Saba Nayagan OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన మేఘా ఆకాష్ రొమాంటిక్ లవ్ స్టోరీ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?
Saba Nayagan OTT Streaming: కలర్ ఫోటో బ్యూటీ చాందిని చౌదరి నటించిన ఫస్ట్ తమిళ్ మూవీ సబా నాయగన్ ఓటీటీలోకి వచ్చేసింది. వాలెంటైన్స్ డే కానుకగా బుధవారం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ మూవీ రిలీజైంది.
Saba Nayagan OTT Streaming: కలర్ ఫోటో ఫేమ్ చాందిని చౌదరి సబా నాయగన్ మూవీతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో తొలి అడుగులోనే విజయాన్ని అందుకున్నది. అశోక్ సెల్వన్ హీరోగా నటించిన ఈ మూవీలో చాందిని చౌదరితో పాటు మేఘా ఆకాష్, కార్తిక మురళీధరన్ హీరోయిన్లుగా కనిపించారు. సలార్‌కు పోటీగా డిసెంబర్‌లో 22న థియేటర్లలో రిలీజైన మంచి వసూళ్లను రాబట్టింది.
వాలెంటైన్స్ డే కానుకగా...
సబా నాయగన్ మూవీ వాలెంటైన్స్ డే కానుకగా బుధవారం ఓటీటీలో రిలీజైంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేశారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ట్రెండింగ్ మూవీస్‌లో ఒకటిగా సబా నాయగన్ నిలిచింది.
సబా నాయగన్ కథ ఇదే...
తాగిన మత్తులో సబా (అశోక్ సెల్వన్) అనే యువకుడు న్యూసెన్స్ క్రియేట్ చేస్తాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. లవ్ ఫెయిల్యూర్‌తోనే సబా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాడని పోలీస్ ఆఫీసర్ అర్థం చేసుకుంటాడు. అతడి ప్రేమకథను గురించి అడుగుతాడు. సబా జీవితంలోకి వచ్చిన రియా, మేఘతో పాటు దీప్తి ఎవరు? ఈ ముగ్గురిలో సబా ఎవరిని ప్రేమించాడు అన్నదే ఈ మూవీ కథ.
డిఫరెంట్ టైమ్ పీరియడ్స్‌లో సాగే లవ్ స్టోరీగా దర్శకుడు సీఎస్ కార్తికేయన్ ఈ మూవీని తెరకెక్కించాడు. కాలేజీలో సబాను ప్రేమించే యువతిగా చాందిని చౌదరి కనిపించింది. లవ్ స్టోరీని స్వచ్ఛంగా స్క్రీన్‌పై ప్రజెంట్ చేసిన తీరుతో పాటు అశోక్ సెల్వన్, మేఘాకాష్, చాందిని చౌదరి యాక్టింగ్ అభిమానులను మెప్పించాయి. థియేటర్లలో ఈ మూవీ పదిహేను కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకున్నది.
కోలీవుడ్ ఎంట్రీ...
సబా నాయగన్ చాందిని చౌదరి ఫస్ట్ తమిళ్ మూవీ కావడం విశేషం. గ్లామర్ రోల్ కాకుండా యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్రను ఎంచుకొని తొలి సినిమాతోనే వైవిధ్యతను చాటుకున్నది. తెలుగులో కలర్‌ఫొటో హీరోయిన్‌గా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. టాలీవుడ్‌లో మను, సమ్మతమే, సూపర్ ఓవర్‌తో పాటు చాలా సినిమాలు చేసింది. విశ్వక్ సేన్ గామి సినిమాలో చాందిని చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. మార్చిలో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఝూన్సీ, గాలివానతో పాటు తెలుగులో మరికొన్ని వెబ్‌సిరీస్‌లు కీలక పాత్రలు చేసింది చాందిని చౌదరి.
నిన్నిలా నిన్నిలా మూవీతో ఎంట్రీ...
నిన్నిలా నిన్నిలా మూవీతో అశోక్ సెల్వన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడయ్యాడు. విశ్వక్‌సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణంలో గెస్ట్ రోల్ చేశాడు. భద్రమ్‌తో పాటు అశోక్ సెల్వన్ హీరోగా నటించిన మరికొన్ని తమిళ డబ్బింగ్ మూవీస్‌తో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించాయి.
మేఘా ఆకాష్ కూడా స్వతహాగా తమిళ్ అయినా తెలుగులోనే ఎక్కువగా సినిమాలు చేసింది. లై, ఛల్ మోహనరంగ, గుర్తుందా శీతాకాలంతో పాటు తెలుగులో పదికిపైగా సినిమాల్లో నటించింది. కానీ అవేవీ ఆమెకు విజయాల్ని తెచ్చిపెట్టలేకపోయాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా గత ఏడాది రవితేజ రావణాసురతో పాటు మను చరిత్ర సినిమాల్లో అవకాశాల్ని దక్కించుకున్నది. ప్రస్తుతం మరో నాలుగు సినిమాలో బిజీగా ఉంది.