Karthika deepam august 30th episode: రాఖీ కట్టే దగ్గర గొడవ చేసిన జ్యోత్స్న- స్వప్నకు పెళ్లి ఫిక్స్ చేసిన శ్రీధర్-karthika deepam 2 serial today august 30th episode sridhar finds a groom for her daughter swapna ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam August 30th Episode: రాఖీ కట్టే దగ్గర గొడవ చేసిన జ్యోత్స్న- స్వప్నకు పెళ్లి ఫిక్స్ చేసిన శ్రీధర్

Karthika deepam august 30th episode: రాఖీ కట్టే దగ్గర గొడవ చేసిన జ్యోత్స్న- స్వప్నకు పెళ్లి ఫిక్స్ చేసిన శ్రీధర్

Gunti Soundarya HT Telugu
Aug 30, 2024 06:58 AM IST

Karthika deepam 2 serial today august 30th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కాశీ దీపతో ముందుగా రాఖీ కట్టించుకున్నాడని తెలిసి జ్యోత్స్న గొడవ చేస్తుంది. ఆ రాఖీ తీసేయమని వాదిస్తుంది. కానీ కార్తీక్ అక్కడే ఉండటంతో చేసేదేమి లేక అయిష్టంగానే రాఖీ కడుతుంది.

కార్తీకదీపం 2 సీరియల్ ఆగస్ట్ 30వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ ఆగస్ట్ 30వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar )

Karthika deepam 2 serial today august 30th episode: పారిజాతం ఇంట్లో తెగ హడావుడి చేస్తుంది. అప్పుడే దాసు, కాశీ ఇంటికి వస్తారు. కాశీకి ఇంట్లో అందరినీ పరిచయం చేస్తుంది. జ్యోత్స్నను చూపించి అక్క అని దాసు చెప్తాడు. కార్తీక్, కాంచన కూడా వస్తారు. శ్రీధర్ రాలేదని సుమిత్ర అలుగుతుంది. కార్తీక్ దాసును చూసి మీరేంటి ఇక్కడికి వచ్చారని అడుగుతాడు.

నిజం తెలుసుకున్న కార్తీక్

కాంచన దాసు పారిజాతం పిన్ని కొడుకు అని చెప్తుంది. కాశీ తన మనవడని పారిజాతం చెప్పడంతో స్వప్న ప్రేమను కార్తీక్ గుర్తు చేసుకుని షాక్ లో ఉండిపోతాడు. నువ్వు హాస్పిటల్ కి వచ్చినప్పుడు కాశీ దాసు మావయ్య కొడుకు అని ఎందుకు చెప్పలేదని కార్తీక్ అడుగుతాడు.

అప్పటి పరిస్థితిలో నువ్వు జ్యోత్స్న మీద కోపంగా ఉన్నావని కవర్ చేస్తుంది. ఇప్పుడు స్వప్నతో కాశీ పెళ్లి ఎలా జరుగుతుంది. పెళ్లి చేయాలంటే స్వప్న తండ్రి ఎవరో అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు నాన్న గురించి అమ్మకు తెలిస్తే ఏంటి పరిస్థితని కార్తీక్ టెన్షన్ పడతాడు.

దీప కట్టిన రాఖీ తీసేయ్

శివనారాయణ వస్తే కాశీని ఆశీర్వాదం తీసుకోమంటాడు. కానీ వద్దు రాఖీ ఏదో కట్టించుకుని వెళ్ళమని సీరియస్ గా చెప్తాడు. జ్యోత్స్న కాశీకి రాఖీ కట్టేందుకు బొట్టు పెడుతుంది. నేను చేసిన తప్పును నా చేతులతోనే సరిదిద్దుకుంటున్నానని డైలాగ్ కొడుతుంది. ఇక అపార్థాలు అన్నీ తొలగిపోయినట్టేనని కాంచన అంటుంది.

