OTT Crime Thriller: ఇవాళే ఓటీటీలోకి వచ్చిన బ్లాక్ బస్టర్ తమిళ క్రైమ్ థ్రిల్లర్- 5 భాషల్లో స్ట్రీమింగ్- ఇక్కడ చూసేయండి!-ott crime thriller raayan ott streaming on amazon prime with 5 languages dhanush raayan ott release ott movies ott news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Crime Thriller: ఇవాళే ఓటీటీలోకి వచ్చిన బ్లాక్ బస్టర్ తమిళ క్రైమ్ థ్రిల్లర్- 5 భాషల్లో స్ట్రీమింగ్- ఇక్కడ చూసేయండి!

OTT Crime Thriller: ఇవాళే ఓటీటీలోకి వచ్చిన బ్లాక్ బస్టర్ తమిళ క్రైమ్ థ్రిల్లర్- 5 భాషల్లో స్ట్రీమింగ్- ఇక్కడ చూసేయండి!

Sanjiv Kumar HT Telugu

Raayan OTT Streaming Now: తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది తమిళ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ రాయన్. ఇవాళ ఓటీటీ రిలీజ్‌ అయిన్ రాయన్ తెలుగుతోపాటు ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించి దర్శకత్వం వహించిన రాయన్ ఏ ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్ అవుతుందో ఇక్కడ తెలుసుకోండి.

ఇవాళే ఓటీటీలోకి వచ్చిన బ్లాక్ బస్టర్ తమిళ క్రైమ్ థ్రిల్లర్- 5 భాషల్లో స్ట్రీమింగ్- ఇక్కడ చూసేయండి!

Raayan OTT Release: ఓటీటీలోకి వారం వారం సరికొత్త సినిమాలు, వెబ్ సిరీసులు దర్శనం ఇస్తూ అలరిస్తుంటాయి. అందులోను ఎక్కువగా శుక్రవారం రోజున ఎక్కువగా.. చాలా వరకు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు, ఇంట్రెస్టింగ్ మూవీస్ ఓటీటీ రిలీజ్ అవుతుంటాయి. అలా ఇవాళ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది తమిళ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ రాయన్.

కోట్లల్లో బాక్సాఫీస్ కలెక్షన్స్

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ యాక్ట్ చేసిన రీసెంట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా రాయన్. ధనుష్ కెరీర్‌లో 50వ చిత్రంగా వచ్చిన రాయన్‌కు తానే దర్శకత్వం వహించడం విశేషం. జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా అన్ని భాషల్లో విడుదలైంది రాయన్. తమిళంలో మంచి టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద కోట్లల్లో కలెక్షన్స్ దండుకుంది రాయన్ మూవీ.

పాజిటివ్ రివ్యూలు

రాయన్ సినిమా కథ పాతదే అయినప్పటికీ డైరెక్టర్‌గా ధనుష్ టేకింగ్ చాలా కొత్తగా ఉందని ప్రశంసలు వచ్చాయి. అలాగే ధనుష్ యాక్టింగ్‌ అదిరిపోయిందని, ఊర మాస్ లెవెల్ నటన అని అభిమానులు, నెటిజన్స్ సోషల్ మీడియాలో చాలా పాజిటివ్‌గా రివ్యూలు ఇచ్చారు. అయితే, తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రాయన్ తెలుగు ప్రేక్షకులకు మాత్రం అంతగా ఎక్కలేదు.

150 కోట్ల కలెక్షన్స్

కోలీవుడ్ బాక్సాఫీస్‌లో కలెక్షన్స్ అదరగొట్టిన తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధించడం కూడా కష్టం అయింది. కానీ, వరల్డ్ వైడ్‌గా రాయన్ సినిమా సుమారు రూ. 150 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసింది. దాంతో హీరో అయిన ధనుష్ డైరెక్టర్‌గా తెరకెక్కిన రాయన్ మూవీ ఇంత పెద్ద సక్సెస్ కావడం తమిళనాట, అభిమానుల్లో జోష్ నింపింది.

అధికారిక ప్రకటన

అయితే, సూపర్ హిట్ అయిన రాయన్ మూవీ నెల కాకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. గత కొన్ని రోజుల క్రితం రాయన్ మూవీని ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు సదరు డిజిటల్ ప్లాట్‌ఫామ్ అధికారికంగా ప్రకటించింది. అనౌన్స్‌మెంట్ ప్రకారమే ఇవాళ (ఆగస్ట్ 23) ఓటీటీలో రిలీజ్ అయింది రాయన్ సినిమా.

5 భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్

ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో రాయన్ డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. అంతేకాకుండా రాయన్ సినిమా తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ వంటి మొత్తం ఐదు భాషల్లో అందుబాటులో ఉంది. కాబట్టి, థియేటర్లలో మిస్ అయిన తెలుగు ఆడియెన్స్ రాయన్ సినిమాను ఇప్పుడు ఓటీటీలో ఎంచక్కా వీక్షించవచ్చు.

సందీప్ కిషన్ కీ రోల్

ఇదిలా ఉంటే, రాయన్ సినిమాలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కూడా కీ రోల్ పోషించాడు. ఈ ఇద్దరితోపాటు దుసరా విజయన్, కాళిదాస్ జయరామ్, ఎస్‌జే సూర్య, వరలక్ష్మీ శరత్ కుమార్, అపర్ణ బాలమురళి, ప్రకాష్ రాజ్, సెల్వ రాఘవన్, శరవణన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. అలాగే ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.