Karthika deepam september 30th episode: కార్తీక్, జ్యోత్స్న పెళ్లి క్యాన్సిల్ చేసిన దశరథ- మనసులు మెలిపెట్టించేసిన కాంచన
Karthika deepam 2 serial today september 30th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. శ్రీధర్ చేసిన పని వల్ల కార్తీక్, జ్యోత్స్న పెళ్ళి క్యాన్సిల్ చేస్తున్నట్టు దశరథ తన చెల్లెలు కాంచనకు చెప్తాడు. దీప చేసిన పని వల్లే తమ పెళ్లి ఆగిపోయిందని జ్యోత్స్న తన మీద పగ పెంచుకుంటుంది.
Karthika deepam 2 serial today september 30th episode: కాంచన కావేరిని ఇంటికి పిలిచి మాట్లాడుతుంది. కావేరిని తీసుకుని శ్రీధర్ ని ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని చెప్తుంది. ఇప్పుడు కావేరికి మీ అవసరం చాలా ఉందని అంటుంది. దీప, కార్తీక్ కాంచన నిర్ణయానికి చాలా బాధపడతారు. కార్తీక్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు.
కోడలిగా దాసు ఇంట్లో స్వప్న
భర్త వెళ్లిపోగానే కాంచన గుండెలు పగిలేలా ఏడుస్తుంది. భర్తతో గడిపిన క్షణాలు తలుచుకుని చాలా బాధపడుతుంది. దాసు కొడుకు, కోడలిని ఇంటికి తీసుకొస్తాడు. తన ఇంట్లో ఆడవాళ్ళు ఎవరూ లేరని అంటాడు. దాసు హారతి ఇచ్చి వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానిస్తాడు.
తనకు కూతురైన, కోడలైన ఇక నుంచి స్వప్న అని దాసు అంటాడు. నిజం తెలిసి అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఎలాంటి గొడవ జరుగుతుందో ఏంటోనని స్వప్న బాధపడుతుంది. దీప పరాయిది కాబట్టి మీ నాన్న రెండో పెళ్లి గురించి తెలిసి చెప్పలేకపోయింది. నువ్వు నా కన్న కొడుకువి కదా నీ కళ్ల ముందు అమ్మ మోసపోతుంటే ఎలా చూడగలిగావు అని కాంచన అడుగుతుంది.
మర్యాద లేని ఇంటికి కోడలిగా పంపిస్తావా?
నిజం తెలిస్తే నువ్వు బతకవని భయమేసిందని చెప్తాడు. నా నమ్మకం నన్ను మోసం చేసి బయటకు పోయింది. నా ప్రాణం నీకోసం మిగిలిందని అంటాడు. అప్పుడే దశరథ, శివనారాయణ వస్తారు. దశరథను విషయం చెప్పమని తండ్రి చెప్తాడు. ఇంట్లో మనం తప్ప ఎవరూ లేరని కాంచన అంటుంది.
నీకే ఒక కూతురు ఉండి నీకు కాబోయే వియ్యంకుడికి అక్రమ సంబంధం, అక్రమ సంతానం ఉందని తెలిసిన తర్వాత కోడలిగా పంపించాలని అనుకుంటావా? అలాంటి మర్యాద కోల్పోయిన ఇంటికి కోడలిగా పంపించాలని అనుకుంటావా? అని దశరథ అడుగుతాడు. అన్న మాటలకు కాంచన చాలా ఏడుస్తుంది.
జ్యోత్స్న, కార్తీక్ పెళ్లి క్యాన్సిల్
మర్యాద కోల్పోయిన ఇంటికి కోడలిగా పంపలేనని చెప్తుంది. నేను కూడా నా కూతురిని నీ ఇంటికి పంపించలేనని దశరథ చెప్పబోతుంటే కాంచన ఆపి అర్థం అయ్యిందని అంటుంది. మర్యాద కోల్పోయింది నా మెట్టినిల్లు పుట్టిల్లు కాదు. నా పుట్టింటి గౌరవం కూడా నా బాధ్యత కదా.
నా మేనకోడలిని నా కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయను అంటారు ఇదే కదా మీ నిర్ణయం. నేను గౌరవిస్తాను. కోడలిగా చేయమని నేను అడిగిన మాట. ఇప్పుడు ఆ మాట ఏదని అడిగే అర్హత కోల్పోయానని కాంచన బాధగా చెప్తుంది. అర్హత లేని మనిషికి అడిగే అధికారం లేదు.
