Krishna mukunda murari serial: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన కృష్ణ.. వైదేహి ద్వారా నిజం తెలుసుకున్న భవానీ
Krishna mukunda murari serial today june 7th episode: కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. ముకుంద చెర నుంచి మురారిని కాపాడి కృష్ణ హాస్పిటల్ లో చేరుస్తుంది. తను మీరా కాదు ముకుంద అనే విషయం తెలిసి మధు షాక్ అవుతాడు.
Krishna mukunda murari serial today june 7th episode: మురారి కృష్ణ గురించి ఆలోచిస్తూ బాధపడతాడు. అప్పుడే ముకుంద సంతోషంగా వస్తుంది. ఇన్నాళ్ళూ మనం ఒకటి కావడానికి ఏదైతే అడ్డం అనుకున్నామో అది తొలగిపోయింది. ఇప్పటి వరకు మీ అమ్మ పెద్దమ్మ నీ వల్ల నేను తల్లిని అయ్యాను అంటే నమ్మారు కదా ఇప్పుడు కృష్ణ కూడా నమ్మేసిందని చెప్తుంది.
కృష్ణ నమ్మేసింది
కృష్ణ నమ్మదు నీకేదో పిచ్చి ఎక్కి మాట్లాడుతున్నావని అంటాడు. నేను నిజాన్ని మానిప్యులేట్ చేస్తాను ఏమో కానీ అబద్ధం మాత్రం చెప్పను. కృష్ణలో ఇంత మార్పు వచ్చిందంటే నమ్మలేకపోయాను. ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఏం జరిగిందో తెలుసా అని మొత్తం చెప్తుంది.
నీ వల్లే నాకు బిడ్డ కలిగిందని అది చెప్పడం ఇష్టం లేక సరోగసి నాటకం ఆడమని చెప్పాను కదా ఇప్పుడు ఆ అవసరం లేదు కృష్ణ అదే నమ్మేసిందని చెప్తుంది. అది జరగదు కృష్ణ నిన్ను నమ్మదు నన్ను అనుమానించదని మురారి కాన్ఫిడెంట్ గా చెప్తాడు.
అదే జరిగింది కావాలంటే రేపు ఐ హేట్ ఏసీపీ సర్ అని కృష్ణ చెప్పే వాయిస్ రికార్డ్ తీసుకొస్తానని అంటే మురారి కోప్పడతాడు. నేను నీ వాడిని కాను నువ్వంటే ఇష్టం లేదని తెలిసినా ఎందుకు వదలకుండా పీడిస్తున్నావని అడుగుతాడు. ఎప్పటికైనా నీ మనసు మారుతుంది, నా ప్రేమ గెలుస్తుందని అంటుంది.
మురారిని కలుసుకున్న కృష్ణ
కృష్ణ, మధు ముకుందను ఫాలో అవుతూ ఇంటికి వస్తారు. అక్కడ మురారిని చూసి కృష్ణ సంతోషిస్తుంది. ముకుంద వైపు కోపంగా చూస్తుంది. ఏసీపీ సర్ అంటూ భర్త దగ్గరకు వెళ్తుంది. నువ్వు ఎందుకు వచ్చావ్ ఇక్కడికని ముకుంద అంటే కృష్ణ లాగిపెట్టి ఒకటి పీకి చంపేస్తానని అంటుంది.
ఏం చేశావే అని ముకుంద గొంతు పట్టుకుంటుంది. ఏం జరిగిందని కృష్ణని అడుగుతుంది. యాక్సిడెంట్ అయి రోడ్డు మీద పడి ఉంటే మీరా చూసి ఇక్కడికి తీసుకొచ్చిందని చెప్తాడు. మీరా కాదు ఏసీపీ సర్ ముకుంద అంటుంది. నీకెప్పుడు తెలిసిందని అంటే మీకంటే ముందే తెలుసు. మీకు చెప్తే బిడ్డను చంపేస్తానని బెదిరించేసరికి చెప్పలేదు.
నిజం తెలుసుకున్న మధు
ఇది మన బిడ్డను అడ్డం పెట్టుకుని చేసిన ఆరాచకాలు అన్నీ ఇన్ని కావు అంటుంది. మధు వచ్చి మీరాని ముకుంద అంటావ్ ఏంటి అంటాడు. ఇది మీరా కాదు ముకుంద అనేసరికి మధు ఆశ్చర్యపోతాడు. ఇది మామూలు షాక్ కాదు అసలు నువ్వు మామూలు ఆడదానివి కాదు అసలు నమ్మలేకపోతున్నాను.
మురారి కోసం దేన్ని అయినా అడ్డు పెట్టుకుంటానని ముకుంద అంటుంది. నువ్వు ఏసీపీ సర్ ని నిజంగా ప్రేమించి ఉంటే ఇన్ని దెబ్బలు తగిలిన మనిషిని ఇక్కడ పడుకోబెట్టవు. ఇక్కడ ఇలా పడేశావు అంటే నువ్వు ఎంత శాడిస్ట్ అనేది అర్థం అవుతుంది. నాకు నా మురారి దక్కడం ముఖ్యం. అది ఏ పరిస్థితిలోనైనా మురారి నా పక్కన ఉండటం నాకు ముఖ్యమని అంటుంది.
