Gorre Puranam: రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె.. పోలీస్ కేసుతో జైలులో ఖైదీగా! (వీడియో)
Suhas Gorre Puranam Trailer Released: యంగ్ హీరో సుహాస్ నటించిన మరో కొత్త సినిమా గొర్రె పురాణం. యూనిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్‌ను ఇటీవల మేకర్స్ విడుదల చేశారు. ఒక గొర్రె వల్ల రెండు మతాల మధ్య చిచ్చు ఎలా రగిలిందనే కాన్సెప్ట్‌తో గొర్రె పురాణం సినిమా ఉన్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.
Gorre Puranam: రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ప్రసన్న వదనం వంటి హ్యాట్రిక్ విజయాల తర్వాత హీరో సుహాస్ నుంచి వస్తున్న యూనిక్ ఎంటర్‌టైనర్ 'గొర్రె పురాణం'. బాబీ దర్శకత్వంలో ప్రవీణ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌కి ఇదివరకే మంచి రెస్పాన్స్ వచ్చింది.
వింతగా ఉంది కదా
ఇటీవల గొర్రె పురాణం మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 'నా పేరు రామ్. అలియాస్ యేసు. గొర్రె జైల్లో ఉండటం ఏందీ, ఆడికెల్లి తప్పించుకోవడం ఏందీ ? ఇదంతా మీకు వింతగా ఉంది కదా' అనే వాయిస్ ఓవర్‌తో మొదలైన గొర్రె పురాణం ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేసింది.
సుహాస్ చెప్పే డైలాగ్
ఒక గొర్రె ఒక గ్రామంలో రెండు మతాల మధ్య చిచ్చుపెట్టిన నేపథ్యాన్ని ట్రైలర్‌లో చాలా ఆసక్తికరంగా ప్రజెంట్ చేశారు. గొర్రె వలన జరిగిన పరిణామాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. సుహాస్ ఖైదీ క్యారెక్టర్‌లో టెర్రిఫిక్‌గా కనిపించారు. 'మనం బతకడం కోసం వాటిని చంపేయొచ్చు. మనది ఆకలి. మరి అవి బతకడం కోసం మనల్ని చంపేస్తే అది ఆత్మ రక్షణే కదా' అని సుహాస్ చెప్పిన డైలాగ్ ఆలోచన రేకెత్తిస్తుంది.
యూనిక్ పాయింట్
గొర్రె పురాణం ట్రైలర్‌లో సుహాస్ పర్ఫార్మెన్స్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. అదే తరహాలో సినిమా ఆద్యంతం ఉంటుందని తెలుస్తోంది. ఇంటెన్స్ క్యారెక్టర్‌లో అదరగొట్టారు సుహాస్. గొర్రె పురాణం సినిమాలో సుహాస్‌తోపాటు పోసాని కృష్ణ మురళి, రఘు కీలక పాత్రల్లో కనిపించారు. దర్శకుడు బాబీ ఓ యూనిక్ పాయింట్‌ని చాలా బ్రిలియంట్‌గా ప్రజెంట్ చేశారని ట్రైలర్ చూస్తే అర్థం చేసుకోవచ్చు.
ఎమోషన్ ఎలివేట్ చేస్తూ
గొర్రె పురాణం ట్రైలర్‌లో పవన్ సిహెచ్ నేపథ్య సంగీతం ఎమోషన్‌ని ఎలివేట్ చేసేలా ఉంది. సురేష్ సారంగం కెమరా పనితనం హైలెట్‌గా నిలిచింది. ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నతంగా ఉన్నాయి. మొత్తానికి ట్రైలర్ సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచింది. ప్రస్తుతం ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
నెటిజన్స్ ఆరా
అలాగే గొర్రె గొడవ పెట్టడం ఏంటీ, అది జైలులో ఉండటం, నేరం ఏంటీ అనే విషయాలను ఆసక్తికరంగా తెలుసుకుంటున్నారు నెటిజన్స్. ఇదిలా ఉంటే, గొర్రె పురాణం సినిమాను ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 20 న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఇకపోతే వరుసెపెట్టి సినిమాలతో దూసుకుపోతున్నాడు హీరో సుహాస్.
ఓటీటీ ప్లాట్‌ఫామ్స్
ఇదివరకే మూడు డిఫరెంట్ జోనర్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకున్న సుహాస్ గొర్రె పురాణంతో సక్సెస్‌ను కంటిన్యూ చేయనున్నాడని తెలుస్తోంది. కాగా, రైటర్ పద్మభూషణ్ మూవీ జీ5 ఓటీటీలో ప్రస్తుతం డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. సుహాస్ మిగతా హిట్ సినిమాలు అయిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ప్రసన్నవదనం తెలుగు ఓటీటీ ఆహాలో అందుబాటులో ఉన్నాయి.