Prasanna Vadanam OTT: ఓటీటీలోకి సుహాస్ లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఆరోజే స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?
Prasanna Vadanam OTT Streaming: మట్టి స్టార్ సుహాస్ నటించిన లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ప్రసన్నవదనం. ఇవాళే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్, డిజిటల్ ప్రీమియర్ తేది వివరాలు ఆసక్తిగా మారాయి.
Prasanna Vadanam OTT Release: యంగ్ టాలెంటెడ్ హీర్ సుహాస్ వరుస సినిమాలతో మంచి జోష్ మీదున్నాడు. సైడ్ రోల్స్, విలన్ క్యారెక్టర్స్ చేస్తూనే మరోవైపు హీరోగా తన మార్క్ క్రియేట్ చేసుకుంటున్నాడు. హిట్ 2 వంటి సినిమాల్లో ప్రతినాయకుడిగా మెప్పించిన సుహాస్ రైటర్ పద్మభూషణ్, అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ వంటి సినిమాలతో హీరోగా మంచి హిట్స్ అందుకున్నాడు.
హాట్రిక్ కొట్టేందుకు
ఇప్పుడు మూడోసారి హ్యాట్రిక్ కొట్టేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుహాస్ సినిమా ప్రసన్నవదనం. ఫేస్ బ్లైండ్‌నెస్ అనే కొత్త కాన్సెప్టుతో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంది. అలాగే మంచి బజ్ కూడా క్రియేట్ చేసింది.
అవి ప్లస్
ఈ సినిమా ట్రైలర్‌ను పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ రిలీజ్ చేయడం, సుహాస్ మట్టి స్టార్ అని ప్రశంసిచండం సినిమాకు ప్లస్ అయింది. ఇక ఎట్టకేలకు ఇవాళ అంటే మే 3న థియేటర్లలో విడుదలైన ప్రసన్నవదనం సినిమా మంచి టాక్‌తో అలరిస్తోంది. ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకుల నుంచి రెగ్యులర్ షోస్ ఆడియెన్స్ వరకు సినిమాను ప్రశంసిస్తున్నారు.
థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్
మరోసారి తన నటనతో సుహాస్ అదరగొట్టాడని, సినిమాలో ట్విస్టులు, సస్పెన్స్ సీన్స్, థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిందని సోషల్ మీడియా వేదిక ద్వారా తెలియజేస్తున్నారు. అలాగే సినిమాకు పాజిటివ్ రివ్యూస్ కూడా వస్తున్నాయి. కొత్త డైరెక్టర్ అర్జున్ వైకే టేకింగ్, డైరెక్షన్ బాగుందని ప్రశంసలు వస్తున్నాయి.
తెలుగు ఓటీటీ సంస్థ ఆహా
ఇలా మంచి టాక్‌తో దూసుకుపోతున్న ప్రసన్నవదనం సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఆహా డీసెంట్ రేటుకు కొనుగోలు చేసిందని సమాచారం. ఇక థియేట్రికల్ రిలీజ్ తర్వాత నెల రోజులకు ఓటీటీలో ఈ సినిమాను ప్రీమియర్ చేయనున్నారట.
అప్పుడే స్ట్రీమింగ్
ఓటీటీ స్ట్రీమింగ్‌కు నెల రోజులు అనే కండీషన్ అని పెట్టుకున్నప్పటికీ ఆ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్, ఆడియెన్స్ రెస్పాన్స్‌ను బట్టి డిజిటల్ ప్రీమియర్ చేస్తారని తెలిసిందే. కాబట్టి ప్రసన్నవదనం సినిమాను నెల రోజుల తర్వాత లేదా ముందు కూడా ఓటీటీ స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉంది. ఈ లెక్కన జూన్ నెలలో లేదా మే నెల చివరి వారంలో ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఎక్కువగా ఆహా ఓటీటీలో
కాగా ఇప్పటివరకు సుహాస్ హీరోగా నటించి హిట్ కొట్టిన రెండు సినిమాలు కూడా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. కలర్ ఫొటో, అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ రెండు సినిమాలు రెండు ఆహాలో స్ట్రీమ్ అవుతున్నాయి. ఇక మంచి కామెడీ లవ్ స్టోరీగా వచ్చిన రైటర్ పద్మభూషణ్ మూవీ జీ5 వేదికగా ప్రీమియర్ అవుతోంది.
హీరోయిన్స్-నటీనటులు
ఇదిలా ఉంటే, ప్రసన్నవదనం సినిమాను లిటిల్ థాట్స్ సినిమాస్ బ్యానర్‌పై మణికంఠ జేఎస్, ప్రసాద్ రెడ్డి నిర్మించారు. దీనికి సుకుమార్ శిష్యుడు అర్జున్ వైకే దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయిన్స్‌గా రాశి సింగ్, పాయల్ రాధాకృష్ణ నటించారు. వీరితోపాటు హర్ష చెముడు, యాక్టర్ నందు ఇతరులు కీలక పాత్రలు పోషించారు.