Karthika deepam august 29th episode: కాశీ చేతికి రాఖీ కట్టిన దీప, దాసు తల్లి పారిజాతమని తెలుసుకుని షాక్
Karthika deepam 2 serial today august 29th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కాశీకి జ్యోత్స్నతో రాఖీ కట్టించి వాళ్ళను ఇంటికి దగ్గర చేయాలని పారిజాతం స్కెచ్ వేస్తుంది. అందుకోసం శివనారాయణ దగ్గరకు వెళ్ళి ఒప్పిస్తుంది. దాసు పారిజాతం కొడుకని తెలుసుకుని దీప షాక్ అవుతుంది.
Karthika deepam 2 serial today august 29th episode: పారిజాతం కొడుకు దాసును కలిసి ఎమోషనల్ అవుతుంది. సరిదిద్దుకోలేని తప్పు చేశాను. నీ విషయంలో జరిగిన పొరపాటు నా మనవడి విషయంలో జరగకూడదు. రేపు రాఖీ పండుగ కదా కాశీని తీసుకుని ఇంటికి రా జ్యోత్స్నతో రాఖీ కట్టిస్తానని అంటుంది.
జ్యోత్స్నకు కాశీ తమ్ముడని చెప్తావా?
నన్నే రానివ్వలేదు ఇప్పుడు నా కొడుకుని రానిస్తారా? జ్యోత్స్నకు కాశీ తమ్ముడని చెప్తున్నావా? అసలు కడుతుందా? అని గట్టిగా అడుగుతాడు. నాకు ఎలాంటి అవమానం జరిగినా పరవాలేదు కానీ నా కొడుక్కి జరిగితే తట్టుకోలేనని అంటాడు. అన్నీ ఆలోచించే రమ్మని పిలుస్తున్నానని అంటుంది.
సరే తీసుకొస్తానులే నీకు నేను ఒక విషయం చెప్పాలి అని పారిజాతాన్ని సస్పెన్స్ లో పెట్టేసి వెళ్ళిపోతాడు. నేను బిడ్డల్ని మార్చిన విషయం తెలిసిందేమోనని టెన్షన్ పడిపోతుంది. అనసూయ కిచెన్ లో డబ్బులు దాచిన డబ్బా చూసి ఏంటని అడుగుతుంది. కార్తీక్ బాబుకు నేను ఇవ్వాల్సిన డబ్బు కొంచెం కొంచెం తీసి అందులో వేస్తానని చెప్తుంది.
నోరు జారిన అనసూయ
కుబేర ఫోటో చూసుకుంటూ నీ పెంపకం, నా పెంపకానికి ఎంత తేడా ఉందో అనుకుంటుంది. శౌర్య పరిగెత్తుకుంటూ వచ్చి ఎగురుతుంటే అనసూయ కంగారుగా తనను ఆపుతుంది. ఇలాంటి ఆటలు నువ్వు ఆడకూడదని అంటుంది. ఆడితే ఏమవుతుందని దీప అడిగితే అనసూయ కంగారుగా చెప్పబోయి ఆగిపోతుంది.
మంచం మీద ఎగిరితే కింద పడిపోతే దెబ్బలు తగులుతాయని మళ్ళీ కవర్ చేస్తుంది. నువ్వు నా మాట వినకపోతే కార్తీక్ తో చెప్తానని అనసూయ అనేసరికి శౌర్య వెంటనే ఆగిపోతుంది. రేపు మేము ఊరు వెళ్తున్నామని సుమిత్రమ్మ దగ్గర ఉండమని చెప్తుంది. అనసూయ శౌర్యతో ప్రేమగా మాట్లాడటం చూసి దీప మురిసిపోతుంది.
నువ్వు లేని లోటు తీర్చడం కోసం అత్తయ్యను పంపించావా అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. పారిజాతం శివనారాయణ దగ్గరకు వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతుంది. రేపు రాఖీ పండుగ నా మనవడికి నా మనవరాలితో రాఖీ కట్టించాలని అనుకుంటున్నానని చెప్తుంది.
కాశీ నా మనవడు
ఎవరు వాళ్ళు అంటే నా కొడుకు దాసు కొడుకు కాశీకి జ్యోత్స్నతో రాఖీ కట్టిస్తానని అంటుంది. శివనారాయణ ఫైర్ అవుతాడు. దాసునే ఈ ఇంటి గుమ్మం తొక్కడానికి వీల్లేదు అంటే మళ్ళీ వాడి కొడుకు ఏంటని తిడతాడు. రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగిన అబ్బాయి ఎవరో కాదు నా మనవడు.
యాక్సిడెంట్ సమయంలో అతడిని జ్యోత్స్న వదిలేసి వెళ్లిపోయిందని కార్తీక్ తనమీద కోపంగా ఉన్నాడు. అదే కాశీకి జ్యోత్స్న రాఖీ కడితే కార్తీక్ మనసు మారుతుంది. జ్యోత్స్న మీద ప్రేమ వస్తుందని డ్రామా మొదలుపెడుతుంది. నేను నా స్వార్థం కోసం చేయడం లేదు వాళ్ళిద్దరి మధ్య ఉన్న అభిప్రాయభేదాలు తొలగించడానికి చేస్తున్నానని అనేసరికి శివనారాయణ మెత్తబడతాడు.
వాళ్ళు రావడానికి ఒప్పుకోవడంతో పారిజాతం సంతోషంగా వెళ్ళిపోతుంది. ఇంటి గురించి మరొకసారి ఆలోచించమని దీప భయపడుతుంది. కానీ అనసూయ మాత్రం ధైర్యం చెప్తుంది. ఎవరైనా తప్పుగా మాట్లాడితే నాలుక తెగ్గొస్తానని అంటుంది. వాళ్ళు బయల్దేరుతుండగా దాసు, కాశీ వస్తారు.
కాశీకి రాఖీ కట్టిన దీప
దీప కాశీని ప్రేమగా పలకరిస్తుంది. దాసు వాళ్ళు తన కోసం వచ్చారని దీప అనుకుంటుంది. కానీ దాసు కాదని అంటారు. మీరు ఇక్కడ ఉన్నారు ఏంటని అంటే సుమిత్రమ్మ ప్రాణాలు కాపాడిందని అందుకే ఇక్కడ ఉంటున్నామని అనసూయ చెప్తుంది. పారిజాతం తన తల్లి అని దాసుతో చెప్పడంతో షాక్ అయిపోతుంది. జ్యోత్స్న తనకు అక్క అవుతుందని చెప్తాడు.
కార్తీక్ బాబుకు తెలుసా అంటే తెలియదని చెప్తాడు. ఈరోజు రాఖీ పండుగ కదా ముందు నీ చేత్తో రాఖీ కట్టమని కాశీ దీపను అడుగుతాడు. నీకు తమ్ముడు లేడు కదా దేవుడు ఇచ్చిన తమ్ముడు అని అనసూయ రాఖీ కట్టమని చెప్తుంది. దీప కాశీ చేతికి రాఖీ కడుతుంది.
కానుక ఇస్తుంటే దీప వద్దని వారిస్తుంది. స్వప్న, కాశీ ప్రేమ గురించి తలుచుకున్న దీప కార్తీక్ బాబు చాలా పెద్ద సమస్యలో పడ్డారని అనుకుంటుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.