Evol Review: ఎవోల్ రివ్యూ.. ఓటీటీలోకి నేరుగా వచ్చిన తెలుగు బోల్డ్ మూవీ ఎలా ఉందంటే?
Evol Movie Review In Telugu: ఆహా ఓటీటీలోకి నేరుగా వచ్చిన తెలుగు బోల్డ్ అండ్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎవోల్. పెళ్లి, ఎఫైర్స్, బోల్డ్ కంటెంట్, క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ మూవీకి రామ్ యోగి వెలగపూడి దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఎవోల్ రివ్యూలో తెలుసుకుందాం.
టైటిల్: ఎవోల్
నటీనటులు: శివకుమార్ రామచంద్రవరపు, సూర్య శ్రీనివాస్, జెన్నిఫర్ ఇమ్మాన్యూయెల్, దివ్య శర్మ తదితరులు
కథ, దర్శకత్వం, నిర్మాత: రామ్ యోగి వెలగపూడి
సంగీతం: సునీల్ కశ్యప్
నిర్మాణ సంస్థ: నక్షత్ర్ ఫిల్మ్ ల్యాబ్స్
ఓటీటీ ప్లాట్‌ఫామ్: ఆహా
ఓటీటీ రిలీజ్ డేట్: ఆగస్ట్ 15, 2024
Evol Review In Telugu: ఈ మధ్య తెలుగులోనూ బోల్డ్ కంటెంట్ సినిమాలు ఎక్కువగానే వస్తున్నాయి. అలాంటి వాటికి థియేటర్లలో రిలీజ్ చేసేందుకు అనుమతి లభించకపోవడంతో నేరుగా ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. అలా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌కు వచ్చిన బోల్డ్ కంటెంట్ మూవీనే ఎవోల్.
కథ, దర్శకత్వం, నిర్మాత, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్ని తానై రామ్ యోగి వెలగపూడి తెరకెక్కించిన ఎవోల్ మూవీ నేరుగా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. పెళ్లి, ఎఫైర్స్, బోల్డ్ కంటెంట్‌తో పాటు క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉందో ఎవోల్ మూవీ రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
ప్రభు (శివకుమార్ రామచంద్రవరపు)ను నిధి (జెన్నిఫర్ ఇమ్మాన్యూయెల్) పెళ్లి చేసుకుంటుంది. ప్రభు ఫ్రెండ్, బిజినెస్ పార్టనర్ రిషి (సూర్య శ్రీనివాస్)తో నిధి అక్రమసంబంధం పెట్టుకుంటుంది. అలాగే ప్రభు తన అసిస్టెంట్ ప్రశాంతి (దివ్య శర్మ)తో పెళ్లికి ముందు నుంచే ఎఫైర్ కొనసాగిస్తుంటాడు. ఓరోజు నైట్ తన ఎఫైర్ గురించి భార్య నిధికి చెప్పి డివోర్స్ అడుగుతాడు ప్రభు.
భర్త ప్రభు డివోర్స్ అడిగాడని, తాను కూడా తమ ఇల్లీగల రిలేషన్‌షిప్ గురించి చెప్పినట్లు రిషితో నిధి చెబుతుంది. దాంతో నిధిపై రిషి ఫైర్ అవుతాడు. రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోతాడు. కట్ చేస్తే రిషి, ప్రభు ఇద్దరూ కలిసి తమ ఎఫైర్స్ గురించి మాట్లాడుకుంటూ డ్రింక్ చేస్తుంటారు. అక్కడికి ఎంట్రీ ఇచ్చి కాసేపు ఫన్ చేద్దామని మాట్లాడిన నిధి వాళ్లిద్దరిని గన్‌తో షూట్ చేస్తుంది.
ట్విస్టులు:
ప్రభు, రిషిని నిధి గన్‌తో షూట్ చేసిన తర్వాత ఏమైంది? అసలు వాళ్లిద్దరిని నిధి ఎందుకు చంపాలనుకుంది? నిజంగా వాళ్లను మర్డర్ చేసిందా? ఈ ముగ్గురి గతం ఏంటీ? వీళ్ల మధ్య రిలేషన్‌షిప్ ఎలా ఏర్పడింది? ప్రభుతో ఎఫైర్ పెట్టుకున్న అసిస్టెంట్ ప్రశాంతి తన భర్తతో ఎందుకు విడిపోవాలని అనుకుంది? రిషి భార్య స్వాతి పాత్ర ఏంటీ? అనే విషయాలతో సాగిన అడల్ట్ కంటెంట్ మూవీనే ఎవోల్.
విశ్లేషణ:
లవ్ (LOVE) అనే పదం ఇంగ్లీష్ లెటర్స్‌ను రివర్స్ చేసి చదివితే ఎవోల్ (EVOL) అని వస్తుంది. "ఏ లవ్ స్టోరీ ఇన్ రివర్స్" అనేది ఉపశీర్షిక. అందుకే టైటిల్‌ను అలా పెట్టారు. టైటిల్‌గా సినిమా కూడా రివర్స్‌గా సాగుతుంది. నిజానికి సినిమా మొత్తం కథ అరగంటలో అయిపోతుంది. కానీ, ఎమోషనల్ సీన్స్, రిపీటెడ్ బోల్డ్ సీన్స్, ఫ్లాష్‌బ్యాక్, రిలేషన్స్ ఏర్పడటం వంటి సీన్లతో మరో అరగంటసేపు సాగదీశారు.
