Karthika deepam september 2nd: తల్లకిందులు కాబోతున్న జ్యోత్స్న, దీప జీవితాలు- 'నేనే నీ కన్న తండ్రిని' దాసు
Karthika deepam 2 serial episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. జ్యోత్స్న పుట్టుకకు సంబంధించి నిజాన్ని దాసు కూతురిని చెప్పేస్తాడు. పారిజాతం పుట్టిన వెంటనే బిడ్డలను మార్చిందని అంటాడు. నువ్వు పని మనిషి కూతురివి, నేనే నీ కన్న తండ్రినని చెప్తాడు. దీంతో జ్యోత్స్న షాక్ అవుతుంది.
Karthika deepam 2 serial today september 2nd episode: సుమిత్ర జ్యోత్స్న గురించి దాసు చెప్పిన మాటలు ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే పారిజాతం వెళ్తుంటే పిలిచి జ్యోత్స్న గురించి మాట్లాడాలని అంటుంది. నా గురించి ఏం మాట్లాడాలని జ్యోత్స్న కోపంగా అరుస్తుంది. దీపను ఇంటికి తీసుకొచ్చి తప్పు చేశానని అంటుంది.
జ్యోత్స్న మీద సుమిత్ర ఫైర్
అత్తయ్య మీరు చేసిన గారాబం మమ్మల్ని అందరిలో తలదించుకునేలా చేసిందని తిడుతుంది. ఏం జరిగిందని జ్యోత్స్న అడుగుతుంది. ఎప్పుడు నోరు తెరవని దాసు జ్యోత్స్నను ఇలా పెంచారు ఏంటని అడిగాడు. అణకువ లేదు డబ్బు ఉందనే అహంకారం తప్ప తనలో ఇంకేమీ లేదని అన్నాడు.
కానీ అతనికి తెలియదు కదా నువ్వు గ్రాని మాటలు విని ఇలా తయారయ్యావని సుమిత్ర ఆవేదనగా మాట్లాడుతుంది. నా గురించి చెప్పడానికి వాడు ఎవడు అని జ్యోత్స్న అంటే సుమిత్ర గట్టిగా నోర్ముయ్ అంటుంది. నువ్వు ఇలా మాట్లాడటానికి కారణం మీ గ్రాని. తప్పు చేసింది నేను మొదటే నిన్ను నా దారిలో పెట్టాల్సింది.
నీకు కొంచెం కూడా పద్ధతులు లేకుండా తయారు చేసింది. మీరు నా కూతురికి దూరంగా ఉండండి మంచి చెడు దానికి నేను నేర్పించుకుంటానని సుమిత్ర అత్తకు వార్నింగ్ ఇస్తుంది. జ్యోత్స్న ఆవేశంగా నీ కొడుకు ఎక్కడని పారిజాతాన్ని నిలదీస్తుంది. ఇంటికి వెళ్లాడని చెప్పడంతో జ్యోత్స్న ఆవేశంగా వెళ్ళి కారుతో దాసును ఢీ కొట్టబోయి ఆగిపోతుంది.
కష్టాలు ఇప్పుడే మొదలయ్యాయి
నేను ఎలా ఉండాలో మా మమ్మీతో చెప్పడానికి నువ్వు ఎవరని నిలదీస్తుంది. నువ్వు మా గ్రాని కొడుకు మాత్రమే. మా బావ కోసమే మిమ్మల్ని భరించాను. అయినా నేను ఎలా ఉంటే నీకేంటి అడగటానికి నువ్వు ఎవరు? నా పద్ధతి గురించి మాట్లాడటానికి నువ్వు ఎవరు? అని నిలదీస్తుంది.
అసలు నువ్వు ఎవరో నీకు తెలుసా అని దాసు రివర్స్ ప్రశ్నిస్తాడు. నేను ఎవరో నువ్వు ఎవరో చెప్తాను పద అని దాసు జ్యోత్స్నను తీసుకుని వెళతాడు. దీప, అనసూయ శౌర్య కోసం కొత్త సైకిల్ కొనుక్కుని సంతోషంగా ఇంటికి వెళ్తుంటారు. మనకు ఇక కష్టాలు అన్నీ తీరిపోయాయని అనుకుంటారు.
