Ziva Dhoni : ధోనీ కూతురు జీవా ఏ క్లాస్? స్కూల్ ఫీజు ఎంత? షాక్ అవ్వకండి
Ziva Dhoni : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ప్రపంచ క్రికెట్‌లో తనదైన ముద్ర వేశాడు. కెప్టె్న్ కూల్ గా ధోనీ పేరు ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ధోనీ కుమార్తెకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అప్పుడప్పుడు ఆమె చేసే అల్లరి చూసి సంబరపడిపోతుంటారు.
ధోనీ కుమార్తె జీవా(Ziva Dhoni) గురించి.. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నోసార్లు.. ధోనీ ఆట చూసేందుకు గ్రౌండ్ కు వచ్చింది. కూతురితో ఆడుకోవడం అంటే ధోనీకి చాలా ఇష్టం. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ పలు వాణిజ్య ఒప్పందాలు, ఐపీఎల్(IPL) కాంట్రాక్ట్, ప్రకటనల ద్వారా ఏటా వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. రాంచీలోని MS ధోని లవిహ్ ఫామ్‌హౌస్‌లో లగ్జరీ, కార్లు, బైక్‌లు ఉన్నాయి. ఇన్ని సంపద ఉన్నప్పటికీ ధోనీ తన జీవితంలోని చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా ఆనందిస్తాడు.
భారత క్రికెట్‌లో పెద్ద పేరు సంపాదించినప్పటికీ, MS ధోని రాంచీ నగరాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడడు. అక్కడే నివసిస్తున్నాడు. ఎంఎస్ ధోనీ తన కూతురిలోనూ అదే అనుభూతిని నింపాలనుకుంటున్నాడు. ధోనీ భార్య సాక్షి(Sakshi Dhoni) 2015లో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ సమయంలో ఎంఎస్ ధోని(MS Dhoni) ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. భారత జట్టుకు కెప్టెన్‌గా.. వన్డే ప్రపంచకప్ ట్రోఫీని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నాడు. కూతురు జీవా పుట్టినప్పుడు ధోనీ ఇండియాలో లేడు.
దేశం తరఫున ఆడుతూ.. తన కుటుంబంతో లేకుండా విలువైన క్షణాలను త్యాగం చేశాడు ధోనీ. రాబోయే యువ క్రికెటర్లకు రోల్ మోడల్ అని చెప్పవచ్చు. ఇక ధోనీ కూతురు జీవా(Dhoni Daughter Ziva) జార్ఖండ్ రాజధాని రాంచీలో పెరుగుతోంది. ప్రస్తుతం 8 ఏళ్ల జీవా 3వ తరగతి చదువుతోంది. స్కూల్లో చాలా తెలివైన బాలికగా పేరు తెచ్చుకుంది. జీవా ధోని స్కూల్ పేరు టౌరియన్ వరల్డ్ స్కూల్, రాంచీ(Taurian World School Ranchi).
టౌరియన్ వరల్డ్ స్కూల్.. రాంచీలోని ఉత్తమ పాఠశాలల్లో ఒకటి. అందువలన, వార్షిక పాఠశాల ఫీజులు కూడా ఎక్కువగా ఉంటాయి. పెద్ద సెలబ్రిటీ కుమార్తె కావడంతో మంచి సంస్థలోనే చదువుతుంది జీవా. కుమార్తె క్రీడలు లేదా కళలలో వెనుకబడి ఉండటం ధోనీకి ఇష్టం లేదు. జీవా ధోని చదివే పాఠశాల ఆమె బాగా చదువుకోవడానికి అన్ని వనరులను అందిస్తుంది.
జీవాను ఈ స్కూల్‌కి పంపేందుకు ఎంఎస్ ధోని చెల్లిస్తున్న ఫీజు ఎంతో తెలుసా? టౌరియన్ వరల్డ్ స్కూల్ ఫీజు స్ట్రక్చర్ పాఠశాల వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి ఉంది. డే స్కాలర్ విద్యార్థులు (2 నుండి 8 తరగతులు) సంవత్సరానికి రూ. 2,75,000 చెల్లించాలి. జీవా ధోనీ 3వ తరగతి చదువుతున్నందున, ఆమె వార్షిక పాఠశాల ఫీజు కూడా అదే. జీవా కూడా డే స్కాలర్ విద్యార్థి. ఆమె నెలవారీ ఫీజు రూ. 23,000. ఒకవేళ జీవా ధోని ఈ స్కూల్‌లో అకమిడేషన్ తోపాటు ఉంటే సంవత్సరానికి రూ. 4,40,000 చెల్లించాల్సి ఉంటుంది.
కోట్లాది ఆస్తులున్న ధోనీకి ఈ మొత్తం పెద్దదేమీ కాదు. ఇప్పుడు జీవా ధోని సోషల్ మీడియాలో పాపులర్ పర్సన్. ఆమె ఇన్‌స్టాగ్రామ్(Instagram) ఖాతాలో 2.3 మిలియన్ల మంది అభిమానులు ఉన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) సమయంలో ఫీల్డ్‌లో జీవా తన నాన్న ఆటను చూసేందుకు వచ్చినది చూడొచ్చు.