OTT Bold Movie: నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన బోల్డ్ మూవీ- 6 భాషల్లో స్ట్రీమింగ్- ఇక్కడ చూసేయండి!-phir aayi haseen dillruba ott release on netflix ott bold movie phir aayi haseen dillruba ott streaming taapsee pannu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Bold Movie: నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన బోల్డ్ మూవీ- 6 భాషల్లో స్ట్రీమింగ్- ఇక్కడ చూసేయండి!

OTT Bold Movie: నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన బోల్డ్ మూవీ- 6 భాషల్లో స్ట్రీమింగ్- ఇక్కడ చూసేయండి!

Sanjiv Kumar HT Telugu
Aug 09, 2024 02:34 PM IST

Phir Aayi Haseen Dillruba OTT Streaming: ఓటీటీలోకి నేరుగా బోల్డ్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రూబా వచ్చేసింది. తాప్సీ పన్ను, విక్రాంత్ మాస్సే, సన్నీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రూబా ఓటీటీలో 6 భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన బోల్డ్ మూవీ- 6 భాషల్లో స్ట్రీమింగ్- ఇక్కడ చూసేయండి!
నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన బోల్డ్ మూవీ- 6 భాషల్లో స్ట్రీమింగ్- ఇక్కడ చూసేయండి!

Phir Aayi Haseen Dillruba OTT Release: ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఈ జోనర్‌కు బోల్డ్‌గా రొమాన్స్ యాడ్ చేస్తే అవి విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇలా వచ్చే బోల్డ్ అండ్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీసులపై ఓటీటీ ఆడియెన్స్‌ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.

ఓటీటీలో మంచి రెస్పాన్స్

ఈ క్రమంలో లేటెస్ట్‌గా ఓటీటీలోకి వచ్చిన బోల్డ్ రొమాంటిక్ మూవీనే ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రూబా. 2021 సంవత్సరంలో నేరుగా ఓటీటీలోకి వచ్చిన హసీన్ దిల్‌రూబా మూవీకి ఇది సీక్వెల్. అప్పట్లో ఈ మొదటి పార్ట్ మూవీ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. మంచి రెస్పాన్స్‌తో విజయం సాధించింది. ఇందులో తాప్సీ, విక్రాంత్ మాస్సే, హర్షవర్ధన్ రాణే నటనతో మెప్పించారు.

భారీ అంచనాలు

అంతేకాకుండా హసీన్ దిల్‌రూబా ఫ్యామిలీ ఎఫైర్, రొమాన్స్, క్రైమ్, బోల్డ్ కంటెంట్ వంటి అంశాలతో తెరకెక్కి మంచి సస్పెన్స్ థ్రిల్లర్‌గా పేరు తెచ్చుకుంది. క్లైమాక్స్ ఎండ్ కూడా పార్ట్ 2కి హింట్ ఇచ్చేలా ఉండటంతో సీక్వెల్‌పై చాలా బజ్ క్రియేట్ అయింది. దాంతో ఈ సీక్వెల్‌గా వచ్చిన ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రూబాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆరు భాషల్లో స్ట్రీమింగ్

అందుకు తగినట్లే ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రూబా ఫస్ట్ లుక్ పోస్టర్, ట్రైలర్ ఉన్నాయి. ఇక ఎట్టకేలకు డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది బోల్డ్ అండ్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రూబా. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో నేటి నుంచి (ఆగస్ట్ 9) డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. అది కూడా హిందీ, తెలుగు, తమిళం, ఇంగ్లీష్, స్పానిష్, బ్రెజిలియన్ పోర్చుగీస్ ఆరు భాషల్లో అందుబాటులో ఉంది.

దర్శకత్వం-సంగీతం

ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రూబా సినిమాను ఎల్లో ప్రొడక్షన్స్, టీ సిరీస్ ఫిల్మ్ బ్యానర్స్‌పై నిర్మించారు. ఈ మూవీని ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. సినిమాకు జయప్రద్ దేశాయ్ దర్శకత్వం వహించారు. సాచెట్ పరంపర, అనురాగ్ సైకియా సంగీతం అందించారు.

ఓటీటీలో రిలీజ్

ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రూబా చిత్రంలో తాప్సీ పన్ను, విక్రాంత్ మాస్సే, సన్నీ కౌశల్ ప్రధాన పాత్రలు పోషించారు. వీరితోపాటు ఆదిత్య శ్రీవాస్తవ, జిమ్మీ షీర్‌గిల్, సానంద్ వర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు. అయితే, మొదటి పార్ట్ మంచి సక్సెస్ కావడంతో రెండో సినిమాను థియేటర్లలో విడుదల చేస్తారు అనే టాక్ వచ్చింది. కానీ, అనూహ్యంగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు.

బాలీవుడ్‌కే పరిమితం

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఆగస్ట్ 9 నుంచి ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రూబా సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆ అనౌన్స్‌మెంట్‌ ప్రకారం ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది ఈ మూవీ. కాగా ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమైన తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్‌కి పరిమితం అయింది.