మొదటి అరగంట
భార్య నిధికి తన ఎఫైర్ గురించి ప్రభు చెప్పడంతో సినిమా ప్రారంభం అవుతుంది. భర్త డివోర్స్ ఇస్తాననడం గురించి ప్రభు ఫ్రెండ్ రిషితో తమ ఇల్లీగల్ రిలేషన్‌షిప్ గురించి చెప్పినట్లు చెప్పడంతో మరింత ఇంట్రెస్టింగ్‌గా స్టోరీ నడుస్తుంది. మొదటి అరగంట ఇంట్రెస్టింగ్ సాగిన తర్వాత చాలా వరకు బోర్ కొడుతుంది. అడల్ట్ కంటెంట్, గతం గురించి చెప్పే విషయాలు కొంతవరకు బాగానే ఉన్నా మరి సాగదీతలా అనిపిస్తుంది.
ఎఫైర్స్ తప్పా
ఒకేసారి ఒక్కరితో కాకుండా అంతకంటే ఎక్కువమందిని ప్రేమించడం తప్పా అని ప్రియుడితో నిధి అడుగుతుంది. ఇదే కాన్సెప్ట్‌తో సినిమా మొత్తం నడుస్తుంది. అయితే, ఈ మూవీ వుమెన్ ఎంపవర్‌మెంట్ కోసం తీసినట్లు, భార్యలను భర్తలు బాగా చూసుకోవాలి, వాళ్ల ఫ్రీడమ్ వాళ్లకు ఇవ్వాలి అనే ఇంటెన్షన్‌తో తెరకెక్కించినట్లు డైరెక్టర్ చెప్పారు. కానీ, మూవీ చూస్తే ఇదేనా వుమెన్ ఎంపర్‌మెంట్ అనిపిస్తుంది. సినిమాలో ఇల్లీగల్ ఎఫైర్స్ తప్పా ఇంకోటి కనిపించదు.
నాన్ లీనియర్ స్త్రీన్‌ప్లే
భార్యకు భర్త ఇచ్చిన ఫ్రీడమ్.. తను కూడా ఇంకో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకోవడం కోసమే అన్నట్లుగా ఉంది కానీ, నిజంగా భార్యకు స్వాతంత్య్రం ఇచ్చినట్లుగా లేదు. సినిమాలో విపరీతమైన పచ్చి అడల్ట్ కంటెంట్‌తో నింపేశారు. అయితే అది చాలా రిపీటెడ్‌గా వస్తూనే ఉంటుంది. మూడేళ్ల క్రితం, రెండేళ్ల క్రితం, ప్రస్తుతం అంటూ నాన్ లీనియర్ స్త్రీన్‌ప్లేతో విసుగుతెప్పించారు. వాళ్లు ఎఫైర్ పెట్టుకోవడంలో కూడా కొత్తదనం ఏం చూపించలేదు.
ఊహించని క్లైమాక్స్ ట్విస్ట్
రొటీన్ స్టోరీకి ఇంటిమెట్ సీన్స్ యాడ్ చేసి తీశారు. ఇల్లీగల్ రిలేషన్‌షిప్‌లో సాటిస్‌ఫ్యాక్షన్, ఎంజాయ్‌మెంట్ గురించి వచ్చే కన్వర్జేషన్ ఇంట్రెస్టింగ్‌గానే ఉన్నా లవ్ అని చెప్పే ఎమోషన్ కన్విన్సింగ్‌గా లేదు. ఇక వీటన్నింటికి తోడు క్లైమాక్స్ ట్విస్ట్. ఈ ట్విస్ట్ కోసమా ఇదంతా చేసింది అనే డౌట్ వస్తుంది. అలాగే అది నిజమా.. ఏది నిజమా అనే మరో కన్‌ఫ్యూజన్ ఏర్పడుతుంది. అసలు ఏం చెప్పాలనుకున్నారో అర్థం కాలేదు.
అదిరిపోయిన కెమెరా వర్క్
అడల్ట్ సీన్స్‌ను ప్రధానంగా తీసుకుని దానికి క్రైమ్, సైకలాజీ, కాస్తా హారర్ ఎలిమెంట్స్‌ను టచ్ చేశారు. కానీ, కెమెరా వర్క్ మాత్రం చాలా బాగుంది. చాలా కొత్తగా సినిమాటోగ్రఫీ ఉంటుంది. చాలా వరకు కెమెరా చూపించిన యాంగిల్స్ కొత్త ఫీల్ ఇస్తాయి. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఫ్రెష్ మూడ్‌లోకి తీసుకెళ్తుంది.
బాగున్న యాక్టింగ్, డబ్బింగ్
Evol Movie Explained In Telugu: అలాగే క్యారెక్టర్స్ పర్ఫామెన్స్, హీరోయిన్స్‌కు చెప్పిన డబ్బింగ్ కూడా చాలా బాగుంది. వారి యాక్టింగ్‌తో బాగానే ఎంగేజ్ చేశారు. అయితే, ప్రశాంతి డబ్బింగ్ మాత్రం కాస్తా లిప్ సింక్ మిస్ అయింది. ఓవరాల్‌గా చెప్పాలంటే మూవీ ఓకే అనుకోవచ్చు. చూడటం మాత్రం ఓన్ రిస్క్. కానీ, ఫ్యామిలీతో మాత్రం అస్సలు చూడకండి. ఒంటరిగా ఉంటే మాత్రం ఇయర్‌ఫోన్స్‌తో చూసేయండి.