మనసులు మెలిపెట్టించేసిన కాంచన
నీ నిర్ణయాన్ని నేను నా కొడుకు గౌరవిస్తున్నాం. మేనకోడలు నా ఇంటి కోడలు అవాలని అనుకున్నాను. అనుకోవడానికి ఆశపడితే సరిపోతుంది. అందుకోవడానికి అదృష్టం కూడా ఉండాలి. పుట్టింటి నుంచి అదృష్టాన్ని అందుకునే అర్హత కోల్పోయానని కాంచన కన్నీళ్ళు పెట్టుకుంటుంది.
సంబంధాన్ని వద్దని అనుకున్నావా? ఈ చెల్లెలితో బంధాన్ని కూడా వద్దని అనుకున్నావా అని ఎమోషనల్ గా అన్నను అడుగుతుంది. అల్లుడినే వద్దని అనుకున్నావా ఈ కూతురిని కూడా వద్దని అనుకున్నావా అని శివనారాయణను అడుగుతుంది. వచ్చినపని అయిపోయింది పద వెళ్లిపోదాం ఇంకాసేపు ఇక్కడే ఉంటే గుండె ఆగిపోయేలా ఉందని శివనారాయణ కన్నీళ్ళను దిగమింగుకుని వెళ్ళిపోతాడు.
కంగ్రాట్స్ దీప
అన్న మాటలకు కాంచన వెక్కి వెక్కి ఏడుస్తుంది. తల్లి బాధను చూడలేక కార్తీక్ కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ఆ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. దీప అప్పుడే ఇంటికి వస్తే జ్యోత్స్న గొడవకు దిగుతుంది. కంగ్రాట్స్ దీప ఏ లక్ష్యంతో ఈ ఇంట్లో ఉన్నావో అది సాధించావు.
నువ్వు ఇక ఈ ఇంట్లో ఉండవు. వచ్చిన పని అయిపోయింది కదా అని జ్యోత్స్న ఆవేశంగా మాట్లాడుతుంది. ఇక మా బావ ఇక్కడికి రాడు. తను రానప్పుడు నీకు ఇక్కడ ఏం పని. ఎలాగూ ఆ ఇంట్లో ముందే అక్కడ సెటిల్ అయిపోయావు కదా. ఇక ఇప్పుడు పర్మినెంట్ గా అక్కడే ఉండిపో అని అంటుంది.
నువ్వు లేకపోతే పెళ్లి జరిగేది
దీప కోపంగా జ్యోత్స్న అంటుంది. నీ మోసానికి నేను బలి అయిపోయాను. అంతా అయిపోయింది నాకు ఊహ తెలిసినప్పటి నుంచి బావ నా మొగుడు అని నేను కన్న కలని నువ్వు సర్వనాశనం చేశావు. పుట్టకముందే మా ఇద్దరికీ పెళ్లి అయిపోయింది. నేను బావకు భార్యగానే పుట్టానని ఊహించుకున్నాను.
ఇవన్నీ నిజం అయ్యేవి నువ్వు లేకపోయి ఉండి ఉంటే. బావకు నాకు పెళ్లి అయ్యేది నువ్వు మళ్ళీ ఇంటికి రాకపోయి ఉంటే అని బాధగా అంటుంది. ఇప్పుడు ఏం జరిగిందని ఇలా మాట్లాడుతున్నావని దీప అడుగుతుంది. ఇంకా ఏం జరగాలి నువ్వు వెళ్ళి నా మనవడికి శ్రీధర్ రెండో సంతానానికి పెళ్లి చేసుకుని తీసుకొచ్చావ్.
నువ్వు ఘనకార్యం చేశావని అనుకుంటున్నావ్. కానీ నువ్వు చేసిన పని వల్ల జ్యోత్స్న పెళ్లి ఆగిపోయిందని పారిజాతం కోపంగా చెప్తుంది. దీప ఆమె మాటలకు షాక్ అవుతుంది. మా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి తప్పు చేసిన మీ ఇంటి సంబంధం మాకు వద్దని చెప్పారు. అంటే కార్తీక్ బావకు నాకు పెళ్లి జరగదని జ్యోత్స్న చెప్పడంతో దీప షాక్ అవుతుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.