Karthika deepam august 31st episode: స్వప్నకు షాకిచ్చిన పెళ్లికొడుకు, సమస్యల సుడిగుండంలో కార్తీక్- జ్యోత్స్న వాయింపు
Karthika deepam august 31st: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కాశీతో ప్రేమ విషయం ఇంట్లో తెలిసిపోయింది పెళ్లి ఫిక్స్ చేశారని స్వప్న ఫోన్ చేసి కార్తీక్ తో చెప్తుంది. కాశీతో పెళ్లి జరగకపోతే చచ్చిపోతానని అంటుంది. సమస్యలన్నీ తనకే చుట్టుకున్నాయని కార్తీక్ తల పట్టుకుని కూర్చుంటాడు.
Karthika deepam 2 serial today august 31st episode: శ్రీధర్ స్వప్నకు సడెన్ గా పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాడు. అబ్బాయి పేరు శ్రీకాంత్ నా ఆఫీసులో పని చేస్తున్నాడు. మీ ఇద్దరికీ త్వరలోనే పెళ్లి. తను చాలా మంచివాడు. ఇల్లరికం కూడా వస్తాడు. ఇప్పుడు ఉన్నట్టే పెళ్ళైన తర్వాత కూడా మనం కలిసి మెలిసి ఉండవచ్చు అని అంటాడు.
స్వప్నకు షాకిచ్చిన పెళ్లికొడుకు
డాడీకి కాశీ గురించి తెలిసిపోయిందని స్వప్న అనుకుంటుంది. స్వప్న పెళ్లి కొడుకుతో పర్సనల్ గా మాట్లాడాలని చెప్తుంది. నేను ఒకతన్ని ప్రేమించాను, అతడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని కాశీ ఫోటో చూపిస్తుంది.
నువ్వు కాశీని ప్రేమించావు ఆ విషయం మీ నాన్న చెప్పారు అయినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని శ్రీకాంత్ షాక్ ఇస్తాడు. దీంతో స్వప్న టెన్షన్ పడుతుంది.
కార్తీక్ స్వప్న, కాశీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. శౌర్య వచ్చి కార్తీక్ తో సరదాగా మాట్లాడుతుంటే కాశీ వస్తాడు. నిన్ను ఏమని పిలవాలని అడిగితే మావయ్య అని పిలవమని చెప్తాడు. కాశీ మావయ్య బాగుంది అందరికీ చెప్తానని సరదాగా వెళ్ళిపోతుంది. కార్తీక్ ని కాశీ బావ అని పిలుస్తూ మాట్లాడతాడు.
జ్యోత్స్నకు అహంకారం
మీ పెళ్లి పనులు నేనే దగ్గరుండి చూసుకుంటాను ఇలాగైన మీ రుణం తీర్చుకుంటానని అంటాడు. కార్తీక్ మంచితనాన్ని తెగ పొగుడుతాడు. దాసు కూతురి ప్రవర్తన, దీప గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దీపలో ఉన్న సంస్కారం, మంచితనం నా కూతురిలో కనిపించడం లేదని అనుకుంటాడు.
దాసు దగ్గరకు సుమిత్ర వస్తుంది. మీలో ఉన్న మంచితనం మీ పెంపకంలో లేడు వదిన. ఇన్ని కోట్ల ఆస్తికి నువ్వు ఏకైక కోడలివి. నాలాంటి పేదవాడివి నన్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ నా కోసం నువ్వు కాఫీ కూడా తీసుకొచ్చావ్ కానీ నీ వినయం నీ పెంపకంలో లేదు.
జ్యోత్స్నకు డబ్బు ఉందన్న అహంకారం ఎక్కువగా ఉంది. రేపు పెళ్లి అయిన తర్వాత పుట్టింట్లో ఉన్నట్టే అత్తగారి ఇంట్లో ఉంటానంటే కుదరదు కదా. అత్తింట్లో ఏం జరిగినా చెడ్డ పేరు మీకే కదా. ఆడపిల్ల ఏం చేసిన తల్లినే అంటారని అంటాడు. వాళ్ళ మాటలు అటుగా వెళ్తున్న పారిజాతం వింటుంది.
శౌర్యకు దొరికిపోయిన పారు
నోరు అదుపులో పెట్టుకుని చావొచ్చు కదాని పారిజాతం కొడుకుని తిట్టుకుంటుంది. ఎవరూ వినలేదని అనుకుంటుండగా ఎదురుగా శౌర్య ఉంటుంది. ఎవరైనా మాట్లాడుకుంటుంటే చాటుగా వినడం తప్పు కదా నువ్వు తప్పు చేశావ్ నేను ముద్దుల తాతకు చెప్తానని అంటుంది.
ఎవరికీ చెప్పకు అని పారిజాతం శౌర్యను బతిమలాడుతుంటే శివనారాయణ వస్తాడు. శౌర్యను విషయం ఏమిటని అడుగుతాడు. అమ్మమ్మ గడ్డం తాతతో మాట్లాడుతుంటే జో గ్రాని చాటుగా వింటుందని చెప్పేస్తుంది. రాఖీ పండుగ అయిపోయింది కదా ఇక ఎవరూ నా కంటికి కనిపించడానికి వీల్లేదని పంపించేయమని చెప్తాడు.
ఉన్నట్టుండి ఇంత పెద్ద సమస్య వచ్చింది. ఎటు నుంచి నిజం తెలిసినా నష్టం నాకే అనుకుంటుండగా కార్తీక్ కి స్వప్న ఫోన్ చేస్తుంది. ఇంట్లో మా ప్రేమ సంగతి తెలిసిపోయింది. మా డాడీ వాళ్ళ ఆఫీసులో పని చేసే అబ్బాయిని తీసుకొచ్చి ముహూర్తాలు కూడా పెట్టించాడు.
చచ్చిపోతానన్న స్వప్న
కాశీకి నాకు పెళ్లి జరగకపోతే చచ్చిపోతాను అన్నయ్య అని స్వప్న ఏడుస్తుంది. నాతో చెప్పావ్ కదా తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దని అంటాడు. నువ్వు మా ఇద్దరికీ పెళ్లి చేస్తానని మాట ఇస్తే అప్పుడు సైలెంట్ గా ఉంటానని అంటుంది. నన్ను అన్నయ్య పిలిచావ్ కదా నీ ప్రాణం నువ్వు కాపాడుకో మీ ప్రేమ నేను కాపాడతానని అంటాడు.
సమస్యలన్నీ వచ్చి తలకు చుట్టుకున్నాయని కార్తీక్ తల పట్టుకుని కూర్చుంటాడు. అప్పుడే జ్యోత్స్న వచ్చి మైండ్ తినడం మొదలుపెడుతుంది. కాసేపు తనని ఒంటరిగా వదిలేయమని చెప్తాడు. జ్యోత్స్న వెళ్లకపోయే సరికి కార్తీక్ వెళ్తుంటే నా ప్లేస్ లో దీప ఉంటే అలాగే వెళ్లిపోతావా అంటుంది.
ముందు ఆలోచనా విధానం మార్చుకోమని అంటాడు. తనతో రెండు నిమిషాలు మాట్లాడమని జ్యోత్స్న అడిగితే ఇప్పుడు ఎవరితో మాట్లాడలేనని అంటాడు. అప్పుడే దీప ఫోన్ చేయడంతో మాట్లాడటం చూసి జ్యోత్స్న రగిలిపోతుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.