Krishna mukunda murari serial: మీరా గురించి భవానీ ఎంక్వైరీ.. కృష్ణని చంపేస్తానంటూ మురారికి ముకుంద వార్నింగ్-krishna mukunda murari serial today june 4th episode murari argues with mukunda for threatening to harm krishna ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari Serial: మీరా గురించి భవానీ ఎంక్వైరీ.. కృష్ణని చంపేస్తానంటూ మురారికి ముకుంద వార్నింగ్

Krishna mukunda murari serial: మీరా గురించి భవానీ ఎంక్వైరీ.. కృష్ణని చంపేస్తానంటూ మురారికి ముకుంద వార్నింగ్

Gunti Soundarya HT Telugu
Jun 04, 2024 05:26 PM IST

Krishna mukunda murari serial today june 4th episode: భవానీ మీరా గురించి ఎంక్వైరీ మొదలు పెడుతుంది. అది ముకుంద చాటుగా చూస్తుంది. అటు మురారికి యాక్సిడెంట్ కావడంతో ముకుంద ఎవరికీ తెలియకుండా తన దగ్గర ఉంచుకుంటుంది.

కృష్ణ ముకుంద మురారి సీరియల్ జూన్ 4వ తేదీ ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి సీరియల్ జూన్ 4వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Krishna mukunda murari serial today june 4th episode: కృష్ణ తులసి కోటకు పూజ చేస్తుంది. ఈ ముకుంద ఎన్ని దారుణాలు చేస్తుందో చూస్తున్నావ్ కదా. నా భర్త మీద ఆశ చావక తను చచ్చినట్టు నటించి రూపం మార్చుకుని వచ్చింది. హాస్పిటల్ లో డాక్టర్ ని మాయ చేసి ఇంట్లో వాళ్ళని మాయ చేసి నా బిడ్డను తన బిడ్డ అంటుంది.

మీరా గురించి ఎంక్వైరీ

ముకుంద మెడలు వంచి అయినా నిజాలు కక్కిస్తాను. కానీ నాకు కావలసింది ఏసీపీ సర్ క్షేమంగా ఉండటమని కృష్ణ దేవుడిని వేడుకుంటుంది. భవానీ మీరా గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మురారి తలకు దెబ్బలతో ఒక చోట ఉంటాడు. భవానీ గతంలో మీరా ఉన్న ఇంటి దగ్గరకు వస్తుంది.

అదే ఇంట్లో మురారి ఉంటాడు. మీరా గురించి అక్కడ ఉంటున్న ఒకావిడను అడుగుతుంది. తను ఎక్కడ నుంచి వచ్చిందో తెలుసా అని భవానీ అడుగుతుంది. ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు కానీ ఇక్కడ అందరితో తను బాగా కలిసిపోయేదని మీరా చెప్పినట్టుగానే ఆవిడ అబద్ధం చెప్తుంది.

అనాథ ఆశ్రమం నుంచి వచ్చింది కదా అందరినీ తన వాళ్ళ మాదిరిగా చూసుకుందని చెప్తుంది. భవానీ అక్కడ ఉన్న టైమ్ లోనే ముకుంద కూడా వస్తుంది. మురారి ఏమైపోయాడని అందరూ అనుకుంటున్నారు. నిజంగానే నన్ను తల్లిని చేసి పారిపోయాడని అనుకుంటున్నారు.

మురారిని తీసుకుని వెళ్లిపోవాలి

కానీ యాక్సిడెంట్ అయి నా దగ్గరే ఉన్న విషయం ఎవరికీ తెలియదు. తను కోలుకున్న తర్వాత అందరికీ దూరంగా తీసుకుని వెళ్లిపోతానని ముకుంద అనుకుంటుంది. ఇక ఎప్పటికీ మురారి ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదని అనుకుంటూ ఉండగా భవానీ కారు కనిపిస్తుంది.

మురారి ఇక్కడే ఉన్నాడని తెలిసిపోయిందా ఏంటని టెన్షన్ పడుతుంది. చాటుగా భవానీని గమనిస్తుంది. మీరా కంగారుగా ఆవిడ దగ్గరకు వచ్చి భవానీ ఏం అడిగిందని ఆరా తీస్తుంది. నువ్వు చెప్పినట్టే చెప్పానని ఆవిడ చెప్తుంది. ఇంట్లో అందరూ మురారి తప్పు చేశాడని అంటున్నారు. అత్తయ్య వాళ్ళు కూడా అదే నమ్ముతున్నారని కృష్ణ బాధపడుతుంది.

