Karthika deepam september 4th episode: అసలైన వారసురాలిని వెతికి నిజం చెప్తానన్న దాసు- ఆస్తి, బావ కావాలన్న జ్యోత్స్న
Karthika deepam 2 serial today september 4th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దాసు చెప్పే ఒక్కొక్క నిజం విని పారిజాతం షాక్ అవుతుంది. అసలైన వారసురాలు ఎక్కడ ఉందో వెతికి పట్టుకుని తనకు నిజం చెప్తానని దాసు చెప్తాడు. ఇక నుంచి అదే పనిలో ఉంటానని అంటాడు.
Karthika deepam 2 serial today september 4th episode: సైదులు బిడ్డలను మార్చినప్పుడు నేను అక్కడే ఉన్నాను అంటూ జరిగింది మొత్తం పారిజాతానికి చెప్తాడు. దాసు చెప్తున్న ఒక్కొక్క నిజం విని పారిజాతం షాక్ అవుతుంది. ఇవన్నీ చేసింది నీకోసమే, నిన్ను ఈ ఇంటికి దూరం చేశాడనే పగతోనే ఇలా చేశానని అంటుంది.
అసలు వారసురాలు బతికే ఉంది
ఈ నిజాలు నాకు చెప్పకుండా జ్యోత్స్నకు ఎందుకు చెప్పావ్ అంటుంది. నా కూతురికి ఒక నిజం చెప్పాను కదా నీకు ఒక నిజం చెప్పాలి కదా. నువ్వు చంపమని ఇచ్చిన దశరథ అన్నయ్య కూతురిని చంపకుండా బస్టాండ్ లో వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పడంతో పారిజాతం షాక్ అవుతుంది.
బిడ్డ బతికే ఉంది ఒక మనసున్న మనిషి ఆ బిడ్డను తనతో పాటు తీసుకెళ్ళాడు అని చెప్తూ ఉండగా అటు దీపను చూపిస్తారు. ఓ అర్థరాత్రి బస్టాండ్ లో దొరికిన బిడ్డను తీసుకొచ్చి నువ్వు పెంచుకున్నావ్. ఈ నిజం ఎవరికీ చెప్పొద్దని నాదగ్గర మాట తీసుకున్నావని అనసూయ గతాన్ని గుర్తు చేసుకుంటుంది.
అతను తీసుకెళ్లిపోయిన బిడ్డ ఈ ఇంటి అసలైన వారసురాలు. ఈ ఆస్తి మొత్తానికి యువరాణిలా బతకాల్సిన మనిషి ఎక్కడ ఉందో అని దాసు అంటాడు. ఆ బిడ్డ ఎక్కడ ఉందో నీకు తెలుసా అంటే తెలుసుకుంటాను నిజం చెప్తాను అంటాడు. నిజం చెప్తే నీ కూతురు బతుకు ఏమవుతుందో తెలుసా అని ప్రశ్నిస్తుంది.
నా కూతురు ఇలా పెరగడం నచ్చలేదు
నా కూతురి బతుకు బాగుపడుతుందని అంటాడు. నువ్వు ఈ నిజాలు బయటపెడితే దశరథ, శివనారాయణ బతకనివ్వరని భయపడుతుంది. నిజానికి నేను ఇక్కడికి వచ్చింది నా కూతురిని చూసిపోవడానికి కానీ నువ్వు దాన్ని డబ్బున్న అహంకారిగా పెంచావు.
నన్ను కొట్టింది, నా కొడుకుని ఛీ కొట్టింది. మనుషులంటే లెక్క లేకుండా పెరిగింది. నా కూతురు ఇలా పెరగడం నాకు నచ్చలేదు. ఇప్పుడు నిజం తెలిసింది కాబట్టి మనిషిలా బతుకుతుంది. అసలైన వారసురాలు వస్తే అప్పుడు నా కూతురు కూడా కాశిలా పెరుగుతుందని అంటాడు.
ఒక మనిషి ఎలా ఉండాలో దీపను చూసి నేర్చుకోవచ్చు. నీకు ప్రాణాలు తియ్యడం వస్తే దీపకు ప్రాణాలు కాపాడటం తెలుసు. నా కూతురికి మనుషులను దూరం చేసుకోవడం తెలుసు. దీపకు మనుషులను దగ్గర చేసుకోవడం తెలుసు. ఈ ఇంటికి అసలైన వారసురాలు ఎక్కడున్న దీపలా మనిషిలా ఉండాలని కోరుకుంటాను.
