Suhas: తండ్రి అయిన కలర్ ఫొటో హీరో సుహాస్.. రెండుసార్లు గుండు చేయించుకున్నా అంటూ!-suhas comments in ambajipeta marriage band trailer launch ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Suhas: తండ్రి అయిన కలర్ ఫొటో హీరో సుహాస్.. రెండుసార్లు గుండు చేయించుకున్నా అంటూ!

Suhas: తండ్రి అయిన కలర్ ఫొటో హీరో సుహాస్.. రెండుసార్లు గుండు చేయించుకున్నా అంటూ!

Sanjiv Kumar HT Telugu
Jan 25, 2024 09:11 AM IST

Suhas At Ambajipeta Marriage Band Trailer Launch: తాను తండ్రి అయినట్లు కలర్ ఫొటో హీరో సుహాస్ తాజాగా అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ ట్రైలర్ లాంచ్‌లో తెలిపాడు. అలాగే తాను రెండుసార్లు గుండు చేయించుకున్నట్లు వెల్లడించాడు. అలా ఎందుకు చేశాడనే వివరాల్లోకి వెళితే..

తండ్రి అయిన కలర్ ఫొటో హీరో సుహాస్.. రెండుసార్లు గుండు చేయించుకున్నా అంటూ!
తండ్రి అయిన కలర్ ఫొటో హీరో సుహాస్.. రెండుసార్లు గుండు చేయించుకున్నా అంటూ!

Suhas Speech At Ambajipeta Marriage Band Trailer Launch: కలర్ ఫొటో సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సుహాస్. సైడ్, నెగెటివ్ పాత్రలతోపాటు హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుహాస్. అలా తాజాగా అంబాజీపేట మ్యారేజి బ్యాండు మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహించగా.. ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కానుంది. తాజాగా బుధవారం (జనవరి 24) హైదరాబాద్‌లో అంబాజీపేట మ్యారేజి బ్యాండు ట్రైలర్ లాంచ్ సందర్భంగా ట్రైలర్ విడుదల చేశారు. ఆ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో తనకు బాబు పుట్టినట్లు సుహాస్ తెలిపాడు. అలాగే అంబాజీపేట మ్యారేజి బ్యాండు మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.

"నాకు నిన్న (జనవరి 23) బాబు పుట్టాడు. ఆ హ్యాపీనెస్‌లోనే ఉన్నాను. అంబాజీపేట మ్యారేజి బ్యాండు ట్రైలర్‌కు మీ రెస్పాన్స్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మా సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇది నా కెరీర్‌లో ఎంతో స్పెషల్ మూవీ. కథ విన్నప్పటి నుంచి నాతో పాటు మా టీమ్ అంతా ఈ ప్రాజెక్ట్ కు డెడికేట్ అయ్యాం. రెండు సార్లు గుండు చేయించుకున్నా. బ్యాండ్ కొట్టడం నేర్చుకున్నా. కథ మీద నమ్మకంతోనే అంతగా కనెక్ట్ అయి వర్క్ చేశాం. సినిమా చూస్తున్నప్పుడు మీరు చాలా సందర్భాల్లో మీ లైఫ్‌లో జరిగిన సందర్భాలను రిలేట్ చేసుకుంటారు. ఫిబ్రవరి 2న మా సినిమాకు మంచి సక్సెస్ అందిస్తారని ఆశిస్తున్నాం" అని సుహాస్ అన్నాడు.

ఇదిలా ఉంటే క్యారెక్టర్ రోల్స్ చేస్తూ అలరించిన సుహాస్ కలర్ ఫొటో మూవీతో హీరోగా మంచి సక్సెస్ అందుకున్నాడు. గతేడాది రైటర్ పద్మభూషణ్ మూవీతో కూడా మంచి హిట్ కొట్టాడు. అంతకుముందు ఫ్యామిలీ డ్రామా, హిట్ 2 ది సెకండ్ కేస్ చిత్రాల్లో నెగెటివ్ రోల్స్ చేసి ఆశ్చర్యపరిచాడు సుహాస్. ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య, అర్ధ శతాబ్ధం, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, ఆనందరావు అడ్వెంచర్స్, గమనం, మను చరిత్ర వంటి చిత్రాల్లో మంచి రోల్స్ చేసి ఆకట్టుకున్నాడు.

ఇప్పుడు అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాతో రానున్నాడు సుహాస్. కాగా ఇదే ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ దుశ్యంత్ కటికనేను మాట్లాడారు. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా ట్రైలర్ మీకు బాగా నచ్చిందని మీ హ్యాపీనెస్, రెస్పాన్స్ చూస్తుంటే అర్థమవుతోంది. కొన్ని రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమాను రూపొందించాం. లవ్ స్టోరీతో పాటు ఇంటెన్స్ డ్రామా ఉంటుంది. ఊరిలో జరిగే కథ కాబట్టి కులాల ప్రస్తావన ఉంటుంది. అయితే ఎవరినీ కించపరిచే అంశాలు మూవీలో ఉండవు. సినిమాను మీ చేతుల్లో పెడుతున్నాం. మీరే సూపర్ హిట్ చేయాలి. సినిమా మేకింగ్‌లో నాకు సపోర్ట్ చేసిన కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా" అని దుశ్యంత్ తెలిపారు.

IPL_Entry_Point