies Release On This Week: ఈ వారం ఓటీటీలోకి ఆరు సినిమాలు తెలుగులో రానున్నాయి. వాటిలో ఐదు స్ట్రయిట్ తెలుగు సినిమాలు అయితే.. ఒకటి మాత్రం డబ్బింగ్ చిత్రం. వీటిలో కూడా ఒక్క ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనే మూడు సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. మిగతా రెండు మరో రెండు ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయి.

ఈ వారం ఓటీటీలోకి 5 తెలుగు సినిమాలు- మరొకటి డబ్బింగ్ మూవీ- ఒక్కదాంట్లోనే 3 స్ట్రీమింగ్
ఈ వారం ఓటీటీలోకి 5 తెలుగు సినిమాలు- మరొకటి డబ్బింగ్ మూవీ- ఒక్కదాంట్లోనే 3 స్ట్రీమింగ్

New Telugu Movies On OTT: ప్రతివారం ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీసులు కుప్పలుతెప్పలుగా పడుతూనే ఉంటాయి. అయితే, తెలుగు ఆడియెన్స్ మాత్రం వాటిలో వచ్చే తెలుగు సినిమాలు ఏంటా అని చూస్తుంటారు. అలాంటి వారికోసమే ఈ వారం ఓటీటీల్లోకి తెలుగులో మొత్తం 6 సినిమాలు రానున్నాయి. వాటిలో 5 స్ట్రయిట్ తెలుగు సినిమాలు, ఒకటి డబ్బింగ్ మూవీ ఉంది. మరి అవేంటో చూసేద్దాం.

బడ్డీ ఓటీటీ

అల్లు శిరీష్ హీరోగా నటించిన లేటెస్ట్ ఫాంటసీ యాక్షన్ మూవీ బడ్డీ. సామ్ ఆంటోన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 2న థియేటర్లలలో విడుదలైంది. అయితే, అనుకున్నట్లు అంచనాలను అందుకోలేకపోయింది బడ్డీ మూవీ. గాయత్రి భరద్వాజ్, ప్రిషా సింగ్ రాజేష్ హీరోయిన్స్‌గా చేసిన బడ్డీ నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ కానుంది. ఆగస్ట్ 30 నుంచి బడ్డీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

ప్రభుత్వ జూనియర్ కళాశాల ఓటీటీ

ఇటీవల తెలుగులో రొమాంటిక్ లవ్ స్టోరీగా వచ్చిన మూవీ ప్రభుత్వ జూనియర్ కళాశాల. ప్రణవ్ ప్రీతమ్, షాజ్ఞశ్రీ వేణున్ హీరో హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు శ్రీనాథ్ పులకూరం దర్శకత్వం వహించారు. అతి తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 21న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. దీంతో ఇప్పుడు ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసింది.

ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మూవీ ఆగస్ట్ 26 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఈ సినిమా థియేటర్లలో విడుదలైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టింది.

పురుషోత్తముడు ఓటీటీ

యంగ్ హీరో రాజ్ తరుణ్ తిరగబడరా సామి సినిమా తర్వాత నటించిన లేటెస్ట్ మూవీ పురుషోత్తముడు. ఈ మూవీ ట్రైలర్‌తో శ్రీమంతుడు టైప్ కాన్సెప్ట్ అనే టాక్ వచ్చినప్పటికీ సినిమాపై పెద్దగా అంచనాలు ఏర్పడలేదు. అలా జూలై 26న థియేటర్లలో విడుదలైన పురుషోత్తముడు సినిమాను రామ్ భీమన తెరకెక్కించారు. అయితే ఈ సినిమాకు థియేటర్లలో పెద్దగా టాక్ బాగా రాలేదు.

అలా ప్లాప్ టాక్ తెచ్చుకున్న పురుషోత్తముడు మూవీ త్వరలోనే ఓటీటీలోకి వచ్చేయనుంది. ఆహా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ఆగస్ట్ 29 నుంచి పురుషోత్తముడు ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. యాక్షన్ కామెడీ మూవీగా వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్‌గా హాసినీ సుధీర్ నటిస్తే.. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, మురళీ శర్మ, బ్రహ్మానందం వంటి స్టార్ యాక్టర్స్ ఇతర కీలక పాత్రలు పోషించారు.

సారంగదరియా ఓటీటీ

తెలుగు సినిమాల్లో సహాయ నటుడి పాత్రలు పోషిస్తూ యాక్టర్ రాజా రవీంద్ర మంచి పేరు తెచ్చుకున్నారు. రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో నటించిన తెలుగు సినిమా సారంగదరియా. పెద్దగా హడావిడి లేకుండా జూలై 11న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం అంతగా వర్కౌట్ కాలేదు. దీంతో జనాలకు ఈ మూవీ చేరలేదు. ఈ సినిమా ఆగస్ట్ 31 నుంచి ఆహాలోనే ఓటీటీ రిలీజ్ కానుంది.

గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్ ఓటీటీ

హాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఫాంటసీ యాక్షన్ మూవీ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్: ది న్యూ ఎంపైర్ మూవీ జియో సినిమా ఓటీటీలో ఆగస్ట్ 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మార్చి 29న థఇయేటర్లలో విడుదలై సూపర్ హిట్ కొట్టిన ఈ సినిమా ఇంగ్లీష్‌తోపాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఓటీటీ రిలీజ్ కానుంది.

హనీమూన్ ఎక్స్‌ప్రెస్ ఓటీటీ

వీటితోపాటు హనీమూన్ ఎక్స్‌ప్రెస్ మూవీ కూడా అమెజాన్ ప్రైమ్‌లో ఆగస్ట్ 27న అనుకోకుండా ఓటీటీ రిలీజ్ అయింది.

మూడు ఒకే ఓటీటీలో

ఇలా ఈ వారం 5 తెలుగు స్ట్రయిట్ సినిమాలు, ఒక డబ్బింగ్ మూవీ ఓటీటీలోకి వస్తున్నాయి. వీటిలో పురుషోత్తముడు, సారంగదరియా, ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమాలు ఒకే ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ కానున్నాయి.