The Body OTT: ఓటీటీలో అదిరిపోయే రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ది బాడీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?-the body ott streaming now on netflix the body ott platform sobhita dhulipala ott crime thrillers ott movies bollywood ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  The Body Ott: ఓటీటీలో అదిరిపోయే రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ది బాడీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

The Body OTT: ఓటీటీలో అదిరిపోయే రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ది బాడీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu
May 10, 2024 02:07 PM IST

The Body OTT Streaming Now: క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ ఉంటుంది. అలా ఈ మధ్య ఓటీటీలో అదిరిపోతున్న రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ది బాడీ. శోభితా ధూళిపాళ, ఇమ్రాన్ హష్మీ, రిషి కపూర్ నటించిన ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్, స్ట్రీమింగ్ వివరాల్లోకి వెళితే..

ఓటీటీలో అదిరిపోయే రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ది బాడీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలో అదిరిపోయే రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ది బాడీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

The Body OTT Release: సాధారణంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో వచ్చే సినిమాలపై ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది. అలాంటిది క్రైమ్ థ్రిల్లర్ (Crime Thriller Movie), మర్డర్ మిస్టరీ సినిమాలకు ఇంకాస్తా ఎక్కువ ఆదరణ దక్కుతోంది. ఈ జోనర్‌కు కాస్తా రొమాన్స్ యాడ్ చేసిన సినిమాలను చూసేందుకు అన్ని వర్గాల ఓటీటీ ప్రేక్షకులు క్యూరియాసిటీ చూపిస్తుంటారు.

ఆద్యంతం థ్రిల్లింగ్

అలా రొమాంటిక్ క్రైమ్ అండ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమానే ది బాడీ (The Body Movie). ఈ సినిమాలో ఊహించని థ్రిల్స్, ట్విస్టులు ఆడియెన్స్‌కు ఫుల్ ఎంటర్టైన్‌మెంట్ పంచుతాయి. ఆద్యంతం థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే ది బాడీ సినిమా 2019లో విడుదలైంది. ఇందులో నాగ చైతన్య (Naga Chaitanya) గర్ల్‌ఫ్రెండ్‌గా ప్రచారం జరుగుతున్న హాట్ బ్యూటి శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala) కీలక పాత్ర పోషించింది.

స్పానిష్ మూవీకి రీమేక్

శోభితాతో పాటు ది బాడీ సినిమాలో బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ, పాపులర్ హీరో, సీనియర్ యాక్టర్, యానిమల్ హీరో రణ్‌బీర్ కపూర్ తండ్రి రిషి కపూర్, బ్యూటిఫుల్ హీరోయిన్ వేదిక ముఖ్య పాత్రలు పోషించారు. 2012లో ఇదే టైటిల్‌తో వచ్చిన స్పానిష్ సినిమాకు రీమేక్‌గా హిందీలో ది బాడీ చిత్రాన్ని తెరకెక్కించారు.

శోభితా గ్లామర్ షో

ది బాడీ సినిమాకు దృశ్యం, దృశ్యం 2 వంటి క్రైమ్ అండ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు తెరకెక్కించటంలో ఎక్స్‌పర్ట్ అయిన మలయాళ డైరెక్టర్ జీతూ జోసేఫ్ దర్శకత్వం వహించారు. 2019లో వచ్చిన ఈ సినిమాకు ప్రస్తుతం ఐఎమ్‌డీబీ 5.2 రేటింగ్ ఇచ్చింది. కానీ, ఈ సినిమాలోని ట్విస్ట్‌లు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు శోభితా గ్లామర్ షో ఆడియెన్స్‌ను విపరీతంగా ఎంటర్టైన్ చేస్తుంది.

మాయమైపోయిన బాడీ

ది బాడీ కథ విషయానికొస్తే.. ప్రముఖ వ్యాపారవేత్త మాయ వర్మ (శోభితా ధూళిపాళ) అకస్మాత్తుగా చనిపోతుంది. కానీ, పోస్ట్ మార్టమ్‌ కాకముందే మార్చురీ నుంచి మాయ బాడీ మాయమైపోతుంది. దీంతో మాయ భర్త అజయ్ పూరి (ఇమ్రాన్ హష్మీ) కలవర పడుతాడు. దీంతో ఈ కేసుని సాల్వ్ చేసేందుకు ఎస్పీ జైరాజ్ రావల్ (రిషి కపూర్) ఎంట్రీ ఇస్తాడు.

గంట 40 నిమిషాల రన్ టైమ్

అసలు మాయ బాడీ ఏమైంది? నిజంగానే ఆమె చనిపోయిందా? అజయ్ పూరి కనిపెట్టిన రహస్యం ఏంటీ? ఇన్వెస్టిగేషన్‌లో ఏస్పీ జైరాజ్ రావల్ ఏం తెలుసుకున్నాడు? వంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ది బాడీ సినిమా తెరకెక్కింది. సుమారు గంట 40 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాను రూ. 3.46 కోట్లతో తెరకెక్కించారు.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో

వయోకామ్ 18 స్టూడియెస్ డిస్ట్రిబ్యూట్ చేసిన ఈ సినిమాను అజురే ఎంటర్టైన్‌మెంట్ నిర్మించింది. సునీర్ ఖేటెర్‌పాల్ నిర్మాతగా వ్యవహరించిన ఈ మర్డర్ మిస్ట్రరీ థ్రిల్లర్ ది బాడీ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో (Netflix OTT) స్ట్రీమింగ్ అవుతోంది. కానీ, ఇది హిందీ భాషలో మాత్రమే ప్రసారం అవుతోంది.

ఫ్యామిలీతో కాకుండా

ఇలాంటి మర్డర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి భాషతో సంబంధం లేదనుకుంటే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో ది బాడీ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూసే వీలుండకపోవచ్చు. కాబట్టి, ఒంటరిగా ఈ సినిమాను ఎంజాయ్ చేయొచ్చు.

IPL_Entry_Point