Bhamakalapam 2 Trailer Release: భామాకలాపం 2 ట్రైలర్‌కు డేట్, టైమ్ ఫిక్స్.. ఈ మూవీ నేరుగా ఏ ఓటీటీలోకి రానుందంటే!-aha ott movie bhamakalapam 2 trailer release date confirmed ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Aha Ott Movie Bhamakalapam 2 Trailer Release Date Confirmed

Bhamakalapam 2 Trailer Release: భామాకలాపం 2 ట్రైలర్‌కు డేట్, టైమ్ ఫిక్స్.. ఈ మూవీ నేరుగా ఏ ఓటీటీలోకి రానుందంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 09, 2024 08:36 PM IST

Bhamakalapam 2 Trailer OTT Movie Release Date: భామాకలాపం 2 సినిమా ట్రైలర్‌కు డేట్, టైమ్ ఖరారయ్యాయి. ఆహా ఓటీటీలోకి నేరుగా రానున్న ఈ మూవీ ట్రైలర్ గురించి అధికారిక అప్‍డేట్ వచ్చింది. స్ట్రీమింగ్ డేట్ కూడా ఇప్పటికే ఖరారైంది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Bhamakalapam 2 Trailer Release:  భామాకలాపం 2 ట్రైలర్‌కు డేట్, టైమ్ ఫిక్స్
Bhamakalapam 2 Trailer Release:  భామాకలాపం 2 ట్రైలర్‌కు డేట్, టైమ్ ఫిక్స్

Bhamakalapam 2 OTT Trailer Date: ప్రియమణి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘భామాకలాపం 2’ చిత్రంపై మంచి ఆసక్తి నెలకొంది. ఇటీవల టీజర్‌తో ఈ చిత్రంపై బజ్ పెరిగింది. ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ సినిమా నేరుగా అడుగుపెట్టనుంది. 2022లో వచ్చిన భామాకలాపం చిత్రానికి సీక్వెల్‍గా ఇది వస్తోంది. ‘భామాకలాపం 2’ స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది. ఇప్పుడు ట్రైలర్ కూడా రెడీ అయింది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్, టైమ్‍ను ఆహా వెల్లడించింది.

భామాకలాపం 2 సినిమా ట్రైలర్ రేపు (ఫిబ్రవరి 10) సాయంత్రం 5 గంటలకు రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్ నేడు (ఫిబ్రవరి 9) వెల్లడించింది. ముఖంపై గాయంతో ప్రియమణి తుపాకీ పట్టుకున్న కొత్త పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. క్రైమ్ హీస్ట్ థ్రిల్లర్‌గా ఈ మూవీ ఉండనుంది.

“ఈసారి హీస్ట్ మామూలుగా ఉండదు. ది డేంజరస్ వైఫ్ అలియాజ్ అనుపమ.. ఫైర్ చేసేందుకు రెడీ అయింది. భామాకలాపం 2 ట్రైలర్ రేపు సాయంత్రం 5 గంటలకు వస్తుంది” అని ఆహా ట్వీట్ చేసింది.

భామాకలాపం 2 స్ట్రీమింగ్ వివరాలు

భామాకలాపం 2 రిలీజ్ డేట్‍ను ఇప్పటికే ఆహా ఓటీటీ ప్రకటించింది. ఈ మూవీ ఫిబ్రవరి 16వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. టీజర్‌ సమయంలోనే ఈ తేదీని ఆహా వెల్లడించింది.

భామాకలాపం 2లో అనుపమ పాత్రను ప్రియమణి చేయగా.. శిల్పగా శరణ్య ప్రదీప్ నటించారు. వీరిద్దరూ కలిసి ఓ దోపిడీ చేయాలని అనుకుంటారు. దీని చుట్టూ క్రైమ్ హీస్ట్ థ్రిల్లర్‌గా ఈ మూవీ వస్తోంది. ఈ చిత్రానికి అభిమన్యు తాడిమేటి దర్శకత్వం వహించారు.

భామాకలాపం 2 మూవీలో సీరత్ కపూర్, రఘు ముఖర్జీ, అనూజ్ గురువార్ కీలకపాత్రలు పోషించారు. ప్రశాంత్ ఆర్ విహారీ ఈ మూవీకి సంగీతం అందించగా.. డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ చేశారు దీపక్ యారగెరా. విప్లవ్ నిషాదం ఎడిటింగ్ చేశారు. భామాకలాపం 2 సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు కూడా రిలీజ్ అయ్యాయి.

భామాకలాపం మొదటి భాగంలో యూట్యూబర్‌గా ఉండే ప్రియమణి.. ఈ రెండో భాగంలో హోటల్ నిర్వహిస్తుంటారు. శరణ్య కూడా ఆమె వద్దే పని చేస్తుంటారు. ఇద్దరూ కలిసి ఓ విలువైన వస్తువును కాజేసేందుకు ప్లాన్ చేస్తారు. బంగారంతో తయారు చేసిన ఓ కోడి పుంజును దోపిడీ చేయడం చుట్టూ ‘భామాకలాపం 2’ ఉంటుందని టీజర్ ద్వారా తెలిసింది. ఈ క్రమంలో ఓ క్రైమ్‍లోనూ ప్రియమణి, శరణ్య చిక్కుకుంటారు. రేపు (ఫిబ్రవరి 10) రానున్న ట్రైలర్‌తో ఈ చిత్రం గురించి మరింత తెలియనుంది.

స్ట్రీమింగ్‍కు వచ్చేసిన బబుల్‍గమ్

Bubblegum OTT Streaming: ప్రముఖ యాంకర్ సుమ కుమారుడు రోషన్ కనకాల హీరోగా నటించిన బబుల్‍గమ్ చిత్రం ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నేడు (ఫిబ్రవరి 9) స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ లవ్ రొమాంటిక్ డ్రామాకు రవికాంత్ పారెపు దర్శకత్వం వహించారు. మంచి అంచనాలతో థియేటర్లలోకి గత డిసెంబర్‌లో వచ్చిన బబుల్‍గమ్ అంచనాలకు తగ్గట్టు వసూళ్లను రాబట్టలేకపోయింది. ఇప్పుడు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది.

IPL_Entry_Point