Karthika deepam september 24th episode: సుమిత్రను అడ్డం పెట్టి శ్రీకాంత్ తో స్వప్న పెళ్లి ఆగిపోయేలా చేసిన దీప-karthika deepam 2 serial today september 24th episode deepa plans to stop swapna wedding with sumitra help ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam September 24th Episode: సుమిత్రను అడ్డం పెట్టి శ్రీకాంత్ తో స్వప్న పెళ్లి ఆగిపోయేలా చేసిన దీప

Karthika deepam september 24th episode: సుమిత్రను అడ్డం పెట్టి శ్రీకాంత్ తో స్వప్న పెళ్లి ఆగిపోయేలా చేసిన దీప

Gunti Soundarya HT Telugu
Sep 24, 2024 07:21 AM IST

Karthika deepam 2 serial today september 24th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. శ్రీకాంత్ తో స్వప్న పెళ్లి జరుగుతుందని కాశీ దీపకు చెప్తాడు. పెళ్లి ఆపేందుకు దీప సుమిత్రను ఉపయోగించుకుంటుంది. పెళ్లి మండపంలోకి శ్రీధర్ రాకుండా సుమిత్రను గుడి బయట కాపలాగా ఉంచుతుంది.

కార్తీకదీపం 2 సీరియల్ సెప్టెంబర్ 24వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ సెప్టెంబర్ 24వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Karthika deepam 2 serial today september 24th episode: కాశీ రాత్రివేళ దీప దగ్గరకు వస్తాడు. అది పారిజాతం చూస్తుంది. స్వప్నకు వాళ్ళ నాన్న వేరే పెళ్లి చేస్తున్నాడని చెప్తాడు. పారిజాతం దీప దగ్గరకు వస్తుంది. దీపతో నీకు ఏంటి పని అడుగుతుంది. ఆఫీసులో క్యాటరింగ్ ఆర్డర్ ఉంటే ఇవ్వడానికి వచ్చానని అబద్ధం చెప్తాడు.

కాశీ బతకడు

ఈ పెళ్లి జరిగితే స్వప్న బతకదు. ఎలాగైనా పెళ్లి ఆపాలని కార్తీక్ బాబుకు చెప్పడం వల్ల ఇబ్బంది పడతాడని దీప అనుకుని సుమిత్ర దగ్గరకు వెళ్ళి రేపు గుడికి వెళ్దామని పిలుస్తుంది. కావేరి స్వప్నను పెళ్లి కూతురిగా రెడీ చేస్తుంది. నాకు పెళ్లి ఇష్టం లేదని తెలిసి కూడా ఎందుకు బలవంతం చేస్తున్నారని స్వప్న ఏడుస్తూ అడుగుతుంది.

మీ కూతురు మీకు అంత బరువైపోయిందా అని అంటుంది. కూతురు అంటే బాధ్యతతో కూడిన బరువు అంటాడు. కాశీ లేకుండా బతకలేనని స్వప్న అంటే నువ్వు ఉంటే కాశీ బతకడు. గుడి చుట్టుపక్కలకు వచ్చినా పెళ్లి ఆపె ప్రయత్నం చేసిన బతకడని సింపుల్ గా వార్నింగ్ ఇస్తాడు.

గుడిలో సుమిత్ర ఆగిపోయిన శ్రీధర్

కాశీ క్షేమంగా ఉండాలంటే నువ్వు ఈ పెళ్లి చేసుకోవాలని తెగేసి చెప్తాడు. సుమిత్ర దీప చెప్పినట్టు గుడికి వస్తుంది. కాసేపటికి శ్రీధర్ స్వప్న వాళ్ళను తీసుకుని వాస్తాడు. దీప చాటుగా వాళ్ళని గమనిస్తుంది. ఇంకా దీప రాలేదు ఏంటని సుమిత్ర ఫోన్ చేస్తే పక్కనే ఉన్నానని అబద్ధం చెప్తుంది.

శ్రీధర్ గుడిలో ఉన్న సుమిత్రను చూసి ఆగిపోతాడు. శ్రీకాంత్ ప్లీజ్ అర్థం చేసుకోమని స్వప్న ఏడుస్తూ అడుగుతుంది. కానీ శ్రీకాంత్ మాత్రం పెళ్లి అయిన తర్వాత తీరిగ్గా అర్థం చేసుకుంటానులే అంటాడు. కాశీ స్వప్నకు దూరంగా వాళ్ళను చూస్తూ ఉంటాడు. పెళ్లి ముహూర్తానికి టైమ్ అవుతుందని పెళ్లి కూతురు తండ్రిని పిలమని చెప్తాడు.

దీప క్లవర్ ప్లాన్

అటు దీప ఇంకా రాలేదని సుమిత్ర మళ్ళీ ఫోన్ చేస్తుంది. అటు కావేరి కూడా శ్రీధర్ కి ఫోన్ చేసి టైమ్ అవుతుంది రమ్మని పిలుస్తుంది. సుమిత్ర అమ్మగారు ఉండగా మీరు లోపలికి రాలేరు. మీ స్వార్థం కోసం స్వప్నకు అన్యాయం చేస్తున్నారు. నేను ఉండగా కార్తీక్ బాబు చెల్లికి అన్యాయం జరగనివ్వనని అనుకుంటుంది.

సుమిత్ర, కావేరి, శ్రీధర్ గుడి బయట ఉంటారు. దీప కాశీని తీసుకుని పెళ్లి జరిగే దగ్గరకు వెళ్తుంది. నువ్వు ఏం బాధపడకు స్వప్న పెళ్లి జరిగితే పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని శ్రీకాంత్ అంటాడు. అసలు ముందు పెళ్లి జరగాలి కదాని దీప అంటుంది. శ్రీకాంత్ మాత్రం పెళ్లి చేసుకుంటానని అంటాడు.

వెళ్ళిపోయిన శ్రీకాంత్

కానీ నాకు నువ్వు ఇష్టం లేదు పెళ్లి అంటూ చేసుకుంటే కాశీనే చేసుకుంటానని స్వప్న చెప్తుంది. దీప స్వప్న ప్రేమ సంగతి పంతులుకు చెప్తుంది. అదంతా నాకు తెలియదు మా సర్ స్వప్న మెడలో తాళి కట్టమని చెప్పారని శ్రీకాంత్ అంటాడు. అయితే సరే మీ సర్ కి ఫోన్ చేసి గుడిలోకి రమ్మను ఆయన వస్తే పెళ్లి నీతోనే చేస్తానని దీప అంటుంది.

శ్రీకాంత్ శ్రీధర్ కి ఫోన్ చేస్తాడు. కాల్ కట్ చేస్తాడు. వాళ్ళు రారు ఈ పెళ్లి జరగదు ఇక బయల్దేరు అని దీప చెప్తుంది. అస్తి పోయింది, అమ్మాయి పోయింది. నువ్వు మీ నాన్న కలిసి నన్ను వెర్రి వాడిని చేశారని శ్రీకాంత్ కోపంగా పెళ్లి దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. నువ్వు ఏం చేశావో తెలియదు కానీ డాడీని ఆపావు కానీ ఈ ముహూర్తం కాకపోతే ఇంకొకటి పెట్టించి పెళ్లి చేస్తారని స్వప్న అంటుంది.

అందుకని ఇప్పుడు ఏం చేద్దాం అంటే మా ఇద్దరికీ ఇప్పుడే పెళ్లి జరగాలని కాశీ చెప్తాడు. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.