వారసురాలిని వెతికి నిజం చెప్తాను
ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుని నిజం చెప్తాను అంటాడు. నిజం ఎవరికీ చెప్పొద్దని పారిజాతం బతిమలాడుతుంది. కాదు న్యాయంగా ఉండాలంటే నిజం ఆ ఒక్క మనిషికి చెప్పి ఆపేస్తాను. ఇక నుంచి దాసుకు ఒక్కటే పని ఈ ఇంటి మనిషి వారసురాలిని వెతకడం, వెతికి నిజం చెప్తానని వెళ్ళిపోతాడు.
దాసు అసలైన వారసురాలిని పట్టుకునే లోపు జ్యోత్స్న, కార్తీక్ పెళ్లి చేయాలి. ఇంకొకటి దీపను ఇంట్లో నుంచి పంపించాలని పారిజాతం అనుకుంటుంది. స్వప్న కార్తీక్ కి ఫోన్ చేసి మాట్లాడాలని అంటుంది. నేను ఈ ఇంటి వారసురాలిని కాదనే విషయం తట్టుకోలేకపోతున్నానని జ్యోత్స్న అంటుంది.
దాసు మా నాన్న, కాశీ నా సొంత తమ్ముడు. కానీ వాళ్ళ లాంటి జీవితం నాకు వద్దు నేను బతకలేను. చిన్నప్పటి నుంచి పేదరికంలో ఉంటే నేను దీపలా ఉండేదాన్ని ఏమో. కానీ లగ్జరీగా బతికి ఇప్పుడు దాసు కూతురినని తెలిసి గెంటేస్తే నా పరిస్థితి ఏంటని అంటుంది.
నేనే ఈ ఇంటి వారసురాలిని
అసలైన వారసురాలు ఇంటికి వస్తే ఏంటి పరిస్థితి? నాకు నిజం తెలిసినట్టే తనకు నిజం తెలిస్తే ఏంటి పరిస్థితి? అంటుంది. ఈ ఇంటికి అసలైన వారసురాలివి నువ్వే. మీ నాన్న విషయంలో మీ తాత చేసిన అన్యాయానికి కోపంగా సుమిత్ర కూతురి స్థానంలో నిన్ను పెట్టాను.
సుమిత్ర కూతురు చచ్చిపోయింది అనుకున్నా కానీ అది బతికింది. అయినా అది ఏమైందో ఎవరికీ తెలియదు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదని పారిజాతం సర్ది చెప్తుంది. నేనే ఈ ఇంటి వారసురాలిని, దాసు నాతండ్రి, కాశీ నా తమ్ముడు అనే విషయం ఎవరికీ తెలియడానికి వీల్లేదు.
నాకు ఈ ఆస్తి కావాలి, బావ కావాలి. భవిష్యత్ లో నిజం తెలిసినా నేను కార్తీక్ భార్యగా ఉంటే నాకు విలువైన స్థానం ఉంటుంది. ఏం జరిగిందో ఈ క్షణం ఇక్కడితో మర్చిపోదాం. నేను దశరథ, సుమిత్రల ఏకైక కూతురిని అంటుంది. నువ్వు అనుకున్నది జరుగుతుంది కానీ మీ నాన్న, కాశీకి సాయం చేయాలని పారిజాతం అడుగుతుంది.
ఎవడు తమ్ముడు, ఎవడు నాన్న
పెళ్లి జరిగిన తర్వాత ఈ అస్తి, కాంచన అస్తికి నువ్వే వారసురాలు అవుతావు. అప్పుడు నువ్వు వాళ్ళకి కొంత సాయం చేస్తే వాళ్ళ బతుకులు బాగుపడతాయి. ఎంతైనా వాళ్ళు నీ తొడబుట్టిన తమ్ముడు, నాన్న కదా అంటుంది. ఎవడు తమ్ముడు, ఎవడు నాన్న.
వాళ్ళకు నాకు ఏ సంబంధం లేదు. కానీ హెల్ప్ చేస్తాను నువ్వు నాకు ఈ లైఫ్ ఇచ్చావు. ఈ డీల్ మన మధ్య ఉండాలని జ్యోత్స్న అంటుంది. ఇల్లంతా చూస్తూ ఈ అస్తి నాది అని జ్యోత్స్న అనుకుంటుంది. సుమిత్ర వచ్చి ప్రేమగా మాట్లాడుతుంది. నేను నీ కూతురిని కాదని తెలిస్తే ఇంతే ప్రేమగా చూసుకుంటావా అని అనుకుంటుంది.
నాకు ఈ అస్తి, బావే కాదు అమ్మానాన్న కూడా మీరే కావాలని అంటుంది. ఇల్లు చూసుకుంటూ బయటకు వెళ్తుంది. ఏం జరిగినా సరే ఈ ఇంటికి వారసురాలిని నేనే అనుకుంటూ నడుస్తూ ఉండగా దీపను చూసుకోకుండా ఢీ కొడుతుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.