OTT Telugu Bold Movie: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు బోల్డ్ రొమాంటిక్ మూవీ.. ఇక్కడ చూసేయండి
OTT Telugu Bold Movie: ఓటీటీలోకి మరో తెలుగు బోల్డ్ మూవీ వచ్చేసింది. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాకుండానే నేరుగా డిజిటల్ ప్రీమియర్ కావడం విశేషం. గురువారం (ఆగస్ట్ 15) నుంచే ఈ బోల్డ్ రొమాంటిక్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఎందులో చూడాలంటే?
OTT Telugu Bold Movie: ఈ మధ్య తెలుగులో రూపొందుతున్న కొన్ని బోల్డ్ రొమాంటిక్ సినిమాలు నేరుగా ఓటీటీల్లోకే వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా ఆహా వీడియో ఇలాంటి సినిమాలను స్ట్రీమింగ్ చేస్తోంది. అలా అదే ఓటీటీలోకి తాజాగా వచ్చిన మూవీ ఎవోల్ (Evol). గురువారం (ఆగస్ట్ 15) నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్ మొదలైనట్లు సదరు ఓటీటీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
ఓటీటీలో తెలుగు బోల్డ్ మూవీ
ఆహా వీడియోలో ఈ ఎవోల్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. కొన్ని రోజుల కిందటే ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసిన సదరు ఓటీటీ.. తాజాగా గురువారం (ఆగస్ట్ 15) కూడా సినిమా స్ట్రీమింగ్ ప్రారంభం అయినట్లు వెల్లడించింది. "చీకటి నిజాలు ప్రేమను శాసిస్తాయా?" అనే క్యాప్షన్ తో ఆహా వీడియో ఈ విషయం తెలిపింది.
ఈ తెలుగు బోల్డ్ రొమాంటిక్ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఈ ఓటీటీలోకే వచ్చేసింది. ఈ మూవీ పోస్టర్ చూస్తేనే ఇదెంత బోల్డ్ మూవీయో అర్థమవుతోంది. ఓ బెడ్ పై అర్ధనగ్నంగా ఓ జంట పడుకోవడం ఈ పోస్టర్ లో చూడొచ్చు. రామ్ వెలగపూడి ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. నిజానికి ఎవోల్ కి అర్థం ఏమీ లేదు. దానిని తిరగేసి చదివితే లవ్ అని వస్తుంది.
టైటిల్‌లోనూ బోల్డ్‌నెస్
లవ్ అనే ఇంగ్లిష్ అక్షరాలను తిరగేసి ఈ మూవీకి టైటిల్ పెట్టారు. ఈ టైటిల్ తోనే మూవీ బోల్డ్‌నెస్ ఏంటో తెలిసిపోతోంది. నిజానికి ఈ సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేద్దామని భావించారు. కానీ సెన్సార్ బోర్డు దీనికి అభ్యంతరం చెప్పింది. ఇందులో మరీ బోల్డ్ సీన్స్ ఉండటంతో థియేట్రికల్ రిలీజ్ కు అనుమతి ఇవ్వలేదు.
దీంతో మేకర్స్ నేరుగా ఆహా ఓటీటీలోకి తీసుకొచ్చారు. గతంలోనూ ఇలాంటి రొమాంటిక్ సినిమాలను స్ట్రీమింగ్ చేసిన ఆహా.. మరోసారి అలాంటి జానర్ మూవీనే స్ట్రీమింగ్ చేస్తోంది. కేవలం తెలుగు కంటెంట్ మాత్రమే అందించే ఓటీటీల్లో ఒకటైన ఆహా వీడియో.. ఇలాంటి బోల్డ్ కంటెంట్ తో ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఈ ఎవోల్ మూవీలో నరేష్, రాగ్ మయూర్ కీలకపాత్రలు పోషించారు.
పంద్రాగస్టు ఓటీటీ రిలీజెస్
ఈ బోల్డ్ మూవీ ఒక్కటే కాదు.. పంద్రాగస్టు లాంగ్ వీకెండ్ కోసం చాలా సినిమాలు ఇప్పటికే ఈ వారం ఓటీటీల్లోకి వచ్చేశాయి. మంగళవారమే (ఆగస్ట్ 13) హాట్‌స్టార్ ఓటీటీలోకి డార్లింగ్ మూవీ వచ్చేసింది. ఇక బుధవారం (ఆగస్ట్ 14) ఈటీవీ విన్ ఓటీటీలో విరాంజనేయులు విహారయాత్ర అనే కామెడీ మూవీతోపాటు జియో సినిమాలో శేఖర్ హోమ్ అనే డిటెక్టివ్ వెబ్ సిరీస్ వచ్చాయి.
ఇక గురువారం (ఆగస్ట్ 15) ఆహా వీడియోలో ఈ ఎవోల్ తోపాటు.. కమెడియన్ వెన్నెల కిశోర్ నటించిన హారర్ కామెడీ మూవీ ఓఎంజీ ఓ మంచి ఘోస్ట్ కూడా రిలీజైంది. అటు జీ5 ఓటీటీలో మలయాళ ఆంథాలజీ మనోరతంగల్ స్ట్రీమింగ్ అవుతోంది.