Dhoni Movie Debut : ఇక నటుడిగా ఎంఎస్ ధోనీ.. దళపతి విజయ్ సినిమాలో కీలక పాత్ర!-ms dhoni set to make movie debut with thalapathy vijay news goes viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dhoni Movie Debut : ఇక నటుడిగా ఎంఎస్ ధోనీ.. దళపతి విజయ్ సినిమాలో కీలక పాత్ర!

Dhoni Movie Debut : ఇక నటుడిగా ఎంఎస్ ధోనీ.. దళపతి విజయ్ సినిమాలో కీలక పాత్ర!

Anand Sai HT Telugu

Dhoni In Movies : ఎంఎస్ ధోనీ సినిమాల్లోకి రానున్నాడా? ఏ సినిమాతో అరంగేట్రం చేయనున్నాడు? ఇలాంటి ప్రశ్నలు తాజాగా మెుదలయ్యాయి. అయితే దీనికి సంబంధించి ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది.

ఎంఎస్ ధోనీ, దళపతి విజయ్ (Twitter)

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) ఆగస్టు 15, 2020న భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజున తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. తర్వాత ఐపీఎల్(IPL) ఆడుతూ.. కనిపిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్(CSK) జట్టును ముందు ఉండి నడిపిస్తు్న్నాడు. అయితే ధోనీ సినిమాల్లోకి రానున్నాడని వార్తలు వస్తున్నాయి. ఎంఎస్ ధోని ఎట్టకేలకు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ నటుడు దళపతి విజయ్‌(Thalapthy Vijay)తో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టవచ్చని ఇప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుకు నాయకత్వం వహించడంతోపాటు టైటిల్స్ గెలిచిన ఘనత ధోనీకి ఉంది. ధోనీ గ్రౌండ్లోకి వస్తున్నాడంటే.. తలైవా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేస్తే.. ఫ్యాన్స్ అంతా ఖుషి అయిపోతారు. తమిళనాడుతో ధోనీకి మంచి సంబంధాలు ఉన్నాయి.

కొన్ని కథనాల ప్రకారం విజయ్ నటిస్తున్న 'దళపతి 68'లో(Thalapathy 68) చిత్రంతో ధోనీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడు. కీలక పాత్రలో నటించడానికి చర్చలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. వెంకట్ ప్రభు(Venkat Prabhu) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాతో ధోనీ సినిమాల్లో అడుగుపెట్టనున్నాడట. MS ధోని కాస్టింగ్ గురించి అధికారిక వివరాలు ఇంకా విడుదల కానప్పటికీ, ఈ పుకార్లు సోషల్ మీడియాలో ధోని అభిమానులను ఖుషి చేస్తున్నాయి.

ఎంఎస్ ధోని, అతని భార్య సాక్షి ఇప్పటికే ధోని ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించారు. ఈ సంస్థ ఇటీవలే 'లెట్స్ గెట్ మ్యారేజ్' అనే తమిళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. సాక్షి ధోనీ(Sakshi Dhoni) కూడా తన భర్త ఎంఎస్ ధోని సినీ పరిశ్రమలో అరంగేట్రం చేయడాన్ని తోసిపుచ్చలేదు. మంచి కథ, సందేశం ఉన్న పాత్ర వస్తే ఎంఎస్ ధోనీ సినిమా(MS Dhoni Cinema)లో నటించాలనే ఆలోచన చేస్తాడని సాక్షి ధోని గత నెలలో చెన్నైలో చెప్పారు.

యాక్షన్ చిత్రాలకు ఎంఎస్ ధోని సరిపోతాడని సాక్షి వెల్లడించింది. 'అతను ఎప్పుడూ యాక్షన్‌లో ఉంటాడు. ధోనీని హీరోగా పెట్టి సినిమా తీయాలని ప్లాన్ చేస్తే అది యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్ అవుతుంది. మంచి కథ, మంచి పాత్ర ఉంటే ఆలోచించొచ్చు. సినిమాలో నటించే విషయం గురించి ఆయన ఆలోచిస్తాడు.' అని సాక్షి ధోని చెప్పింది.

ఇక దళపతి విజయ్ నటించే చిత్రం కోసం నటీనటులు ఇంకా ఖరారు కాలేదు. అక్టోబర్‌లో షూటింగ్ ప్రారంభమై.. 2024 దీపావళికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకవేళ ఎంఎస్ ధోనీ ఈ సినిమాలో నటిస్తే.. ఇక ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. దళపతి విజయ్, ధోనీ స్క్రీన్ పై కనిపిస్తే.. బాక్సాఫీసు షేక్ అవుతుందని అంటున్నారు.