Karthika deepam 2 serial today october 3rd episode: శ్రీధర్ కార్తీక్ గురించి ఆలోచిస్తుంటే కావేరి వచ్చి పలకరిస్తుంది. జరిగిన దానికి నీకేం బాధ లేదా అని శ్రీధర్ అడుగుతాడు. ఎప్పుడొకప్పుడు తెలియాల్సిన నిజమే కదా. వాళ్ళు నిన్ను వద్దని అనుకుంటున్నారు నువ్వు ఎందుకు బాధపడతావు. నేను కావాలని అనుకుంటున్నాను కదా.
నేను ఇప్పుడు అందరికీ భయపడాల్సిన పని లేదని కావేరి అంటుంది. తన ఫ్యామిలీకి దూరమయ్యాయని శ్రీధర్ అంటాడు. అది ఫ్యామిలీ అయితే ఇది ఏంటి మీకుంది ఇక నుంచి ఒకటే ఫ్యామిలీ. ఇక నుంచి మీకు ఒకటే ఇల్లు ఒకటే భార్య అని తెగేసి చెప్తుంది. నాకు మంచే జరిగింది ఓ పక్క కూతురు పెళ్లి జరిగింది, మరోవైపు నా భర్త నాకు దక్కాడని సంతోషంగా చెప్తుంది.
కావేరి మాటలకు శ్రీధర్ షాక్ అవుతాడు. ఇక నుంచి మనం ఆలోచించాల్సింది మన కూతురి గురించని చెప్తుంది. అది నన్ను తల ఎత్తుకోలేని పని చేసిందని శ్రీధర్ ఆవేశంగా మాట్లాడతాడు. అక్క కూడా ఇలాగే అనుకుంటుంది జరిగిందేదో జరిగిపోయింది అమ్మాయి దగ్గరకు వెళ్లాలని గట్టిగా చెప్తుంది.
కార్తీక్ శివనారాయణతో మాట్లాడటానికి వెళతాడు. ఏ తప్పు చేయని నా తల్లికి అన్యాయం చేశారు. మీరు అన్నీ ఆలోచిస్తారు కదా తాతయ్య తప్పు చేసింది తండ్రి అయితే తల్లికి ఎందుకు శిక్ష వేశారని నిలదీస్తాడు. అల్లుడు తప్పు చేశాడని ఈ ఇంటి ఆడపడుచుకు పుట్టిల్లు దూరం చేయడం ఎంత వరకు న్యాయం.
మా అమ్మ కూడా మీలాగే మీరు కొన్ని నిమిషాలకు ముందు తనతో బంధాన్ని తెంపుకోవడానికి ముందే మా నాన్నతో బంధం తెంపుకుంది అనగానే అందరూ షాక్ అవుతారు. ఇక మీతో కలిసి బతకలేను అని రెండో భార్యను పిలిచి భర్తను ఇచ్చేసింది. ఆవిడ భర్తను వదిలేస్తే మీరు కూతురిని వదిలేశారు.
రెండో భార్యతో మా నాన్న బాగున్నాడు. మీ ఇంట్లో మీరు బాగున్నారు. కానీ అందరికీ దూరమై అనాథ అయ్యింది మా అమ్మ. ఏ తప్పు చేసిందని నా తల్లి బాధపడాలో చెప్పండి. ఎవరిని బాధపెట్టిందని నా తల్లికి ఈ శిక్ష వేశారో చెప్పండి. భర్తతో సమస్య వస్తే ఆడదానికి అండగా ఉండాల్సింది పుట్టిల్లు.
ఈరోజు ఈ ఇంటి ఆడపడుచుకు మోయలేని కష్టం వస్తే ఓదార్పుగా ఉండాల్సిన మీరే ఆ మనిషిని ఒంటరి దాన్ని చేశారు. ఏం మావయ్య మీకు మా అమ్మ స్వంత చెల్లి కదా ఇంటికి వచ్చి బంధాన్ని తెంపేసుకుంటున్నామని ఎలా చెప్పగలిగారని నిలదీస్తాడు. మా అమ్మ పెళ్లి చేసింది మీరే కదా తాతయ్య.
మంచి వ్యక్తి అని మా నాన్నతో పెళ్లి చేశారు. కానీ మీ నమ్మకాన్ని నాన్న నిలబెట్టుకోలేకపోతే మా అమ్మ ఎవరిని నిలదీయాలి. ఎవరి మీద కోప్పడాలి మీ మీదే కదా. మా అమ్మకు సమాధానం చెప్పాల్సిన అవసరం మీకే కదా ఉంది. కానీ మీరేం చేశారు మా అమ్మతో బంధాన్ని తెంపుకున్నారు.
