Karthika deepam october 22nd episode: దీప నా భార్య ఏమైనా అంటే ఊరుకునేది లేదంటూ అందరికీ గట్టి వార్నింగ్ ఇచ్చిన కార్తీక్
Karthika deepam 2 serial today october 22nd episode: కార్తీకదీపం 2 సీరియల్ అక్టోబర్ 22వ తేదీ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. తన తప్పు లేదని చెప్పుకునేందుకు దీప సుమిత్ర ఇంటికి వస్తుంది. కానీ అందరూ తనను తలా ఒక మాట అంటారు. జ్యోత్స్న దీపను ఇంట్లో నుంచి గెంటేస్తుంది.
Karthika deepam 2 serial today october 22nd episode: దీప సుమిత్ర ఇంటికి వస్తుంది. దీప వస్తే ఏం అడగవు ఏంటి అని జ్యోత్స్న తల్లిని నిలదీస్తుంది. దీప మంచిది అని నెత్తి మీద పెట్టుకున్నారు కదా ఇప్పుడు ఒకటే దెబ్బ కొట్టిందని జ్యోత్స్న ఆవేశంతో ఊగిపోతుంది. మీరు ఇలా అపార్థం చేసుకుంటారనే జరిగింది చెప్పడానికి వచ్చానని దీప అంటుంది.
గెంటేసిన జ్యోత్స్న
ఇంక ఏం చెప్తావ్ పరువే ప్రాణంగా బతికే శివనారాయణ ఇంటి గౌరవాన్ని దిగజార్చావుని పెద్దాయన సీరియస్ అవుతాడు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే రకం తాను కాదని దీప చెప్పేందుకు చూస్తుంది. కానీ దశరథ కూడా వినిపించుకోడు. మనసులో ఇంత దురుద్దేశం పెట్టుకుని ఇన్నాళ్ళూ మా మధ్య తిరిగావు నిన్ను నమ్మినందుకు సిగ్గు పడుతున్నామని దశరథ తిడతాడు.
ఈ తాళి నా మెడలోకి నా ప్రమేయం లేకుండానే వచ్చిందని దీప చెప్పినా ఎవరూ వినిపంచుకోరు. సుమిత్ర దీప మొహం చూసి అసహ్యించుకుంటుంది. పారిజాతం దీపను ఇష్టం వచ్చినట్టు తిడుతుంది. జ్యోత్స్న దీపను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది. దీప పడిపోబోతుంటే కార్తీక్ వచ్చి పట్టుకుంటాడు.
శౌర్య మీద ప్రేమతో కట్టా
అల్లుడు తప్పు చేశాడని కన్న కూతురిని, మనవడిని దూరం చేసుకున్న కుటుంబం ఇది. నువ్వు వచ్చి జరిగింది చెప్తే నమ్ముతారని అనుకుంటున్నావా అని అంటాడు. నోర్ముయ్ అని శివనారాయణ తిడతాడు. నువ్వు మీ నాన్న దేశాన్ని ఉద్దరించారా? సన్మానం చేయడానికని అంటాడు.
నేను ఎవరికీ అన్యాయం చేయలేదు. మీరే వద్దని అనుకున్నారు. తాత మిమ్మల్ని వద్దని అనుకున్నారని ప్రతీకారంతో దీప మెడలో తాళి కట్టావా అని జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. ప్రతీకారం కాదని అంటాడు. మరి ఎందుకు కట్టావ్ ప్రేమతోనా అని అడుగుతుంది. అవును శౌర్య మీద ఉన్న ప్రేమతో తనకు తండ్రి కావాలని దీప మెడలో తాళి కట్టాను అంటాడు.
జ్యోత్స్న మీదకు చెయ్యెత్తిన కార్తీక్
అలా అయితే ఈ ఊర్లో తండ్రి లేని పిల్లలు చాలా మంది ఉన్నారు వెళ్ళి వాళ్ళందరి అమ్మల మెడలో తాళి కట్టు అని జ్యోత్స్న అనేసరికి కార్తీక్ కోపంగా తన మీదకు చెయ్యి ఎత్తుతాడు. దీప మెడలో తాళి కట్టే ముందు నా కూతురు గుర్తు రాలేదా అని దశరథ నిలదీస్తాడు.
సంబంధం వద్దని చెప్పడానికి మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మీకు కూతురు గుర్తుకు రాలేదా అని ఎదురు ప్రశ్నిస్తాడు. మీ నాన్న తప్పు చేశాడని అంటే అందుకే మా అమ్మ కూడా మా నాన్నని వద్దని అనుకుంది. ఆవిడను అర్థం చేసుకోవాలి కదా అంటాడు.
పగ తీర్చుకున్నారు
అర్థం చేసుకున్నాం కాబట్టే మీ నాన్న తప్పును పక్కన బెట్టి మీతో సంబంధం కలుపుకోవాలని అనుకున్నాను. ఆ విషయం చెప్పడానికి నేను మీ ఇంటికి వచ్చాను కానీ దీప నాకు అవకాశం లేకుండా చేసింది. నువ్వు దీని మెడలో తాళి కట్టావని జ్యోత్స్న అంటుంది.