జ్యోత్స్న రాఖీ కట్టే ముందు చేతికి రాఖీ ఉండటం చూసి ఎవరు కట్టారని అడుగుతుంది. దీపక్క కట్టిందని చెప్పేసరికి జ్యోత్స్న సీన్ క్రియేట్ చేస్తుంది. నేను ఈరోజు బతికి ఉన్నాను అంటే అది దీపక్క వల్లే కదా అంటాడు. ముందు దీప కట్టిన రాఖీ తీసేయమని అడుగుతుంది.

నీకు రాఖీ కట్టడమే ఎక్కువ

అలా తీయకూడదు అనేసరికి జ్యోత్స్న కార్తీక్ ముందు మంచిదాన్ని అనిపించుకోవడం కోసం మనసు చంపుకుని రాఖీ కడుతుంది. పారిజాతం సంతోషిస్తుంది. తర్వాత కాంచన తన అన్న దశరథకు ప్రేమగా రాఖీ కడుతుంది. రాఖీ కడితే ఏదైనా ఇవ్వాలి కదక్క నా దగ్గర ఈ ఐదొందలు ఉన్నాయి తీసుకోమని కాశీ ఇవ్వబోతాడు.

నీకు నేను రాఖీ కట్టడమే చాలా ఎక్కువ, నీ స్థాయి వేరు నా స్థాయి వేరు. నాకు గిఫ్ట్ ఇచ్చే రేంజ్ నీది కాదని అవమానకరంగా మాట్లాడుతుంది. కాంచన దాసును కూడా రాఖీ కడుతుంది. మీరంతా మంచి వాళ్ళు కానీ నా కూతురే ఏ మంచితనం లేకుండా పెరిగిందని దాసు బాధపడతాడు.

దీప కూడా కాశీ, స్వప్న గురించి ఆలోచిస్తుంది. అనసూయ ఇంటి కాగితాలు తీసుకొచ్చి దీప చేతిలో పెడుతుంది. వాటితో పాటు కొంత డబ్బు కూడా ఇస్తుంది. అప్పులు తీరుస్తానని నీ దగ్గర తీసుకున్న డబ్బులు ఇవి అని చెప్తుంది. ఇన్నాళ్ళూ గడ్డి తిన్నాను ఇప్పుడు అన్నం తింటున్నాను.

నోరుజారిన అనసూయ

ఏ సంబంధం లేనివాడు కార్తీక్ బాబు నా కొడుకు చేసిన అప్పులన్నీ తీర్చాడు. నువ్వు కష్టపడిన డబ్బులు నీ దగ్గరే ఉండాలని వాటిని చేతికి ఇస్తుంది. ఇక నువ్వు నీ కూతురు గురించి ఆలోచించు అసలే దాని ఆరోగ్యం కూడా సరిగా లేదని అనసూయ నోరు జారుతుంది.

నా కూతురి గురించి ఏదైనా నిజం దాస్తున్నావా అని దీప అత్తను నిలదీస్తుంది. అదేమీ లేదు ఈ ఆస్తిని నీ దగ్గర పెట్టుకో. నీకు కూతురు ఉంది, అవసరం వచ్చినప్పుడు ఆదుకోవడానికి ఈ ఆస్తి కాపాడుతుంది. మనలాంటి కష్టాలు శౌర్య పడకూడదని అంటుంది. అత్త మాటలకు దీప చాలా సంతోషిస్తుంది.

స్వప్నకు పెళ్లి చూపులు

నేను ఇప్పటి వరకు ఇద్దరు మంచి వాళ్ళను చూశాను. ఒకరు మీ నాన్న, రెండో వాళ్ళు కార్తీక్ బాబు అంటుంది. సొంత మనిషి కాకపోయినా చాలా సాయం చేస్తున్నాడని కార్తీక్ ని మెచ్చుకుంటుంది. ఫంక్షన్ ఉందని అబద్ధం చెప్పి స్వప్నను కావేరీ అందంగా రెడీ చేస్తుంది. శ్రీధర్ అబ్బాయిని తీసుకుని ఇంటికి వస్తాడు.

శ్రీధర్ స్వప్నకు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాడు. అబ్బాయిని పరిచయం చేసి ఇతనే నీకు కాబోయే భర్త అనేసరికి షాక్ అవుతుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.