Niharika Konidela On OTT: తెలుగు ఓటీటీపై నిహారిక కొణిదెల కామెంట్స్.. ఇదే బెస్ట్ నిర్ణయమంటూ!-niharika konidela comments on committee kurrollu ott release on etv win in pre streaming celebrations telugu ott news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Niharika Konidela On Ott: తెలుగు ఓటీటీపై నిహారిక కొణిదెల కామెంట్స్.. ఇదే బెస్ట్ నిర్ణయమంటూ!

Niharika Konidela On OTT: తెలుగు ఓటీటీపై నిహారిక కొణిదెల కామెంట్స్.. ఇదే బెస్ట్ నిర్ణయమంటూ!

Sanjiv Kumar HT Telugu
Sep 12, 2024 08:22 AM IST

Niharika Konidela Comments On Telugu OTT ETV Win: మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన రూరల్ బ్యాక్‌డ్రాప్ మూవీ కమిటీ కుర్రోళ్లు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఈ నేపథ్యంలో తెలుగు ఓటీటీపై నిహారిక కొణిదెల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అదే బెస్ట్ నిర్ణయమంటూ చెప్పుకొచ్చింది.

తెలుగు ఓటీటీపై నిహారిక కొణిదెల కామెంట్స్.. ఇదే బెస్ట్ నిర్ణయమంటూ!
తెలుగు ఓటీటీపై నిహారిక కొణిదెల కామెంట్స్.. ఇదే బెస్ట్ నిర్ణయమంటూ!

Niharika Konidela Comments On OTT Telugu: మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్‌పీ, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. ఈ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శకత్వం వహించారు. ఆగస్ట్ 9న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకున్న కమిటీ కుర్రోళ్లు సినిమా నెల రోజులకు ఓటీటీలోకి వచ్చేసింది. సెప్టెంబర్ 12 అర్థరాత్రి నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది కమిటీ కుర్రోళ్లు. ఈ సినిమా తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన ఈటీవీ విన్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఆహా తర్వాత తెలుగు ఓటీటీగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈటీవీ విన్.

ప్రీ స్ట్రీమింగ్ సెలబ్రేషన్స్

కమిటీ కుర్రోళ్లు ఓటీటీ రిలీజ్‌పై ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం కమిటీ కుర్రోళ్లు ప్రీ స్ట్రీమింగ్ సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకల్లో తెలుగు ఓటీటీ అయిన ఈటీవీ విన్‌పై, ఈటీవీ ఛానెల్‌పై నిహారిక కొణిదెల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

"మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియన్స్‌కి మరోసారి థాంక్ యూ సో మచ్. నా ఇండస్ట్రీ జర్నీ ఈటీవీ డీ జూనియర్స్ షోతో స్టార్ట్ చేశాను. నన్ను ఆడియన్స్‌కి పరిచయం చేసిన ఈటీవీకి థాంక్ యూ సో మచ్. ఈటీవీలో వచ్చే కంటెంట్ మీ మా మన అనుకునేలా ఉంటుంది. 'కమిటీ కుర్రోళ్లు’ అలాంటి సినిమానే. మీ సినిమాలా అనుకొని తీశాం" అని నిహారిక కొణిదెల తెలిపింది.

"మా కమిటీ కుర్రోళ్లు సినిమా ఈటీవీ విన్‌ ఓటీటీలో రావడం మేము తీసుకున్న బెస్ట్ డెసిషన్. సెప్టెంబర్ 12న ఈటీవి విన్‌లో మా 'కమిటీ కుర్రోళ్లు’ రీరిలీజ్ అవుతుంది. థియేటర్‌లో ఎలా అయితే పండగ, జాతరలా ఎంజాయ్ చేశారో, ఈటీవీ విన్‌లో కూడా చూసి అలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను" అని నిహారిక కొణిదెల చెప్పుకొచ్చింది.

ముందుకు వెళ్తారు

అలాగే, డైరెక్టర్ యదు వంశీ మాట్లాడుతూ.. "కమిటీ కుర్రోళ్లు సినిమాను ప్రేక్షకులు వోన్ చేసుకున్నందుకు థాంక్ యూ సో మచ్. మీ అందరికీ రుణపడి ఉంటాను. ఈ సినిమాలో నటించిన అందరూ గొప్ప నటులుగా కెరీర్‌లో ముందుకు వెళ్తారు. ఈ అవకాశం ఇచ్చిన నిహారిక గారికి, రమేష్ గారికి ధన్యవాదాలు" అని తెలిపారు.

"ఒక మెమొరీని బంధించి , అందరి బయోపిక్‌గా సినిమాని మీ ముందుపెట్టాం. ఈ సినిమా ఈటీవి విన్‌లో రావడం చాలా ఆనందంగా ఉంది. ఇది పక్కా తెలుగు సినిమా. ఇలాంటి సినిమా ఈటీవీ విన్‌లో ఉండాలి. ఈ సినిమాని ప్రోత్సహించిన నిహారిక గారికి, ఈటీవి విన్‌కి ధన్యవాదాలు. సెప్టెంబర్ 12న ఈ సినిమా ఈటీవీ విన్‌లో వస్తుంది. అందరూ చూసి సపోర్ట్ చేయాలి" అని మూవీ డైరెక్టర్ యదు వంశీ కోరారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన్యం రమేష్ మాట్లాడుతూ.. "ఈటీవిన్‌లో మా సినిమా రావడం చాలా ఆనందంగా ఉంది. మయూరి, మౌనరాగం లాంటి కంటెంట్ ఉండే సినిమాలు తీసే సంస్థలో మా సినిమా రావడం గౌరవంగా ఉంది. ఈటీవీ విన్ ద్వారా ఈ సినిమా మ్యాగ్జిమమ్ ఆడియన్స్‌కి చేరువవుతుందని కోరుకుంటున్నాం" అని తెలిపారు.