సరోగసి చేసిన డాక్టర్ ఎస్ అని చెప్తే మీరా వేసిన నింద తొలగిపోయేదని మధు అంటాడు. మురారి ఉంటే మీరా ఇంట ధైర్యం చేసేది కాదు. సరిగా మీరా తల్లి అని తెలిసిన దగ్గర నుంచి మురారి కనిపించకపోవడంతో మొహం చూపించలేకపోవడం వల్లే వెళ్లిపోయాడని అనుకుంటున్నారని అంటాడు.

కృష్ణకు అనుమానం

అది బాగా తెగించింది మురారి ఉన్న ఇలాగే చెప్పేది. అందరూ ఏసీపీ సర్ తప్పు చేశారని అంటున్నారు ఆయన తప్పు చేస్తే ధైర్యంగా తప్పు ఒప్పుకుంటారు. ఆయనకు ఏమైందా అని భయంగా ఉందని టెన్షన్ పడుతుంది. అలా ఏం జరుగుతుంది మనకు తెలియకుండా ఏదో జరుగుతుందని అనుమానిస్తాడు.

ముకుంద విషయం తన తండ్రికి తెలిసే ఉంటుందని ఆయన్ని కలవడానికి కృష్ణ వెళ్తుంది. మీరా మురారి ఫ్రూట్స్ తినిపించబోతుంటే వద్దని మొహం తిప్పుతాడు. నువ్వు ఇలా ఉండకూడదు త్వరగా కోలుకుని నా చెయ్యి పట్టుకుని తిరగాలని బలవంతంగా తనకి తినిపిస్తే ఊసేస్తాడు.

ఇంకెంత కాలం నన్ను హింసిస్తావని మురారి అడుగుతాడు. రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగి పడి ఉంటే నేనే కాపాడి తీసుకొచ్చాను లేదంటే ప్రాణాలతో ఉండేవాడివా అంటుంది. నువ్వు నన్ను ఎప్పుడు అర్థం చేసుకున్నావ్. నన్ను నా ప్రేమని అర్థం చేసుకుని ఉంటే ఎప్పుడో కృష్ణని వదిలేసి నాకోసం వచ్చేవాడివి అనేసరికి మురారి ఆవేశంగా ముకుంద అంటాడు.

కృష్ణని చంపేస్తా

నీ పక్కన ఉండాల్సింది నేనా ఆ కృష్ణనా? ప్రేమించుకుంది మనం కలిసి బతకాలసింది మనం. ఒక సంవత్సరం అగ్రిమెంట్ అని చెప్పి తర్వాత వదిలేస్తానని నాకు మాట ఇచ్చి ఇప్పుడు నీ మనసు మొత్తం కృష్ణ ఉందని అంటే ఎలా ఊరుకుంటాను. నీ మనసుని చంపుకో లేదంటే ఆ కృష్ణని అంటుంటే మురారి అడ్డుపడతాడు.

కృష్ణని చంపుతానని నేను అనను, కానీ గత్యంతరం లేకపోతే అంతకు తెగిస్తానని నీకు తెలుసు. నీకోసం రూపాన్ని మార్చుకున్న దాన్ని కృష్ణని లేకుండా చేయలేనా? నువ్వే కృష్ణని మరచిపోవడం బెటర్ అంటుంది. అది కలలో కూడా జరగదని తేల్చి చెప్తాడు.

జరిగి తీరాలని అంటుంది. కారణం ఏదైనా నువ్వు ఆదర్శ్ ని, నేను కృష్ణని పెళ్లి చేసుకున్నాం. ఆ విధి ఇదే అని రాసి పెట్టి ఉంది అది నీకే అర్థం కావడం లేదని అంటాడు. నీకే అర్థం కావడం లేదు మనం కలిసి ఉండాలని అవకాశం ఇస్తుంది. కానీ నువ్వు అర్థం చేసుకోవడం లేదు.

నువ్వు దక్కాల్సినది నాకు

యాక్సిడెంట్ జరిగి కూడా నువ్వు నాకే కనిపించావు. ఎందుకంటే నువ్వు దక్కాల్సినది నాకు అంటుంది. విధి నిర్ణయించిందో లేదంటే నువ్వే యాక్సిడెంట్ చేయించావో ఎవరికి తెలుసు అని అనుమానిస్తాడు. నాకోసం నీ రూపాన్ని మార్చుకుని, మా బిడ్డని నీ కడుపులో పెంచుకుంటున్న దానివి ఇలా చేయవని గ్యారెంటీ ఏంటని నిలదీస్తాడు.

