Karthika deepam october 4th episode: స్వప్న ఇంటికొచ్చిన కాంచన- శ్రీధర్ కి ఘోర అవమానం, నిజం తెలుసుకున్న జ్యోత్స్న
Karthika deepam 2 serial today october 4th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కూతురి కోసం కావేరి శ్రీధర్ దాసు ఇంటికి వస్తారు. కానీ స్వప్న వాళ్ళను గుమ్మంలోనే ఆపి అవమానిస్తుంది. కాంచన వాళ్ళు వస్తే స్వప్న ప్రేమగా వాళ్ళని పిలిచి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది.
Karthika deepam 2 serial today october 4th episode: అసలు బావ మనసులో నేను ఉన్నానా లేదా? అని జ్యోత్స్న పారిజాతాన్ని అడుగుతుంది. మీ బావ మనసులో నువ్వు లేవు అని పారిజాతం చెప్పేసరికి షాక్ అవుతుంది. నీకేలా తెలుసని అడిగితే మీ బావే చెప్పాడు అని నిలదీస్తుంది. లండన్ నుంచి తిరిగి వచ్చినప్పుడే చెప్పాడని అంటుంది.
నువ్వంటే ఇష్టం లేదు
అభిమానం ఉందన్నాడు. జ్యోత్స్నను మరదలిగా తప్ప భార్యగా చూడలేనని అన్నాడని చెప్తుంది. మరి పెళ్ళికి ఎలా ఒప్పుకున్నాడు అన్నాడు అంటే ఏమో ఏదో మ్యాజిక్ జరిగిందని అంటుంది. బావ ఇష్టంతో నాకు సంబంధం లేదు నేను కోరుకున్నది నాకు కావాలి అది ఇంకెవరికీ దక్కడానికి వీల్లేదు.
బావతోనే నా పెళ్లి జరుగుతుంది ఎవరూ కాదన్న కూడా అని హెచ్చరిస్తుంది. స్వప్న అత్త వారింట్లో దీపం వెలిగిస్తూ గుమ్మం వైపు చూస్తూ ఉంటుంది. నువ్వు అనుకుంటున్న మనిషి రాకపోవచ్చని దాసు అంటాడు. దీప వస్తుందనే నమ్మకం ఉందని అంటుంది. ఇంత జరిగిన తర్వాత మన గడప ఎవరూ తొక్కరు, నీకు ఇక అన్ని నేనే అవుతానని దాసు కోడలిని ఓదార్చడానికి చూస్తాడు.
స్వప్న ఇంటికి కావేరి, శ్రీధర్
ఈరోజు రాకపోయిన ఏదో ఒక రోజు మన కోసం ఎవరో ఒకళ్ళు వస్తారని కాశీ సర్ది చెప్తాడు. స్వప్న దీపం వెలిగించే టైమ్ కి కావేరి శ్రీధర్ వస్తారు. స్వప్న వాళ్ళను గుమ్మంలో నువ్వు ఒక్కదానివే రా అమ్మా ఆయన్ని రావొద్దని చెప్పు అంటుంది. కావేరి కూతురిని తిడుతుంది.
నిన్ను అనాథగా వదిలేయకుండా మంచీ చెడు చూడటం కోసం వచ్చానని కావేరి చెప్తుంది. నాకు చూసుకోవడానికి మామయ్య, భర్త ఉన్నారు ఏ అవసరం కోసం నీ ఇంటి గడప తొక్కను అంటుంది. నువ్వు అందరినీ మోసం చేశావ్ డాడీ, నాకు జీవితాంతం తోడు ఉంటారని అనుకున్న వాళ్ళను దూరం చేశావ్.
తండ్రిని అవమానించిన స్వప్న
నన్ను అందరూ ఎలా అనుకుంటారని స్వప్న కోపంగా మాట్లాడుతుంది. మీ మావయ్య చేసింది ఏంటని కావేరి అంటుంది. స్వప్న తన మావయ్యను సమర్థిస్తుంది. మేం నిన్ను ఆశీర్వదించడం కోసం వచ్చామని అంటే అయితే నువ్వు మాత్రమే రా తండ్రి మాత్రం రావడానికి వీల్లేదని చెప్తుంది.