శివనారాయణ కార్తీక్, కాంచనను అపార్థం చేసుకుని మాట్లాడతాడు. మీరు నా మీద పగ తీర్చుకున్నారని అంటాడు. మీరే వద్దని అనుకున్నారు. మళ్ళీ మీరే కావాలని అనుకున్నారు ఆ విషయం మీరు చెప్పకుండానే మేం అర్థం చేసుకోవాలా? అని ఎదురు ప్రశ్నిస్తాడు.
మరదలు గుర్తు రాలేదా?
చెప్పే అవకాశం నువ్వు నాకు ఇవ్వలేదని జ్యోత్స్న అంటుంది. నువ్వు చెప్పినా నేను దీప మెడలో తాళి కట్టే వాడిని. వద్దనుకోవడం కావాలని అనుకోవడం అంతా మీ ఇష్టమేనా అంటూ కడిగిపారేస్తాడు. నీ ఇష్టానికి నువ్వు నిర్ణయం తీసుకునే ముందు నీ కోసమే బతికే ఈ మరదలు గుర్తుకు రాలేదా?
మేనల్లుడు అల్లుడు కావాలని ఆశపడిన మా అమ్మ గుర్తుకు రాలేదా అని జ్యోత్స్న అడుగుతుంది. రాలేదు నువ్వు అన్నవి ఏవి నాకు గుర్తు రాలేదు. భర్తను దూరం చేసుకున్న నా తల్లి దగ్గరకు పరువు పోయిన కుటుంబానికి నా కూతురిని పంపించలేను అన్నాడు మావయ్య.
దీపకు న్యాయం చేశాను
నా తల్లి గురించి మీరు ఆలోచించారా అని నిలదీస్తాడు. అలాగని జ్యోత్స్నకు అన్యాయం చేస్తావా అని సుమిత్ర అడుగుతుంది. దీపకు న్యాయం చేశాను. తండ్రి కోసం అల్లాడిపోతున్న శౌర్యకు తండ్రిని అవాలని అనుకున్నాను. అందుకే దీప మెడలో తాళి కట్టానని చెప్తాడు.
దీప నువ్వు ఏ తప్పు చేయలేదు ఎవరిని క్షమించమని అడగాల్సిన అవసరం లేదు. ఈ మనుషులకు శిక్షించడం తప్ప క్షమించడం రాదు. మన ఇంటికి వెళ్దాం పద అంటాడు. నేను ఎక్కడికి రాను నన్ను వదిలేయమని దీప అంటుంది. ఇదంతా నీకు ఇష్టం లేనట్టు ఎంత బాగా నటిస్తున్నావని పారిజాతం వెటకారంగా మాట్లాడుతుంది.
దీప ణ భార్య
పారు మాట జాగ్రత్త ఇప్పుడు దీప నా భార్య ఎవరైనా ఏమైనా అంటే నన్ను అనండి అని వార్నింగ్ ఇస్తాడు. ఇంటి దగ్గర శౌర్య నీకోసం ఏడుస్తుందని దీప చేతిని పట్టుకుని కార్తీక్ వెళ్ళిపోతాడు. పారిజాతం శ్రీధర్ ఇంటికి వస్తుంది. కార్తీక్ దీప మెడలో తాళి కట్టాడని చెప్పడంతో శ్రీధర్ షాక్ అవుతాడు.
దీప మెడలో తాళి కట్టి నా మనవరాలి గొంతు కోశాడు నీ కొడుకు అని పారిజాతం చెప్తుంది. కాంచన ఏం చేస్తుందని అంటే దీప, కార్తీక్ కి దగ్గరుండి పెళ్లి చేసిందని చెప్తుంది. నువ్వు రెండో పెళ్లి చేసుకోవడం వల్లే మా కుటుంబానికి ఈ తిప్పలు వచ్చాయని పారిజాతం కావేరిని తిడుతుంది.
బయటకు పో అత్తయ్య
నన్ను ఏమైనా అంటే తన్నులు తింటారని కావేరి వార్నింగ్ ఇస్తుంది. కావేరిని ఏమి అనొద్దని శ్రీధర్ కూడా అంటాడు. పారిజాతం మీ వల్లే ఇదంతా జరిగిందని పారిజాతం అనేసరికి ముందు బయటకు పొమ్మని శ్రీధర్ తిడతాడు. మళ్ళీ ఎప్పుడు మా ఇంటి వైపు రావొద్దని శ్రీధర్ పారు మొహాన తలుపు వేస్తాడు.
నా మనవరాలికి జరిగిన అన్యాయానికి మీ అందరికీ బుద్ధి వచ్చేలా చేస్తానని పారిజాతం రగిలిపోతుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్