Shivani Nagaram: సింగర్‌గా మారిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ హీరోయిన్.. ఏ సినిమాకు పాడిందంటే?-shivani nagaram amayakanga song released from aarambham ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Shivani Nagaram Amayakanga Song Released From Aarambham

Shivani Nagaram: సింగర్‌గా మారిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ హీరోయిన్.. ఏ సినిమాకు పాడిందంటే?

Sanjiv Kumar HT Telugu
Mar 18, 2024 02:50 PM IST

Shivani Nagaram Sung Aarambham Song: అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటి శివాని నాగరం తాజాగా సింగర్‌గా మారింది. ఆరంభం అనే సినిమాలో శివాని పాడిన పాటను ఇటీవల విడుదల చేశారు.

సింగర్‌గా మారిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ హీరోయిన్.. ఏ సినిమాకు పాడిందంటే?
సింగర్‌గా మారిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ హీరోయిన్.. ఏ సినిమాకు పాడిందంటే?

Shivani Nagaram Amayakanga Song: సినీ సెలబ్రిటీలు యాక్టింగ్‌లోనే కాకుండా వారిలోని టాలెంట్‌ను కూడా చూపిస్తుంటారు. ఇప్పటికీ ఎంతోమంది స్టార్ హీరోలు తమ గొంతెత్తి పాటలు పాడారు. జూనియర్ ఎన్టీఆర్‌ను మొదలుకొని తమిళ హీరో శింబు, నిత్య మీనన్ వరకు ఎంతోమంది అదిరిపోయే పాటలు పాడారు. ఇక కొంతమంది యాక్టింగ్‌తోపాటు డైరెక్షన్, మ్యూజిక్ కూడా అందించేవారు ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్‌లో మరో హీరోయిన్ సింగర్‌గా మారింది.

ఆమెనే శివాని నాగరం. సుహాస్ హీరోగా నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన శివాని నాగరం ఇటీవలే సింగర్ అవతారం ఎత్తింది. ఆరంభం అనే సినిమాలో శివాని ఓ బ్యూటిఫుల్ లవ్ సాంగ్ పాడింది. మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కల్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ఆరంభం. ఈ సినిమాను ఏవీటీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అభిషేక్ వీటీ నిర్మిస్తున్నారు.

ఎమోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఆరంభం సినిమాకు అజయ్ నాగ్ వి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఆరంభం సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ 'అమాయకంగా..'ను విడుదల చేశారు. ఈ పాటను అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ హీరోయిన్ శివాని నాగరం ఆలపించింది. ప్రస్తుతం ఇదే విషయం విశేషంగా మారింది. టాలీవుడ్‌లోకి మరో కొత్త హీరోయిన్ కమ్ సింగర్ వచ్చిందంటూ పాట విన్న నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

సింజిత్ యెర్రమిల్లి సంగీతాన్ని అందించిన అమాయకంగా పాటకు శ్రీకాంత్ అల్లపు లిరిక్స్ రాశారు. 'అమాయకంగా హడావుడేమి లేక.. తార చేరుకుందా ఇలా. అయోమయంగా తలాడించులాగ, నేల మారుతుందే ఎలా.. కాలానికే కొత్త రంగు పూసే, మాయతార సొంతమేగా, హాయి సంతకాలు చేసేనా..' అంటూ లవ్ ఫీల్‌తో బ్యూటిఫుల్ కంపోజిషన్‌తో సాగుతుందీ పాట. ఈ పాటకు శివాని నాగరం వాయిస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇదిలా ఉంటే ఆరంభం సినిమా ప్రస్తుతం షూటింగ్ ఆఖరి దశలో ఉంది. త్వరలోనే ఆరంభం మూవీని గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు. దానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా ఇవ్వనున్నారు. మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కల్యాణ్, రవీంద్ర విజయ్‌తోపాటు లక్ష్మణ్ మీసాల, బోడెపల్లి అభిషేక్, సురభి ప్రభావతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇక సినిమాకు దేవ్ దీప్ గాంధీ కుందు సినిమాటోగ్రఫీ అందించారు.

ఆరంభం సినిమాకు సింజిత్ యెర్రమిల్లి సంగీతం అందించగా.. సందీప్ అంగిడి డైలాగ్స్ రాశారు. ఎడిటర్‌గా ఆదిత్య తివారీ, ప్రీతమ్ గాయత్రి ఎడిటర్ బాధ్యతలు చేపట్టారు. వినయ్ రెడ్డి మామిడి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ కాగా అభిషేక్ వీటీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా ప్రమోషన్స్‌లో సైతం శివాని నాగరం యమునా తాటిలో అనే పాట పాడి అలరించింది.

ఇక అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలో సుహాస్‌తో ముద్దు సీన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది శివాని నాగరం. ఆ కిస్సింగ్ సీన్ గురించి తాను భయపడిన తన తల్లిదండ్రులు మాత్రం ఇది నీ వృత్తి అంటూ తనన ప్రోత్సహించారని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది శివాని నాగరం.

WhatsApp channel