నీ సంతోషం కోసం మేం వస్తే మమ్మల్ని పొమ్మంటున్నావ్ నీకోసం మేం తప్ప ఎవరూ రారని కావేరి అంటుంటే అప్పుడే కార్తీక్, దీప, కాంచన వస్తారు. వాళ్ళను చూసి శ్రీధర్ షాక్ అవుతాడు. మా చెల్లి నా ఇంటికి వచ్చిందని దాసు సంతోషపడతాడు. స్వప్న వాళ్ళ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆహ్వానిస్తుంది.
స్వప్న ఇంటికి కాంచన
కాంచనను పట్టుకుని క్షమించమని అడుగుతుంది. నువ్వేం తప్పు చేశావ్ తప్పు చేసిన వాళ్ళు వేరే ఉన్నారని కాంచన అంటుంది. సంబంధాలు అక్రమం కానీ సంతానం కాదని స్వప్నతో ప్రేమగా మాట్లాడుతుంది. నిన్ను కూతురిగా అనుకుని ఇంటికి వచ్చాను జరిగింది అంతా మర్చిపొమ్మని సర్ది చెప్తుంది.
నేను ఎవరో తెలిసిన కూడా ఇంత ప్రేమ చూపిస్తావని అనుకోలేదని స్వప్న అంటే చెల్లెలు కదా ఎలా వదులుకుంటానని అంటాడు. వీడికి తండ్రి అక్కర్లేదు కానీ చెల్లి కావాలి. భార్యకు భర్త అక్కర్లేదు కానీ సవతి కూతురు కావాలి. అందరూ బాగానే ఉన్నారు నేను తప్ప అని శ్రీధర్ మనసులోనే తిట్టుకుంటాడు.
శ్రీధర్ కు ఘోర అవమానం
స్వప్న దీపకు థాంక్స్ చెప్తుంది. నువ్వు నాకు పెళ్లి చేసి జీవితాన్ని ఇవ్వడమే కాదు మంచి కుటుంబాన్ని ఇచ్చావని అంటుంది. శ్రీధర్ వాళ్ళు గుమ్మంలో ఉండగానే కాంచన వాళ్ళను స్వప్న ఇంట్లోకి తీసుకెళ్తుంది. శ్రీధర్ కోపంగా ఇంకా ఇక్కడే ఎందుకు పద పోదాం అని కావేరి మీద అరుస్తాడు.
కార్తీక్ దీపం వెలిగించమని చెప్తాడు. దీప అమ్మానాన్నను కూడా పిలవమని చెప్తుంది. మమ్మీ నువ్వు ఒక్కదానివే రా అంటుంది. కావేరి వెళ్లబోతుంటే శ్రీధర్ ఆపుతాడు. తండ్రికి ఈ ఇంట్లో చోటు లేదు నా కోసం రావాల్సిన వాళ్ళు వచ్చారని అంటుంది. శ్రీధర్ కూతురు మాటలకు అవమానంతో రగిలిపోతాడు.
సారె ఇచ్చిన కావేరి
కావేరి లోపలికి వెళ్తానంటే శ్రీధర్ తిడతాడు. సరేనని వాళ్ళు గుమ్మం బయట నుంచే కూతురిని చూసుకుంటారు. స్వప్న దీపం వెలిగించిన తర్వాత కాంచన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. కాంచన స్వప్నకు పుట్టింటి సారె ఇస్తుంది. దీపకు ఉన్న విలువ కూడా లేదని శ్రీధర్ ఆవేశంగా కావేరిని తీసుకుని వెళ్లిపోతుంటే స్వప్న వస్తుంది.
తండ్రిని అక్షింతలు వేయొద్దని తల్లిని మాత్రమే ఆశీర్వదించమని స్వప్న తల్లి దగ్గరకు వస్తుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్