ఏదైనా జరిగితే నన్ను నేను ప్రమాదంలోకి నెట్టుకుంటాను కానీ నిన్ను ప్రమాదంలోకి ఎలా నెడతాను. నీ కోసం ఎలా మారిపోయానో చూడు. ఈ ప్రాసెస్ కోసం నా ప్రాణాలకు తెగించాను. నా ప్రాణం అంటూ పోతే అది నీతోనే. ఎందుకు నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు. నువ్వు నా ప్రాణం.

నాకు ఉన్న లాస్ట్ ఛాన్స్ ఇదే

నిజంగా నేను నీ ప్రాణం అయితే నన్ను ఇంతగా హింసించవు. నేను నీ ప్లేస్ లో ఉంటే నీ సంతోషం ముఖ్యమని ఎప్పుడో వదిలేసే దాన్ని అంటాడు. కానీ నేను మాత్రం ఎప్పటికీ వదలను. ప్రేమ కోసం దేన్ని అయినా వదులుకోవచ్చు కానీ ప్రేమను వదులుకోను.

ఇప్పటి వరకు చాలా ప్రేమగా చెప్పాను నువ్వు వినలేదు. నాకు ఉన్న లాస్ట్ ఛాన్స్ ఇదే. ఇక నుంచి నువ్వు కలిసి ఉండేది నాతోనే. కృష్ణని ఆ గతాన్ని మొత్తాన్ని మర్చిపోవాలి. ఒకవేళ నువ్వు నా దగ్గరే ఉన్నావని కృష్ణ వస్తే.. ముకుంద కడుపులో ఉంది మన బిడ్డ కాదు.

నా వల్లే ముకుంద గర్భవతి అయ్యింది తనతోనే కలిసి ఉంటానని నువ్వు చెప్పాలని అంటుంది. ఆ బిడ్డ మా బిడ్డ మా రక్తం నీ బిడ్డ ఎలా అవుతుందని అనుకుంటున్నావని అంటాడు. కేవలం కృష్ణని నమ్మించడం కోసం నీ బిడ్డని నేను అడ్డం పెట్టుకుంటున్నాను.

ఈ బిడ్డ మనదే అని చెప్పు

సరోగసి నిజంగానే జరిగింది కదా. కృష్ణకి కడుపు వచ్చింది అబద్ధం చెప్పావు కదా అలాగే ఇంకొక అబద్ధం చెప్పు. ముకుంద నా వల్లే తల్లి అయ్యింది అది నీకు చెప్తే తట్టుకోలేవని సరోగసి అని చిన్న నాటకం ఆడానని చెప్పు. కావాలంటే డాక్టర్ వైదేహితో చెప్పిస్తాను.

ఇలా చెప్తే కృష్ణ నిన్ను అసహ్యించుకుని వెళ్లిపోతుందని అంటుంది. నీ బొందలాగా ఉంది ఐడియా నేను కదల్లేక వదిలిపెడుతున్నా లేదంటే అని మురారి కోపంగా అంటాడు. నువ్వు నన్ను ఏం చేయలేవు ఎందుకంటే నీ బిడ్డ నా కడుపులో ఉంది కదా.

నేను చెప్పినట్టు వింటే అందరం సేఫ్ గా ఉంటాం. లేదంటే కృష్ణ కూడా ఉండదు. నా కడుపులో నీ బిడ్డ కూడా ఉండదని వార్నింగ్ ఇస్తుంది. భవానీ ఇంటికి వచ్చి మీరా గురించే ఆలోచిస్తూ ఉంటుంది. మీరా గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్ళినట్టు చెప్తుంది.

మీరా మంచిది అంటున్నారు

అక్కడ అందరూ మీరా గురించి మంచిగా చెప్పారు. తను తప్పులు చేస్తుందని ఎవరూ చెప్పలేదని అంటుంది. మీరా గురించి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఏముందని మధు అడుగుతాడు. కృష్ణని నమ్మకుండా తన గురించి ఎంక్వైరీ చేయడం కరెక్ట్ కాదని అంటాడు.

మీరా తల్లి అయ్యింది కారణం ఎవరు అంటే మురారి అంటుంది. వాడిని అడుగుదామని అంటే ఆ క్షణం నుంచి మురారి ఏమైపోయాడో తెలియడం లేదని భవానీ అంటుంది. అక్కడితో నేటి కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

 

టీ20 వరల్డ్ కప్ 2024