ఆడదానికి పుట్టింటితో బంధం బతికినంత కాలం ఉంటుందని చెప్పే వాళ్ళు. మరి ఇప్పుడు చేసింది ఏంటి? నా తల్లి కన్నీళ్ళు తుడవలేరా తాతయ్య అని బాధగా అడుగుతాడు. తప్పు ఎవరు చేసిన శిక్ష ఒక్కటే నువ్వు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం ఒక్కటే నేను ఎవరిని క్షమించలేనని శివనారాయణ అంటాడు.
మా అమ్మకు ఎవరూ లేకపోయినా నేను ఉన్నాను. నేను ఉండగా మా అమ్మ ఎప్పటికీ అనాథ కాదు. అనాథ కానివ్వను అని బాధగా వెళ్ళిపోతుంటే జ్యోత్స్న బావ అని పిలుస్తుంది. నన్ను అలా పిలవోచ్చో లేదో అక్కడ ఉన్న వాళ్ళను అడుగు అనేసి వెళ్ళిపోతాడు.
స్వప్న దీపకు ఫోన్ చేసి ఎలా ఉన్నారని అడుగుతుంది. గొడవలన్నీ తమ పెళ్లి వల్ల జరిగాయని స్వప్న బాధపడుతుంది. మీరు ఏ తప్పు చేయలేదని దీప సర్ది చెప్తుంది. అత్తారిల్లు ఎలా ఉందని దీప అడిగితే ఇక్కడ అత్త లేదు. కనీసం అమ్మానాన్న కూడా నన్ను పట్టించుకోలేదు.
నాకోసం ఫోన్ కూడా చేయలేదు. గుర్తింపు లేని పెళ్లి చేసుకున్నాను. పెద్దమ్మ ఎలా ఉందో అన్నయ్య ఎంత బాధపడుతున్నాడో. అన్నయ్యను తీసుకుని ఒకసారి ఇంటికి రమ్మని స్వప్న దీపను పిలుస్తుంది. కార్తీక్ దిగులుగా రావడం దీప చూసి మాట్లాడటం కోసం వెళ్తుంది.
మీ తాతయ్య ఏమన్నారు అంటే క్షమించలేనని చెప్పారని బాధగా చెప్తాడు. నేను ఉండగా నా తల్లి అనాథను కానివ్వను అంటాడు. మిమ్మల్నే నమ్ముకుని మరో మనిషి ఉంది స్వప్న ఫోన్ చేసింది మిమ్మల్ని చూడాలని ఉంది రమ్మని పిలుస్తుందని దీప చెప్తుంది. పెళ్లి చేసుకుని అందరికీ దూరం అయ్యింది.
మీ నాన్న పిన్ని కూడా ఫోన్ చేయలేదు. అందరూ వదిలేశారని బాధపడుతుంది. మీరు వెళ్ళాలి అని దీప చెప్తుంది. ముందు నేను ఇంటికి వెళ్ళాలి నాకోసం మా అమ్మ ఎదురు చూస్తూ ఉంటుందని వెళ్ళిపోతాడు. పారిజాతానికి దాసు ఫోన్ చేస్తాడు. మనవడి పెళ్లి అయితే అక్షింతలు వేయడానికి రమ్మని పిలుస్తాడు.
కొడుకు గురించి తప్ప కూతురి గురించి ఆలోచించవా. ఈ పెళ్లి జరిగితే ఏం అవుతుందో నీకు చెప్పినా కూడా ఎందుకు పెళ్లి ఆపలేదని పారు ఫైర్ అవుతుంది. వాళ్ళ పెళ్లి చేసి నీ కూతురు గొంతు కోశావు. దీప నీ కొడుకు పెళ్లి చేసి నీ కూతురు పెళ్లి ఆగిపోయేలా చేసిందని తిడుతుంది.
బావ వచ్చాడు వెళ్ళిపోయాడు. ఎంత సేపు అమ్మ గురించే మాట్లాడాడు కానీ నా గురించి పెళ్లి గురించి ఎందుకు మాట్లాడలేదని జ్యోత్స్న పారును అడుగుతుంది. వాళ్ళు ఒకే అంటే నీ లైన్ క్లియర్ అయినట్టే కదాని పారిజాతం అంటుంది. అసలు బావ మనసులో నేను ఉన్నానా లేదా అని అంటుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్