నిన్ను తగలబెట్టినా కూడా మురారి అని జపించడం మానుకోవా? ఇది బిడ్డను అడ్డం పెట్టుకుని బెదిరిస్తుంటే నువ్వు ఎలా భయపడ్డావ్ పెద్ద పెద్దమ్మకి ఒక మాట చెప్తే బిడ్డ మీద కాదు కదా దీని మీద దీనికే అధీనం లేకుండా చేసి ఉండేదని అంటాడు. వెంటనే పెద్దమ్మకు ఫోన్ చేస్తానని అంటే కృష్ణ వద్దని ఆపుతుంది.
మంచానికే పరిమితం అయ్యేవాడు
ఏసీపీ సర్ ని హాస్పిటల్ కి తీసుకెళ్దామని అంటే తాను ఒప్పుకోనని ముకుంద అడ్డం పడుతుంది. మధు ముకుందకు వార్నింగ్ ఇస్తాడు. కృష్ణ వాళ్ళు మురారిని హాస్పిటల్ కి తీసుకుని వస్తారు. డాక్టర్ వచ్చి అంత యాక్సిడెంట్ జరిగితే కట్టు కట్టి ఎలా ఉంచారని డాక్టర్ తిడుతుంది.
టైమ్ కి తీసుకొచ్చారు ఇంకో నాలుగు రోజులు ఇలాగే ఉంటే మంచానికే పరిమితం అయ్యేవారని డాక్టర్ అనేసరికి కృష్ణ షాక్ అవుతుంది. వెళ్ళి మురారిని కలుసుకుని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ట్యాబ్లెట్స్ చూసి ఫాలో అయ్యాము కాబట్టి సరిపోయింది లేదంటే ఎప్పటికీ తెలిసేది కాదని అంటుంది.
ఎప్పటికీ చెప్పేది కాదు నేను చెప్తే మన బిడ్డను చంపేస్తానని బెదిరించింది. మాట వినకపోతే నన్ను మంచానికే పరిమితం చేసి చూసుకుంటానని నిర్ణయానికి వచ్చిందని మురారి చెప్తాడు. తన కడుపులో మా బిడ్డ పెరుగుతుంది లేదంటే దాన్ని అక్కడే చంపేసేదాన్ని అని కృష్ణ ఆవేశంగా మాట్లాడుతుంది.
వైదేహిని కలిసిన భవానీ
తను నా వల్లే తల్లి అయ్యిందని ఇంట్లో అందరూ నమ్ముతున్నారు కదా అంటాడు. మీరు తప్పు చేయరని అందరికీ తెలుసు కానీ ముకుంద అబద్ధం చెప్పిందని తెలిసినా నమ్మడం లేదని చెప్తుంది. పెద్దమ్మకు అంతా నిజం చెప్పేయాలని మురారి అంటాడు. ఇంట్లో అందరికీ సమయం చూసి విషయం చెప్పి తీసుకొస్తానని అంటుంది.
పెద్ద పెద్దమ్మను డాక్టర్ వైదేహిని కలవమని చెప్పానని మధు కృష్ణతో చెప్తాడు. మీరానే ముకుంద అని చెప్పలేదు కదాని కృష్ణ కంగారుపడుతుంది. లేదు మీరాకి డాక్టర్ వైదేహి మంచి ఫ్రెండ్ అంట తనని వెళ్ళి కలవమని మాత్రమే చెప్పానని అంటాడు. ఇప్పుడు పెద్ద పెద్దమ్మ అక్కడికే వెళ్ళిందని చెప్తాడు.
భవానీ డాక్టర్ వైదేహి దగ్గరకు వస్తుంది. మళ్ళీ ఎందుకు వచ్చారని వైదేహి కంగారుగా అడుగుతుంది. మొన్న మీరా అనే అమ్మాయికి సరోగసి చేసి చేయలేదని చెప్పావ్. నిజం చెప్పు మీరా ఎవరో నీకు తెలియదా అని భవానీ నిలదీస్తుంది. తెలియదని వైదేహి బుకాయిస్తుంది.
కృష్ణ సంతోషంగా ఇంక టెన్షన్ ఎందుకు హ్యాపీగా ఉండమని చెప్తుంది. ఏమైంది ఇంత సంతోషంగా ఉన్నావని రేవతి అడుగుతుంది. చెప్తానని అనేసి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఏమైందని అందరూ కంగారుపడతారు. గుండె ఆగిపోయింది ఏమోనని ముకుంద సంబరపడుతుంది.
మధు పరిమళకు ఫోన్ చేసి కళ్ళు తిరిగి పడిపోయిందని ఇంటికి రమ్మని చెప్తాడు. భవానీ ఇంటికి వచ్చి ఏమైందని అడుగుతుంది. కృష్ణ కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్తుంది. అక్కడితో నేటి కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
తరువాయి భాగంలో..
పరిమళ వచ్చి కృష్ణని చెక్ చేస్తుంది. వారసులు కావాలని అడిగారు కదా కృష్ణ మీకు వారసులను ఇవ్వబోతుందని పరిమళ చెప్తుంది. కృష్ణ గర్భసంచి పోలేదా అని రేవతి అడుగుతుంది. ఇక ముకుంద చిన్నగా జారుకుంటుంటే భవానీ ఆపుతుంది. ఎవరు నువ్వు అని నిలదీస్తుంది. నేను మీరా అంటే భవానీ తన చెంప పగలగొడుతుంది.