Karthika deepam october 9th episode: సిగ్గు ఉందా మామయ్య అనేసిన జ్యోత్స్న- కాంచన, సుమిత్రను కలిపేందుకు దీప ప్రయత్నం
Karthika deepam 2 serial today october 9th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. జ్యోత్స్న శ్రీధర్ మీద దుమ్మెత్తి పోస్తుంది. నీకు అసలు సిగ్గు ఉందా? నీ రెండో పెళ్లి నా చావుకు వచ్చిందంటూ జ్యోత్స్న మాటలతో విరుచుకుపడుతుంది. ఏం జరిగినా నా కోడలు మాత్రం నువ్వేనని చెప్తాడు.
Karthika deepam 2 serial today october 9th episode: సుమిత్ర ఏడుస్తుంటే దీప వచ్చి ఏం జరిగిందని అడుగుతుంది. మావయ్య జ్యోత్స్నకు వేరే పెళ్లి సంబంధం చూస్తున్నారని చెప్పడంతో దీప షాక్ అవుతుంది. నేను బావను తప్ప ఎవరినీ చేసుకొను బలవంతంగా చేస్తే మీకు మీ కూతురు ఉండదని బయటకు వెళ్లిపోయిందని ఏడుస్తుంది.
కార్తీక్ ని మర్చిపొమ్మని చెప్పలేను
ఇప్పుడు నేనేం చేయాలి. వాళ్ళ నిర్ణయం మార్చుకోమని చెప్పలేను, కార్తీక్ ని మర్చిపొమ్మని చెప్పలేను. నేనే ఎన్నో సార్లు మీ బావ నీ భర్త అని చెప్పాను. నేను వదిన దగ్గరకు వెళ్దామంటే ఏమంటారో అని భయం. జ్యోత్స్న వెళ్తేనే పెద్ద గొడవ జరిగింది. నేను వదిన మొహం చూడలేను తన కళ్లలోకి చూస్తూ మాట్లాడలేను.
వదినని తలుచుకుంటేనే ఏడుపు ఆగడం లేదు. ఈ బాధలు చాలవని దసరా వచ్చింది. ఏటా అమ్మవారికి పూజ చేసే వాళ్ళం ఇప్పుడు ఎలా పూజ చేయాలో చెప్పు. అన్నయ్య చేసిన పనికి కుటుంబం ఎలా ముక్కలయ్యింది. గతంలో ఉన్నట్టు ఉండాలంటే కుటుంబం కలవాలి.
సిగ్గు లేదు మామయ్య నీకు
కలిపే శక్తి ఎవరికీ లేదు. అలాగని వదిన లేకుండా పూజ చేయలేను. వాళ్ళు పంతాలు వదులుకోరు. ఏదో ఒకటి జరిగి అంతా ఒక్కటి అయితే బాగుండని అంటుంది. అప్పుడే తప్పకుండా జరుగుతుందని శౌర్య సంతోషంగా చెప్తుంది. ఆ మాటకు సుమిత్ర చాలా సంతోషపడుతుంది.
అమ్మవారు మీ కోరిక తప్పకుండా నెరవేరుస్తారని దీప కూడా హామీ ఇస్తుంది. జ్యోత్స్న, పారిజాతం శ్రీధర్ ని కలుస్తారు. వయసు అయితే పెరిగింది కానీ నీకు కాస్త కూడా సిగ్గు లేదు. మీరు చేసిన పనికి మిమ్మల్ని ఇంటిల్లి పాది కలిసి కొట్టాలని జ్యోత్స్న శ్రీధర్ ని తిడుతుంది.
నీ రెండో పెళ్లి నా చావుకు వచ్చింది
ఫోన్ చేసి రమ్మన్నది మాటలతో బాధపెట్టడానికా అని అంటాడు. మామని జ్యోత్స్న మాటలతో బాగా దెప్పి పొడుస్తుంది. అందరూ బాగానే ఉన్నారు చేసిన పనికి నష్టపోయింది నేను. నీ రెండో పెళ్లి నా పెళ్ళికి గండం అయ్యింది. అందరినీ నిలదీశాను, గొడవపడ్డాను అయినా లాభం లేదు.
మా తాత వేరే పెళ్లి సంబంధం చూశాడు. ఇన్ని రోజులు బావ నా భర్త నేను కోడలు అని డప్పు వాయించుకుంటూ తిరిగారు. ఇప్పుడు ఇలా జరగడానికి కారణం నువ్వే మావయ్య అని నిందిస్తుంది. నేను తప్పు చేశాను ఒప్పుకుంటాను కానీ మీ పెళ్లి క్యాన్సిల్ చేయడం తప్పు.
