Video: ధోనీ ఫిట్నెస్ గురించి సాక్షిని అడిగిన ఫ్యాన్స్.. అమె ఏం చెప్పిందంటే!
Video: ఎంఎస్ ధోనీ ఫిట్నెస్ గురించి అతడి భార్య సాక్షిని అడిగారు అభిమానులు. దీనికి ఆమె స్పందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ ఏడాది మేలో మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో తన జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (CSK)ను విజేతగా నిలిపాడు ధోనీ. సీఎస్కేకు ఐదోసారి ఐపీఎల్ టైటిల్ అందించాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మొత్తం మోకాలి గాయంతో కుంటుకుంటూనే ఆడాడు ఎంఎస్ ధోనీ. సారథిగా జట్టును విజయపథంలో నడిపాడు. అయితే, సీజన్ ముగియగానే శస్త్రచికిత్స చేయించున్నాడు. దీంతో ధోనీ ఫిట్నెస్ ఎలా ఉందోనని అభిమానులు ఆలోచిస్తున్నారు. ఈ తరుణంలో ధోనీ ఫిట్నెస్ గురించి అతడి భార్య సాక్షిని కొందరు అభిమానులు అడిగారు. దీనికి ఆమె స్పందించారు.
ధోనీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కింద ఎంఎస్ ధోనీ, సాక్షి తొలి చిత్రంగా ఎల్జీఎం (లెట్స్ గెట్ మ్యారీడ్)ను నిర్మించారు. ఈ చిత్ర ప్రమోషన్లలో సాక్షి బిజీగా ఉన్నారు. వరుసగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ధోనీ ఎలా ఉన్నాడని కొందరు అభిమానులు సాక్షిని ఓ ఈవెంట్లో అడిగారు. దీనికి ఆమె స్పందించారు.
“మహీ భాయ్ ఎలా ఉన్నాడు, మహీ భాయ్ ఫిట్నెస్ ఎలా ఉంది?” అని కొందరు అభిమానులు అరుస్తూ సాక్షిని అడిగారు. దీనికి సాక్షి స్పందించారు. “మహీ భాయ్ కోలుకుంటున్నాడు” అని ఫ్యాన్స్‌కు చెప్పారు సాక్షి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వచ్చే ఏడాది ఐపీఎల్లో ధోనీ ఆడతాడా లేడా అనే విషయం ఉత్కంఠగా మారింది. శరీరం సహకరిస్తే ఆడాలనే ఉందని ఈ ఏడాది ఫైనల్ తర్వాత మహీ చెప్పాడు.
కాగా, ధోనీ బ్యానర్లో వచ్చిన ఎల్జీఎం సినిమా నేడు (జూలై 28) థియేటర్లలో విడుదలైంది. తమిళంతో రిలీజ్ అయింది. ఈ చిత్రంలో హరీశ్ కల్యాణ్, లవ్ టుడే ఫేమ్ ఇవానా హీరోహీరోయిన్లుగా నటించారు. రమేశ్ తమిళమణి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. మ్యూజిక్ డైరెక్టర్, కథ, స్క్రీన్ ప్లే కూడా అతడే అందించాడు. కాగా, ఎల్జీఎం చిత్రం మిశ్రమ స్పందన అందుకుంటోంది.