అప్పుడే ఒక సాధువు మీ కష్టాలు తీరలేదని అంటాడు. అసలు కష్టం ఇప్పుడే మొదలైంది అంటాడు. నీకు మా గురించి ఏం తెలుసని అంటున్నావని అనసూయ అడుగుతుంది. నీకు తెలిసింది నువ్వు చెప్తున్నావా అని సాధువు అంటాడు. సమయం ఆసన్నమైంది. పూరి గుడిసె నుంచి భవంతిలోకి బతుకు మారబోతుంది.
నా తల్లిదండ్రులు ఎవరు?
నీకు అందరూ ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ కష్టాలు తప్పవు అనేసి సాధువు వెళ్ళిపోతాడు. తన మీద దీపకు ఎక్కడ అనుమానం వస్తుందోనని అనసూయ అనుకుంటుంది. మీరు నా దగ్గర ఏం దాచారని దీప అత్తను అడుగుతుంది. ఆరోజు నువ్వు పోలీస్ స్టేషన్ లో కూడా నా తమ్ముడు పొరపాటు చేశాడు అన్నావ్.
నా తండ్రికి పిండం పెడుతుంటే ఒక సన్యాసి మీ తల్లిదండ్రులు బతికే ఉన్నారని అన్నాడు. పిండం నిజంగా కాకులు ముట్టలేదు. అంటే నా అర్థం మా అమ్మానాన్న వేరే ఎవరో కదా. నేను కుబేర కూతురిని అయితే వేరే వాళ్ళు నా తల్లిదండ్రులు ఎలా అవుతారు. నీకేదో నిజం తెలుసు అత్తయ్య అది నాతో చెప్పడం లేదని దీప అడుగుతుంది.
కుబేర దీపను తీసుకొచ్చిన విషయం అనసూయ గుర్తు చేసుకుంటుంది. నా తమ్ముడికి మాట ఇచ్చాను ప్రాణం పోయినా నిజం చెప్పనని అనసూయ అనుకుంటుంది. నువ్వు నా కుబేర కూతురివి, నీ తల్లి అంబుజవల్లి అని గట్టిగా చెప్తుంది. దాసు జ్యోత్స్నను హాస్పిటల్ కు తీసుకుని వస్తాడు.
మన కథ మొదలైంది ఇక్కడే
కథ మొదలైంది ఇక్కడేనని అంటాడు. గతంలో బిడ్డలు మార్చిన సంఘటన మొత్తం దాసు గుర్తు చేసుకుంటాడు. ఇద్దరు బిడ్డలు ఇద్దరు తల్లులకు దూరం అయ్యారు. నేను నీకు ఒక కథ చెప్తాను విను అంటాడు. నేను చెప్పేది ఇద్దరి జీవితాలు తల్లకిందులు చేసిన కథ. ఇద్దరి ప్రాణాలు తీసింది.
కొన్నేళ్ళ కిందట వర్షం పడుతున్న రాత్రి ఇద్దరు ఆడవాళ్ళకు ప్రసవం అయ్యింది. ఒకరు యజమాని, ఒకరు పని మనిషి. వారికి ఆడపిల్లలు పుట్టారు. అదే సమయంలో ఒక మనిషికి దుర్భుద్ధి పుట్టింది. దాన్ని నిజం చేయడం కోసం పని మనిషి కూతురు యజమాని దగ్గరకు చేరింది.
యజమాని కూతురి ప్రాణం తీయాలని అనుకున్నారు. ఏం జరిగిందో తెలియని యజమాని కూతురు పని మనిషి కూతురు తనదే అనుకుంటున్నారు. ఈ కథ నాకు ఎందుకు చెప్తున్నావని జ్యోత్స్న అంటుంది. ఈ కథ మనది ఈ కథలో నువ్వూ ఉన్నావు. అసలు ఇదంతా జరిగింది నీ గురించే అంటాడు.
పని మనిషి కల్యాణి ఎవరో కాదు నా భార్య. నేనే నీ కన్నతండ్రిని అనేసరికి జ్యోత్స్న అబద్ధం చెప్తున్నావ్. నువ్వు నా తండ్రి ఏంటి ఛీ అంటుంది. నిన్ను మార్చింది ఎవరో కాదు మా అమ్మ పారిజాతం అని చెప్పేస్తాడు. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్