Karthika deepam october 5th episode: శౌర్య కిడ్నాప్ కు నరసింహ ప్రయత్నం- శ్రీధర్ ఫ్రస్టేషన్, కావేరి చురకలు
Karthika deepam 2 serial today october 5th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. శౌర్యను కిడ్నాప్ చేయాలని నరసింహ దీప ఇంటి దగ్గరకు వస్తాడు. బొమ్మ ఆశ చూపించి ఇంట్లో ఆడుకుంటున్న శౌర్యను బయటకు రప్పిస్తాడు. కానీ సరిగా అదే టైమ్ కి కార్తీక్, దీప రావడంతో ప్లాన్ ఫెయిల్ అవుతుంది.
Karthika deepam 2 serial today october 5th episode: శ్రీధర్, కావేరి కోపంగా వెళ్లిపోతుంటే ఆశీర్వాదం తీసుకోమని స్వప్నకు దీప చెప్తుంది. దీంతో స్వప్న తల్లి దగ్గరకు వెళ్ళి అక్షింతలు వేయమని అడుగుతుంది. కానీ శ్రీధర్ కోపంగా వస్తున్నావా లేదా అనేసరికి కావేరి మౌనంగా వెళ్ళిపోతుంది.
పారు షాక్
అందరితో కాశీ సంతోషంగా సెల్ఫీ తీసుకుంటాడు. అంతా సంతోషంగా జరిగిందని దాసు అంటాడు. మీ ఇంటికి ఎవరూ రారని మీ అమ్మ తిట్టింది ఇప్పుడు నేను ఈ సెల్ఫీ పంపిస్తాను కుళ్ళుకుని చస్తుందని కాశీ ఫోటో పంపిస్తాడు. ఆ ఫోటో చూసి పారిజాతం షాక్ అవుతుంది.
జ్యోత్స్న వచ్చేసరికి ఫోటో మూసేస్తుంది. చూస్తే ఫోన్ పగలగొడుతుందని ఇవ్వనని అంటుంది. కానీ జ్యోత్స్న బలవంత పెట్టడంతో ఫోటో చూపిస్తుంది. స్వప్న దగ్గరకు బావ, అత్త వెళ్ళడం ఏంటి దీప అక్కడ ఉండటం ఏంటని జ్యోత్స్న రగిలిపోతుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది?
శ్రీధర్ ఫ్రస్టేషన్
స్వప్న మావయ్య రెండో భార్య కూతురు కదా. మావయ్యనే వద్దనుకున్న మనిషి ఆయన కూతురు దగ్గరకు ఎలా వెళ్ళిందని అంటుంది. దీప కన్వీన్స్ చేసి తీసుకెళ్లిందని అంటారు. నీకు నీ బావకు పెళ్లి జరుగుతుందనే ఆశలు పోగొట్టడానికి దీప రెడీగా ఉంది. ఇక దాన్ని వదిలేయకూడదని పారిజాతం అంటుంది.
శ్రీధర్ కూతురు చేసిన అవమానాన్ని తలుచుకుని రగిలిపోతాడు. నేనంటే ఎవరికీ భయం గౌరవం లెక్క లేదని ఆవేశంగా మాట్లాడతాడు. కావేరి వచ్చి సర్ది చెప్తుంది. అల్లుడు, అమ్మాయిని ఇంటికి తీసుకురావాలని చెప్తుంది. పని మనిషి కొడుకుని అల్లుడు అనుకోవడం కంటే చెప్పుతో కొట్టుకోవడం నయమని అంటాడు.
కావేరి చురకలు
వాళ్ళ ప్రేమకు మనం విలువ ఇచ్చి ఉంటే వాళ్ళు గౌరవం ఇచ్చేవాళ్ళని కావేరి దెప్పి పొడిచేలా మాట్లాడుతుంది. మీరు చేసిన పనులకు నా కూతురి జీవితం నాశనం అవాలా? ఇప్పుడు వాళ్ళను ఇంట్లోకి రమ్మనండి తర్వాత అది మిమ్మల్ని ఇంట్లోకి పిలుస్తుంది.
నువ్వేనా ఇలా మాట్లాడుతుందని శ్రీధర్ అంటాడు. అవును ఇన్నాళ్ళూ నా కూతురు భవిష్యత్ ఏంటి? మన పెళ్లి గురించి అక్కకి తెలిస్తే నన్ను ఎక్కడ వదిలేస్తారోననే భయం ఉండేది. ఇప్పుడు ఆవిడే మిమ్మల్ని వదిలేసింది అందుకే భయం లేదని తెగించి మాట్లాడుతుంది.
కాంచనకు థాంక్స్ చెప్పిన దీప
మంచి రోజు చూసి అల్లుడిని, అమ్మాయిని పిలవాలని ఖరాఖండిగా చెప్తుంది. శ్రీధర్ దీపా అని గట్టిగా అరుస్తాడు. దీప కార్తీక్ ఇంట్లో అన్ని పనులు చేస్తుంది. స్వప్న ఇంటికి వచ్చినందుకు థాంక్స్ చెప్తుంది. అక్కడ శ్రీధర్ గారిని చూసి మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళి పొరపాటు చేశానని అనిపించింది కానీ మీ మాటలు విని భయం పోయిందని అంటుంది.
కాంచన మాటలు, ప్రవర్తనను దీప పొగుడుతుంది. తన మాటలకు కాంచన ఓదార్పుగా ఫీల్ అవుతుంది. దీపను ఇంటి దగ్గర దింపమని కార్తీక్ కి చెప్తుంది. కాంచన అమ్మ ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారు. ఆమె బాధ పూర్తిగా పోవాలంటే మీరు, జ్యోత్స్న పెళ్లి చేసుకోవాలని దాని ప్రయత్నాలు ఆపొద్దని కార్తీక్ కి చెప్తుంది.
శౌర్య కిడ్నాప్ కి ప్రయత్నం
మీరే ఒక ముందడుగు వేసి మీ మీదే ప్రాణం పెట్టుకున్న జ్యోత్స్నకు అన్యాయం చేయొద్దని చెప్తుంది. నేను కాదని అనుకోలేదు పెళ్లి చేసుకుని పుట్టింటికి మా అమ్మను కానుకగా ఇవ్వాలని అనుకుంటున్నానని చెప్తాడు. రెండు కుటుంబాలు కలవడానికి ఒక సందర్భం వస్తుందని అప్పుడు జరుగుతుందని అంటాడు.
శౌర్య ఇంట్లో ఆడుకుంటూ ఉండగా నరసింహ ముసుగు వేసుకుని వస్తాడు. ఎలాగైనా శౌర్యను కిడ్నాప్ చేసి దీపను ఏడిపించాలని అనుకుంటాడు. శౌర్యను ఎలాగైన ఇంట్లో నుంచి బయటకు రప్పించి తనను ఎత్తుకుపోవాలని ట్రై చేస్తాడు. రిమోర్ట్ కారు ఇంట్లోకి పంపించి దాని ద్వారా శౌర్యను ఇంటి బయటకు రప్పిస్తాడు.
సరిగా శౌర్య బయటకు వచ్చేసరికి కార్తీక్, దీప ఇంటికి వస్తారు. దీంతో నరసింహ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. వాళ్ళని చూసి నరసింహ రగిలిపోతాడు. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.