సాయం చేస్తా
నాకు మేనకోడలు అయినా కోడలు అయినా నువ్వే. నా రెండో పెళ్ళితో విడిపోయిన ఈ రెండు కుటుంబాలు మీ పెళ్ళితో కలవాలి. నువ్వు ఏం చేయమన్నా ఈ మావయ్య చేస్తాడు. కార్తీక్ ని వదిలిపెట్టకుండా పెళ్లి చేసుకోమని సలహా ఇస్తాడు. అవసరం అయితే ఏ సహాయం చేయడానికైనా సిద్ధమని హామీ ఇస్తాడు.
దీప శౌర్యను తీసుకుని కాంచన ఇంటికి వస్తుంది. కాంచన నవ్వుతూ శౌర్యతో ఆనందంగా ఉంటుంది. దీన్ని తీసుకొచ్చి మంచి పని చేశావు. నాలుగు రోజులు మా ఇంటి దగ్గరే ఉంచుకుంటానని దీపను అడుగుతుంది. అమ్మ ఉంటే ఉంటానని శౌర్య చెప్తుంది. ఇంట్లో అమ్మవారి పూజ పెట్టుకున్నానని రమ్మని దీప పిలుస్తుంది.
కాంచనను పూజకు రమ్మన్న దీప
శౌర్యను అమ్మవారిగా బాల త్రిపుర సుందరి దేవిగా అలంకరించి పూజ చేస్తున్నానని రమ్మని అడుగుతుంది. అన్ని తెలిసి కూడా ఎలా రమ్మంటున్నావని కాంచన అంటుంది. ఆ ఇంటికి వస్తే మా నాన్న ఊరుకుంటాడా అంటుంది. నేను నా ఇంట్లో పూజ చేసుకుంటాను.
ముత్తైదువుగా వచ్చి కూతురిని దీవించమని అడుగుతుంది. ఇంటికి వస్తే వాళ్ళు ఎదురుపడతారు పలకరించాలా? పక్కకి పోవాలా అని కార్తీక్ అడుగుతాడు. ప్రతి సంవత్సరం మేం కూడా పూజ చేసుకుంటామని కాంచన అంటే సుమిత్రమ్మకు ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా అంటుంది.
వస్తానన్న కార్తీక్
సారీ దీప నేను అక్కడికి రాలేనని కాంచన బాధగా చెప్తుంది. ఆ ఇంటి ప్రేమకు దూరమయితే పూజకు కూడా దూరమయినట్టేనని బాధపడుతుంది. మీ గురించి సుమిత్రమ్మ కూడా ఇలాగే ఆలోచిస్తుందని కుటుంబాలు దగ్గర అవాలంటే ఎవరో ఒకరు గీత దాటాలని దీప చెప్తుంది.
నేను వచ్చాను కదా ఏం జరిగింది. పూజ మా ఇంట్లో కదా శౌర్య కోసమైన రమ్మని అంటే కార్తీక్ వస్తానని అంటాడు. కాంచన అమ్మ నా కోసం వస్తారని దీప అంటుంది. మాకు మీరు తప్ప ఎవరున్నారు రమ్మని దీప, శౌర్య బతిమలాడతారు. దీంతో కాంచన సరే వస్తానని ఒప్పుకుంటుంది.
పూజ సుమిత్ర ఇంట్లో
దీప సుమిత్ర దగ్గరకు వచ్చి అమ్మవారి పూజ చేసుకుంటున్నానని తప్పకుండా రమ్మని పిలుస్తుంది. వాళ్ళ మాటలు పారు, జ్యోత్స్న చాటుగా వింటున్నారు. పూజకు అక్కడికి రాలేను మీ ఇంట్లో ఉండటానికే ఇబ్బంది ఇక పూజ ఎలా చేస్తాం. పూజ మా ఇంట్లోనే చేద్దామని సుమిత్ర అంటుంది.
అమ్మవారి సంకల్పం ఎలా ఉందోనని దీప సుమిత్ర మాటకు సరే అంటుంది. శౌర్య వచ్చి రేపు మా ఇంట్లో పూజ చేస్తున్నామని చెప్తుంది. మీ ఇంట్లో కాదు మా ఇంట్లో అని సుమిత్ర అంటే కార్తీక్ ని శౌర్య చెప్పబోతుంటే దీప ఆపుతుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్